Sai Pallavi House: నటి సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆమె ఇళ్ల గురించి చాలామందికి తెలియదు. ఆడంబరాలకు పోకుండా, ప్రకృతికి దగ్గరగా, చాలా సింపుల్‌గా ఉండే తన ఇళ్ల ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సౌత్ ఇండియాలో సాయి పల్లవి తన సహజ నటన, సింపుల్ లైఫ్‌స్టైల్‌తో అభిమానులను గెలుచుకున్నారు. సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ అయినా, ఆమె ఇళ్లు కూడా తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కుటుంబ విలువలు, ప్రకృతితో ఆమెకున్న బంధాన్ని చూపిస్తాయి.
24
సాయి పల్లవి ఇంట్లో ఏమేమి ఉంటాయంటే?
సాయి పల్లవి ప్రధాన నివాసం తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉంది. ఈ ఇంట్లో ఖరీదైన అలంకరణ వస్తువుల బదులు చెక్క ఫర్నిచర్, విశాలమైన హాల్, కుటుంబ ఫోటోలు, పూజ గది, పచ్చని మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇంట్లోకి సహజమైన వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు.
34
కొండలు, పచ్చదనం మధ్య సాయి పల్లవి ఇల్లు..
కోయంబత్తూర్ ఇల్లు కాకుండా, నీలగిరి జిల్లాలోని కోటగిరిలో సాయి పల్లవికి మరో ఇల్లు ఉంది. కొండలు, పచ్చదనం మధ్య ఉన్న ఈ ఇల్లు, నగర జీవితంలోని హడావిడికి దూరంగా ప్రశాంతంగా గడపడానికి కట్టుకున్నారు. ఇది ఆమె సింపుల్ లైఫ్‌స్టైల్‌కు అద్దం పడుతుంది.
మీడియా రిపోర్టుల ప్రకారం, సాయి పల్లవి మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయినా ఆమె విలాసవంతమైన బంగ్లాల కన్నా, కుటుంబంతో ప్రశాంతంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తారు.