మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య తరచుగా వివాదాలు రగులుతూనే ఉంటాయి. ఇటీవల బాలయ్య అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య విభేదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. వీరిద్దరి బాక్సాఫీస్ రైవల్రీ పర్సనల్ గా మారుతోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి గట్టిగా అడగడం వల్లే జగన్ దిగొచ్చి ఇండస్ట్రీ ప్రముఖులతో భేటీ అయ్యారని కామినేని శ్రీనివాస్ అన్నారు. అంత సీన్ లేదు, అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదు అని బాలయ్య కామెంట్స్ చేసి వివాదానికి కారణం అయ్యారు. బాలయ్య వ్యాఖ్యలకు చిరంజీవి కూడా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
25
సినిమాల్లో పోటీ
గతంలో చాలా సందర్భాల్లో బాలకృష్ణ, చిరంజీవి తమ చిత్రాలతో పోటీ పడ్డారు. బాలయ్య, చిరంజీవి సినిమాల విషయంలో ఒక ఆసక్తికర పోలిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ, చిరంజీవి మధ్య హీరోయిన్ల విషయంలో కూడా వైరం నెలకొందా అనే అనుమానం కలిగేలా ఈ పోలిక ఉంది. బాలయ్య, చిరంజీవితో నటించిన సిమ్రాన్, సోనాలి బింద్రే, శ్రీయ శరన్ లాంటి హీరోయిన్ల గురించే ఇదంతా. చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళతో నటించిన సినిమాలు గమనిస్తే ఒక హీరోకి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరోయిన్ మరో హీరోకి డిజాస్టర్ ఇచ్చింది.
35
హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోలిక
ముందుగా సిమ్రాన్ నటించిన సినిమాలు గమనిద్దాం.. సిమ్రాన్ బాలయ్యతో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ గా సంచలనం సృష్టించాయి. కానీ సిమ్రాన్ చిరంజీవితో నటించిన డాడీ, మృగరాజు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. సోనాలి బింద్రే చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో నటించింది. ఇంద్ర మూవీ ఇండస్ట్రీ హిట్ కాగా, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. సోనాలి బింద్రే బాలయ్యతో నటించిన పలనాటి బ్రహ్మనాయుడు చిత్రం డిజాస్టర్ అయింది. ఈ మూవీలో ఇంద్రలో చిరంజీవికి జోడిగా నటించిన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ఇద్దరూ నటించారు. కానీ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది.
ఠాగూర్ లాంటి సూపర్ హిట్ మూవీలో శ్రీయ చిరంజీవితో నటించింది. కానీ ఆమె బాలయ్యతో నటించిన చెన్నకేశవరెడ్డి, గౌతమి పుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాలు నిరాశపరిచాయి. సోనాలి బింద్రే తెలుగులో 6 చిత్రాల్లో నటించింది. మహేష్ బాబుతో మురారి, శ్రీకాంత్ తో ఖడ్గం, చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్..నాగార్జునతో మన్మథుడు, బాలయ్యతో పలనాటి బ్రహ్మనాయుడు చిత్రాల్లో నటించింది. వీటిలో పలనాటి బ్రహ్మనాయుడు మాత్రమే ఫ్లాప్.
55
బాలకృష్ణదే పైచేయి
బాలకృష్ణ నరసింహ నాయుడు, చిరంజీవి మృగరాజు చిత్రాలు 2001లో ఒకేసారి సంక్రాంతికి విడుదలయ్యాయి. నరసింహ నాయుడు సెన్సేషనల్ హిట్ కాగా మృగరాజు నిరాశపరిచింది. విశేషం ఏంటంటే.. రెండు చిత్రాలలో హీరోయిన్ సిమ్రాన్.