Bigg Boss Telugu 6: నామినేషన్స్ లో 10 మంది... వచ్చే వారం మరో టాప్ కంటెస్టెంట్ అవుట్!

Published : Nov 01, 2022, 12:18 AM IST

నామినేషన్స్ డే బిగ్ బాస్ హౌస్ సీరియస్ గా మారిపోయింది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉండగా... వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు మినహాయించి అందరూ నామినేట్ అయ్యారు. 

PREV
17
Bigg Boss Telugu 6: నామినేషన్స్ లో 10 మంది... వచ్చే వారం మరో టాప్ కంటెస్టెంట్ అవుట్!
Bigg Boss Telugu 6


నామినేషన్స్ డే హౌస్లో ఆటోమేటిక్ గా హీట్ పెరిగింది. కంటెస్టెంట్స్  నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఇనయా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా ప్రకటించుకుంది. బిగ్ బాస్ సీజన్ 6 సగం ముగిసింది. ఎనిమిది వారాలు పూర్తి కాగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈ ఆదివారం కంటెస్టెంట్ సూర్య ఎలిమినేటై ఇంటికి వెళ్ళిపోయాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న సూర్య ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. 
 

27
Bigg Boss Telugu 6


సూర్య ఎలిమినేషన్ తో హౌస్లో 13 మంది మిగిలారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ వీడనున్నారు. నేడు సోమవారం కావడంతో బిగ్ బాస్ ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఉన్న దిష్టి బొమ్మలపై కంటెస్టెంట్స్ ఫోటోలు అతికించి ఉన్నాయి. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. నామినేట్ చేయనున్న కంటెస్టెంట్ ఫోటో ఉన్న బొమ్మకు కుండ తలగా తగిలించి దాన్ని బద్దలు కొట్టాలి.  
 

37
Bigg Boss Telugu 6


నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ గీతూని ఆదేశించాడు. గీతూ వరుసగా భార్యాభర్తలు రోహిత్, మెరీనాలను నామినేట్ చేసింది. బిగ్ బాస్ గేమ్ కలిసి ఆడారని మెరీనాను, రోహిత్ కి అసలు గేమ్ పై ఎలాంటి క్లారిటీ లేదన్న కారణంతో నామినేట్ చేసింది. నెక్స్ట్ రేవంత్... కీర్తి, ఇనయాలను నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి... ఇనయా, రేవంత్ లను చేయడం జరిగింది. రేవంత్ ని ఆదిరెడ్డి నామినేట్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. 
 

47
Bigg Boss Telugu 6

ఇక ఎవరు ఎవరిని నామినేట్ చేశారని పరిశీలిస్తే... మెరీనా... శ్రీసత్య, గీతూఆదిత్య... శ్రీసత్య, ఫైమాకీర్తి... గీతూ, రేవంత్ రోహిత్... గీతూ, శ్రీసత్య వాసంతి... గీతూ, రేవంత్ రాజ్. .. గీతూ  , బాల ఆదిత్య ఫైమా... బాల ఆదిత్య, ఇనయా శ్రీసత్య...బాల ఆదిత్య, ఇనయా ఇనయ... గీతు, ఆదిరెడ్డి శ్రీహన్... కీర్తి, ఇనయా లను వరుసగా నామినేట్ చేయడం జరిగింది.

57
Bigg Boss Telugu 6

అత్యధికంగా గీతూ, ఇనయా వ్యతిరేకతకు గురయ్యారు. చేపల చెరువు టాస్క్ లో గీతూ సరిగా ఆడలేదు. మొదటి రౌండ్ లోనే ఎలిమినేట్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ సంచాలక్ గా నియమిస్తే, కొత్త రూల్స్ పెట్టి కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెట్టిందనే కారణాలు చెబుతూ ఆమెను నామినేట్ చేశారు.

67
Bigg Boss Telugu 6


ఇనయా సైతం కంటెస్టెంట్స్ నుండి అత్యంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఇనయా, ఫైమా మధ్య భారీ వాగ్వాదం చోటు చేసుకుంది. నిజానికి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరూ శత్రువులుగా మారిపోయారు. బాల ఆదిత్యకు ఫైమా గురించి ఇనయా తప్పుగా చెప్పిందని తెలిసి ఫైమా ఆమెను నామినేట్ చేసింది. అలాగే మిగతా కంటెస్టెంట్స్ ఆమెది ఫేక్ గేమ్ అనే కారణం చూపుతూ నామినేట్ చేశారు. ప్రేమించిన సూర్యకు వెన్నుపోటు పొడిచినట్లు చిత్రీకరించారు. నిజంగా సూర్యను ప్రేమిస్తే ఎందుకు నామినేట్ చేశావని ప్రశ్నించారు. 
 

77
Bigg Boss Telugu 6

ఇక ఈ వారం రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాల ఆదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా, ఫైమా మొత్తం 10 మంది నామినేట్ అయ్యారు. ఒక్క ఓటు కూడా పడని రాజ్, వాసంతి, శ్రీహన్ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు. ఈ క్రమంలో వచ్చే వారం మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటిని వీడనున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories