దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి... సంపాదన కోసం అన్ని మార్గాలు వాడేస్తున్న శ్రీముఖి

First Published Jul 12, 2021, 3:29 PM IST

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది నాటి సామెత... ఫేమ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనేది నేటి సామెత. ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతామే తెలియని గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న నటులు, యాంకర్స్ ఈ సూత్రాన్ని గట్టిగా పాటిస్తారు.

డిమాండ్ ఉన్నప్పుడే తమ ఫేమ్ ఉపయోగించుకుని బ్యాంకు బ్యాలన్స్ లు,  కార్లు, ఇళ్ళు బంగ్లాలు సంపాదించుకుంటారు. స్టార్ యాంకర్ శ్రీముఖి అదే పనిలో ఉన్నారు. ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని ఆమె వదలడం లేదు.
undefined
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సంస్థల ఉత్పత్తులు, సేవలను ప్రమోట్ చేస్తూ... చేతినిండా సంపాదిస్తున్నారు.
undefined
హోటల్స్, రిసార్ట్స్ లో వెకేషన్ కి సంబంధించిన వీడియోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం ద్వారా సదరు సంస్థల నుండి రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
undefined
ఆ వీడియోలలో ట్రేడింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ మరికొంత ఆదాయం గడిస్తున్నారు. ఆ వీడియోస్ వ్యూస్ కి యూట్యూబ్ నుండి వచ్చే ఆదాయం అదనం. ఇంస్టాగ్రామ్ లో కూడా శ్రీముఖి అనే ప్రొడక్ట్స్ ని ప్రోమోట్ చేస్తున్నారు.
undefined
తాజాగా జియో మార్ట్ ని ప్రోమోట్ చేస్తూ ఓ వీడియో చేసిన ఆమె, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తమకు కావలసిన గ్రాసరీ జియో మార్డ్ ద్వారా కొనడం ఎంతో లాభదాయం అని తెలియజేశారు.
undefined
అలా టీవీ షోలు, సినిమాలు, ప్రొమోషన్స్ ద్వారా శ్రీముఖి మంచిగా ఆర్జిస్తున్నారు.  కరోనా కారణంగా పబ్లిక్, ప్రైవేట్ ఈవెంట్స్ లేకుండా పోయాయి. లేకుంటే శ్రీముఖి ఆదాయం మరింత ఎక్కువగా ఉండేది. అయినా కూడా అందుబాటులో ఉన్న మార్గాలను వాడుకుంటూ శ్రీముఖి భారీగా సంపాదిస్తున్నారు.
undefined
తోటి యాంకర్స్ రష్మీ, అనసూయలది కూడా ఇదే శైలి.  ఇక బుల్లితెర షోలతో బిజీగా ఉన్న ఆమె.. క్రేజీ అంకుల్స్ మూవీతో హీరోయిన్ గా కూడా మారారు. ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.
undefined
మరోవైపు శ్రీముఖి పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ నెటిజెన్ మీకు సంబంధం చూశానని కామెంట్ చేయగా, ఎవరు అంటూ నెటిజెన్ కి రిప్లై ఇచ్చింది శ్రీముఖి. అయితే 33ఏళ్ళు దాటేవరకు పెళ్లి చేసుకోనని శ్రీముఖి గతంలో గట్టిగా చెప్పారు.
undefined
undefined
click me!