Richest Indian Singer : దేశంలో అత్యంత సంపన్న గాయకుడు ఎవరో తెలుసా? ఆస్తి ఎంతంటే..

First Published Sep 6, 2024, 8:51 PM IST

భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే టక్కున ముకేష్ అంబానీ పేరు వినిపిస్తుంది. రిచ్చెస్ట్ హీరో, హీరోయిన్లు ఎవరంటే కూడా ఒకరిద్దరి పేర్లు ఊహించి చెప్పగలం. మరి రిచ్చెస్ట్ సింగర్ ఎవరంటే..? ఊహించి కూడా చెప్పలేం. అలాంటిది ఓ ఇండియన్ సింగర్ ఆస్తి విలువ రూ. 1728 కోట్లు అంటే మీరు నమ్మగలరా?  

భారతీయ సినిమాల్లో సంగీతం, పాటలు కీలకపాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు  ఇవే సినిమా మొత్తాన్ని భుజానెత్తుకుని విజయం సాధించిపెడతాయి. ఇలా సినిమాల్లో కీలకంగా వ్యవహరించే  మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ కు పెద్దగా ప్రాధాన్యత వుండదు. ముఖ్యంగా గాయకుల పరిస్థితి మరీ దారుణం... కొందరు సింగర్స్ వెయ్యి రెండువేలకు పాటలు పాడినట్లు చెప్పిన సందర్భాలు అనేకం.  

అందరు సింగర్స్ అర్జిత్, దిల్జిత్ దోసంజ్ లా ఒక్కపాటకు కోట్ల రూపాయలు తీసుకుంటారనుకుంటే పొరపడినట్లే. అయితే ఇలా కోట్లు తీసుకునే ప్రొఫెషనల్ సింగర్స్ కంటే అప్పుడప్పుడు గాత్రం సరిచేసుకునే ఓ సింగర్ బారీ ఆస్తులు కలిగివున్నాడు. ఇలా అత్యధికంగా సంపాదించి భారీ ఆస్తులు కలిగిన భారతీయ గాయకులు ఎవరో తెలుసుకుందాం. 

దిల్జీత్ దోసంజ్

దిల్జిత్ దోసంజ్... ఈ పేరు భారతీయ సంగీత ప్రపంచంలో బాగా వినిపిస్తోంది.  'దిల్-లుమినాటి' పర్యటనలతో అంతర్జాతీయ స్టార్ గా మరాడు దిల్జీత్. 2023లో కోచెల్లాలో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ కళాకారుడిగా కూడా ఆయన చరిత్ర సృష్టించాడు.

దిల్జిత్ ఒక సినిమాకు రూ. 3-4 కోట్లు తీసుకుంటాడు. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల వివాహ వేడుకలో దిల్జిత్ ప్రదర్శన ఇచ్చాడు. ఇందుకుగాను అతడు రూ.4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే తన పాటలతో భారీగా సంపాదిస్తున్న దిల్జీత్ నికర ఆస్తి రూ. 172 కోట్లు.

Latest Videos


అర్జిత్ సింగ్

'వే కమలాయ', 'కేసరియా', 'దేశ్ మేరే' వంటి హిట్ పాటలతో అర్జిత్ సింగ్ భారతీయులను అలరించారు.ఇలా తన పాటలతో అందరినీ మంత్రముగ్దుల్ని చేస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడిగా మారారు. ప్రస్తుతం అర్జిత్ ఒక పాటకు రూ. 20 లక్షల నుండి రూ. 22 లక్షల వరకు తీసుకుంటాడు. అర్జిత్ నికర ఆస్తి రూ. 414 కోట్లు. 

ఎ.ఆర్. రెహమాన్

ఎ.ఆర్. రెహమాన్... పరిచయం అక్కర్లేని పేరు. సంగీత దర్శకుడిగానే కాదు గాయకుడిగా కూడా ప్రజల మనసులు దోచుకున్నాడు రెహమాన్. ఆస్కార్ అవార్డ్ తో ఇతడి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది. 

తన సంగీతం, పాటలతో భారీగా అభిమానులనే కాదు డబ్బులు కూడా సంపాదించారు రెహమాన్. అతడు ఒక్క పాటకు రూ.3 కోట్లు తీసుకుంటాడని టాక్. సంగీత దర్శకత్వానికి ఇంకా భారీగా తీసుకుంటాడు.  ఇలా రెండుచేతులా సంపాదిస్తున్న రెహమాన్ ఆస్తి రూ. 1,728 కోట్లు వుంటుంది. ఇతడే భారతదేశంలో అత్యంత సంపన్న సంగీతకారుడు, సింగర్. 

57 ఏళ్ల రెహమాన్ కు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వుంది. సంగీత ప్రపంచంలో ఆయన చేసిన అద్భుతాలకు గాను అనేక అవార్డులు వరించాయి.  ఆస్కార్ తో పాటు గ్రామీ, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను రెహమాన్ గెలుచుకున్నాడు.

click me!