యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం 1100 కోట్ల వసూళ్లు సాధించి తిరుగులేని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి ప్రభాస్ సత్తాని ఇండియా మొత్తం తెలియజేసిన చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ తన విజన్ తో హాలీవుడ్ స్థాయి విజువల్స్ చూపిస్తూ అబ్బురపరిచారు.
మహాభారతం, కలియుగం లాంటి అంశాలని మిక్స్ చేసి అద్బుతం సృష్టించాడు. కల్కి చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. ఇదిలా ఉండగా కల్కి 2898 ఎడి చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్ లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటిటిలో రిలీజ్ అయితే మరోసారి చూడాలని కోరుకుంటున్నారు.
ఈ చిత్ర ఓటిటి రిలీజ్ పై తాజాగా వస్తున్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ నెలలోనే కల్కి చిత్రం ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగష్టు 23 నుంచి కల్కి చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్.
థియేటర్స్ లో చూపించిన సినిమాకి మరో 6 నిమిషాల సన్నివేశాలని జోడించి ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ జరిగితే ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.