రాజమౌళి, మహేష్ మూవీలో విలన్ రోల్.. నభూతో నభవిష్యతి, RRRలో మిస్సయ్యింది

Published : May 25, 2022, 10:42 AM IST

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి ఫ్యామిలీతో కలసి యూఎస్ వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు జక్కన్న వెకేషన్ నుంచి తిరిగి వచ్చారట.

PREV
16
రాజమౌళి, మహేష్ మూవీలో విలన్ రోల్.. నభూతో నభవిష్యతి, RRRలో మిస్సయ్యింది

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాంచరణ్, ఎన్టీఆర్ లని జక్కన్న ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జనాలు నీరాజనాలు పట్టారు. 

26

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి ఫ్యామిలీతో కలసి యూఎస్ వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు జక్కన్న వెకేషన్ నుంచి తిరిగి వచ్చారట. రాగానే మహేష్ సినిమాకి సంబంధించిన వర్క్ షురూ చేసినట్లు తెలుస్తోంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. 

36

ఈ చిత్రానికి స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ కూడా రివీల్ చేశారు. అయితే తాజా సమాచారం మేరకు విలన్ రోల్ మాత్రం అత్యంత శక్తివంతంగా ఉండాలని రాజమౌళి తన తండ్రికి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. నభూతో నభవిష్యతి అనిపించేలా విలన్ రోల్ ని క్రియేట్ చేయాలని రాజమౌళి కోరారట. 

46

సాధారణంగా రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. కానీ ఆర్ఆర్ఆర్ లో అది మిస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ విలన్ కంటే ఎన్టీఆర్, చరణ్ ఫ్రెండ్ షిప్ మధ్యే ఎక్కువగా ఉంటుంది. మహేష్ సినిమాలో మాత్రం ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా విలన్ రోల్ ఉండబోతున్నట్లు టాక్. 

56

అవసరం అయితే విలన్ రోల్ కోసం బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలని అయినా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. భారీ బడ్జెట్ లో ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాని కెఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. 

66

మరోవైపు ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం కమల్ హాసన్, బాలకృష్ణ లాంటి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి మాస్టర్ స్టోరీ టెల్లర్ జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడో ఫుల్ క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 

click me!

Recommended Stories