బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్స్ ను బయటకు పంపించే సందర్భాలు ఇవే..?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తరువాత కంటెస్టెంట్స్ బయటకు రావడం అంటే అది ఎలిమినేషన్ అయిన తరువాతే.. కాని మధ్యలో ఎవరినైనా బయటకు పంపించాల్సి వస్తే.. ఏ సందర్భాల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ లేకుండా బయటకు పంపిస్తారో తెలుసా..? 
 

బిగ్ బాస్ రియాలిటీ షో.. 100 రోజుల గేమ్ షో.. వెండితెర, బుల్లితెర తారలు మూడు నెలలు ఒకే ఇంట్లో ఉంటూ.. ఆడియన్స్ ను రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ.. ప్రసన్నం చేసుకునే షో.. అయితే ఈ షో కోసం హౌస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ బయటకు వచ్చేది ఎప్పుడు.. ప్రతీ వారం ఎలిమినేషన్ ద్వారా ఒక్కొక్కరు బయటకు వస్తుంటారు. కాని ఎలిమినేషన్ లేకుండా ఏ కంటెస్టెంట్ అయినా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా..? ఏ కారణాల చేత కంటెస్టెంట్స్ ను బయటకు పంపిస్తారు తెలుసుకుందాం...? 

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తరువాత ప్రతీ వారం ఎలిమేషన్స్ జరుగుతాయి. హౌస్ లో ఎక్కువ నామినేషన్లు పడిన వారికి ఓటింగ్ ప్రక్రియ ద్వారా.. ఆడియన్స్ నుంచి తక్కువ ఓట్లు వచ్చినవారిని వీకెండ్ లో ఎలిమినేట్ చేస్తారు. ఇది బిగ్ బాస్ జరిగే అన్నిరోజులు ప్రతీవారం జరిగే ప్రక్రియే. అయితే కొంత మంది కంటెస్టెంట్స్ మాత్రం కొన్ని కారణాల వల్ల మధ్యలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళిన వారు బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో కొంత మంది ఉన్నారు. 
 


విపరీతమైన అనారోగ్యానికి గురయినప్పుడు.. టాస్క్ ల పరంగా మేజర్ ఇంజ్యూరీలు అయినప్పుడు.. హౌస్ లో ఉండలేమని.. చేతులు ఎత్తేసినప్పుడు.. ఇలా రకరకాల కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేస్తుంటారు. అయితే ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈక్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్నసమయంలో.. స్టార్ నటి డాన్సర్ ముమైత్ ఖాన్.. బిగ్ బాస్ మధ్యలో బయటకు వెళ్ళాళ్సి వచ్చింది.  ఆటైమ్ లో ఆమె ఓ కేసులో ఉండటంతో.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెను కొన్ని రోజులు హౌస్ నుంచి బయటకు పంపించారు. ఆతరువాత మళ్లీ ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. 
 

ఇక ఇదే సీజన్ లో సంపూర్ణేష్ బాబు.. కూడా తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనని.. బయటకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. తన వాళ్ళను చూడకుండా.. బాహ్య ప్రపంచానికి దూరంగా. ఈ ఇంట్లో నేను ఉండలేని అంటూ బోరున ఏడ్చాడు సంపూర్ణేష్ బాబు. నన్ను పంపించండి ప్లీజ్ అంటూ వెడుకున్నాడు. రాను రాను సంపూ పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో.. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఆయన్ను ఇంటికి పంపించేశారు. ఆతరువాత సీజన్ 3 లో కూడా ఇలాంటిదే జరిగింది. 

బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న గంగవ్వ కూడా తనను బయటకు పంపించాలని వేడుకుంది. ఆరోగ్యం బాగోలేదని.. ఈ ఇంట్లో ఉండలేకపోతున్నానని.  ఆమె బిగ్ బాస్ కు విన్నవించుకున్నారు. దాంతో రెండు వారాల తరువాత ఆమె పరిస్థితి బాగోలేదని.. బిగ్ బాస్ ఆమెను ఎలిమినేషన్ లాంటి ప్రక్రియ లేకుండానే పంపించేశారు. కాని గంగవ్వ ఉన్నన్ని రోజులు హౌస్ లో అందరికి ఫేవరెట్ గా నిలిచింది. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది గగ్గవ్వ. అంతే కాదు ఆమెకు నాగార్జున ఇల్లు కూడా కట్టించాడు. 

ఇక లాస్ట్ సీజన్.. అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కూడా ఇలాంటిదే జరిగింది. సీనియర్ యాక్టర్ శివాజీ.. గేమ్ లో నెంబర్ వన్ గా ఉండగా.. ఆయనే విన్ అవుతారు అనుకున్న టైమ్ లో.. శివాజీకి గాయం కారణంగా హౌస్ నుంచి బయటకు వెళ్ళక తప్పలేదు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించక తప్పని హెల్త ప్రాబ్లమ్ వల్ల శివాజీ మధ్యలోనే హౌస్ నుంచి బయటకు రావల్సి వచ్చింది. ఇలా చాలామంది ఇతర భాషల్లో  కూడా కంటెస్టెంట్స్ మధ్యలోనే బయటకు రావల్సి వచ్చింది. 

Latest Videos

click me!