ఇంతలోనే ఇంద్రమ్మ మరొక అమ్మాయిని శౌర్య బదులుగా తీసుకొని రావడంతో అది చూసి దీప, కార్తిక్ లు ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇప్పుడు ఇంద్రుడు ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. మరొకవైపు సౌర్య తన అమ్మానాన్నలు వచ్చారు అని బయటికి వెళ్లాలని అనుకుంటుండగా అక్కడున్న వారు మాత్రం అడ్డుపడుతూ ఉంటారు. ఆ తర్వాత దీప,కార్తీక్ లు ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి మేము వెళ్లొస్తాము అని అంటుంది దీప.