సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

First Published | Sep 6, 2024, 8:37 PM IST

ఈ ఫోటోను సరిగ్గా గమనించండి.. ఇందులో మన దేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కనిపిస్తున్నారు కదా..? ఆయనతో పాటు ఉన్న ఆ చిన్న కుర్రాడు ఓ స్టార్ హీరో అని మీకు తెలుసా..? ఇంతకీ ఎవరతను..? 
 

ఒక్కోసారి సెలబ్రిటీ స్టార్స్ కు సబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్చపరుస్తుంటాయి. ఈ ఫోటోలో ఉన్నది ఫలానా స్టార్ కదా.. అవునా.. నిజమా.. అని ఆశ్చర్యపోతుంటారు. అలాంటి ఫోటోనే ఇది. ఈఫోటోలో మన మొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఓ పిల్లాడు  కనిపిస్తున్నాడు. ఆయన ఇప్పుడు సీనియర్ స్టార్ హీరో. 

భారత మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న టీచర్స్ డే చేసుకోవడం తెలుసు కదా.. తాజాగా జరిగిన టీచర్స్ డే  సందర్భంగా సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా వేడుకలు జరుపుకోగా.. అందులో భాగంగా ఓ ఫోటో తెగ వైరల్ అయ్యింది. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 సర్వేపల్లి రాధాకృష్ణన్ కు సంబంధించిన పాత ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. అందులో సర్వేపల్లితో పాటు సౌత్ ఇండియన్  స్టార్ హీరో కూడా కనిపించడం విశేషం.  ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన ఆ పిల్లాడు ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఒకడు. ఎన్నో వందల సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నారాయన. 

ప్రభాస్ వర్షం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..?


Actor Kamal Haasan

తమిళ పరిశ్రమకు చెందిన ఆ నటుడు తెలుగులో కూడా అదే స్టార్ డమ్ ను కొనసాగించాడు. అంతే కాదు  ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు సంపాదించి లోకనాయకుడు అనే బిరుధు కూడా సాధించాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు విశ్వ నటుడిగా మన్ననలు పొందిన కమల్ హాసన్. 

కల్కి సినిమాలో అమితాబ్ డూప్ గా నటించింది ఎవరు..?
 

అవును ఆ పిల్లాడు ఎవరనో కాదు లోక నాయకుడు కమల్ హాసన్. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అందులో ఈ ఫోటో కూడా నెట్టింట తెగ తిరిగేస్తుంది. మన మొదటి రాష్ట్రపతి  ఉన్న టైమ్ లో కమల్ చిన్నారిగా ఉండటమే కాదు.. అప్పుడు నటనలో రాష్ట్రపతి మెడల్ కూడా సాధించడం విశేషం.

ప్రస్తుతం 70 ఏళ్ళ ఏజ్ లో కూడా హీరోగా కొనసాగుతున్న కమల్ హాసన్... చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మహానటి సావిత్రతో కూడా బాలనటుడిగా నటించి మెప్పించాడు కమల్ హాసన్. సావిత్రి తనయుడిగా  నాలుగేళ్ల వయసులోనే ఆయన కలత్తూర్ కణమ్మ అనే సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో అద్భుత నటనకు గాను కమల్ కు రాష్ట్రపతి మెడల్ లభించింది. 

అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కమల్ హాసన్ కు స్వయంగా బంగారు పతకాన్ని అందించారు. ఇక ఈమధ్య  కమల్ హాసన్ సినిమాలు పెద్దగా హిట్ అవ్వడంలేదు. విక్రమ్ హిట్ తరువాత కమల్ చేసిన  భారతీయుడు 2 సినిమా అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్ల లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. 
 

ఇక ఆయన తెలుగులో నటించిన పాన్ ఇండియా సినిమా కల్కి మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రభాస్ హీరోగా  కమల్ విలన్ గా నటించిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఇందులో ఆయన పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో కమల్ పాత్ర కొద్దిసేపే ఉంటుంది. కాని ఇక కల్కి సీక్వెల్ లో మాత్రం కమల్ హాసన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు సమాచారం. 
 

Latest Videos

click me!