Bigg boss telugu 8
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ని సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఫిక్స్ చేశారు. గ్రాండ్ లాంచ్ లో కింగ్ నాగార్జున, హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్, ఇతర సెలెబ్రిటీలు సందడి చేయబోతున్నారు.
Bigg Boss Telugu Season 8
ఈ తరుణంలో బిగ్ బాస్ షోకి సంబంధించిన ఆసక్తికర విషయాలు, గత సీజన్స్ లో ఏం జరింగింది లాంటి అంశాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే చాలా మంది బిగ్ బాస్ షో అభిమానులు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే ఈసారి బిగ్ బాస్ 8లో ఎలిమినేషన్ పక్రియ ఎలా ఉండబోతోంది అని.
Shobha Shetty
సాధారణంగా ఎలిమినేషన్ ప్రక్రియని ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ మేరకు ఆడియన్స్ ఓటింగ్ చేయాలని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కోరుతారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఆ వారం జరిగే టాస్కుల్లో తమకి నచ్చని లేదా ఎక్కువ నెగిటివ్ అంశాలు ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారు. ఎక్కువ ఓటింగ్ నామినేషన్స్ వచ్చిన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రక్రియకి నామినేట్ అవుతారు.
Bigg Boss Telugu
ఉదాహరణకి తొలి వారం 6 మంది సభ్యులు ఎమిలినేషన్ కి నామినేట్ అయితే వారంతా ఆడియన్స్ ని రిక్వస్ట్ చేసుకుని మద్దతుగా ఓట్లు పొందాల్సి ఉంటుంది. అందరికంటే లీస్ట్ గా ఓట్లు పొందిన కంటెస్టెంట్ ని నాగార్జున ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. మిగిలిన వాళ్ళు సేఫ్ అవుతారు. సాధారణంగా జరిగే ప్రక్రియ ఇదే. ఈ ఐతే ఈ సీజన్ లో ఈ ప్రాసెస్ లో ఏమైనా మార్పులు చేసారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రేక్షకుల్లో మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ అంశంలో చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఎలిమినేషన్ వివాదం అయ్యింది కూడా. అంతెందుకు గత బిగ్ బాస్ 7 సీజన్ లోనే ఎలిమినేషన్ వివాదం అయ్యింది. ఎంత ట్రోలింగ్ జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు.
Bigg Boss Telugu 7
అసలు బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే జెన్యూన్ గా జరుగుతుందా .. లేక వాళ్ళకి కావలసిన వాళ్ళని సేవ్ చేస్తూ ఫ్రాడ్ గేమ్ ఆడతారా అనే అనుమానాలు ఉన్నాయి. గత సీజన్ లో ఈ వివాదం శోభా శెట్టి విషయంలో చెలరేగింది. శోభా శెట్టి చాలా సందర్భాల్లో ఎలిమినేట్ కావలసింది అనేది ప్రేక్షకుల వాదన. కానీ ఆమెని ఎలిమినేట్ చేయకుండా టేస్టీ తేజ, ఆట సందీప్, నయని పావని లాంటి వాళ్ళని బలి చేసినట్లు ట్రోలింగ్ జరిగింది. శోభా శెట్టిని రక్షించడం కోసం.. ఓట్లు ఎక్కువ పడ్డ వారిని కూడా ఎలిమినేట్ చేసారని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
Nagarjuna
ఎలిమినేషన్ లో కొన్ని జిమ్మిక్కులు కూడా చేస్తుంటారు. ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేటి చేసి.. అతడిని తిరిగి రెండు మూడు వారాల తర్వాత వైల్డ్ కార్డు రూపంలో తీసుకువస్తుంటారు. బిగ్ బాస్ 3 లో అలీ రెజని అలాగే చేశారు. ఈసారి కూడా అలాంటి జిమ్మిక్కులు చేస్తారా అనే చర్చ జరుగుతోంది.