ఓర్మాక్స్ మీడియా తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన టాప్ 10 హీరోయిన్ల జాబితాని విడుదల చేసింది. ఇందులో రష్మిక టాప్‌లోకి దూసుకొచ్చింది. నయనతార, సాయిపల్లవి పడిపోయారు.
ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోలు, హీరోయిన్లకి సంబంధించిన జాబితాని విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన జాబితా వచ్చింది. ఇందులో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. రష్మిక మందన్నా ఒక్కసారిగా దూసుకొచ్చి మళ్లీ తన స్థానంలోకి వచ్చింది. ఇక సాయిపల్లవి, నయనతారలు డౌన్ అయ్యారు. అదే సమయంలో త్రిష, కాజల్, సమంత వంటి హీరోయిన్లు స్థానాలేంటి? ఎవరు టాప్ లో ఉన్నారు ? ఎవరు బాటమ్‌లో ఉన్నారనేది చూద్దాం.
25
సమంతకి తిరుగులేదు, తనే నెంబర్ 1
సమంత మరోసారి తన సత్తా చాటింది. తనకు తిరుగులేదనే విషయాన్ని చాటి చెప్పింది. సెప్టెంబర్ నెలలో కూడా ఆమె మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తనకు తిరుగే లేదని నిరూపించింది. చాలా నెలలుగా ఆమె మొదటి స్థానంలో ఉంటున్న విషయం తెలిసిందే. మధ్య ఒకటి రెండు సార్లు డౌన్ అయ్యింది. కానీ మళ్లీ తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
సమంత చివరగా `మా ఇంటి బంగారం` చిత్రంతో విజయాన్ని అందుకుంది. ఇది దాదాపు వంద కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ ఉంది. దీంతో మళ్లీ సినిమాలకు గ్యాప్ వచ్చింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టివ్‌గానే ఉంది సమంత.
35
నాల్గో స్థానంలోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా
రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్, `ఆర్‌ఆర్‌ఆర్` నటి అలియాభట్ ఉంది. మూడో స్థానంలో కూడా మరో బాలీవుడ్ నటి, `కల్కి 2898 ఏడీ` హీరోయిన్ దీపికా పదుకొనె ఉన్నారు. ఇక నాల్గో స్థానంలో మాత్రం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఉండటం విశేషం. ఆమె ఆగస్ట్ నెలలో ఏడో స్థానంలో ఉండగా ఇప్పుడు మూడు స్థానాలు ఎగబాకి నాల్గో స్థానంలో సెటిల్ అయ్యింది.
రష్మిక మందన్నా ఇటీవల `రణబాలి`తో విజయాన్ని అందుకుంది. ఇందులో తన భర్త విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. దీంతోపాటు `మైసా`, `రాకా`, `ఎంఎస్ సుబ్బలక్ష్మి` బయోపిక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్నా.
ఐదో స్థానంలో సాయిపల్లవి ఉంది. ఆగస్ట్ లో సాయిపల్లవి నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక్క స్థానం పడిపోయింది. ఆమె ప్రస్తుతం `రామాయణం`లో సీతగా నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయినా కూడా ఆమె స్థానం పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే అక్టోబర్ లో మాత్రం పుంజుకునే అవకాశం ఉంది. ఇక ఆరో స్థానంలో కాజల్ ఉంది. ఆమె ఆగస్ట్ లో కూడా అదే స్థానంలో ఉంది. కాబట్టి ఈ చందమామకి మార్పు లేదు.
55
రెండు స్థానాలు డౌన్ అయిన లేడీ సూపర్ స్టార్
ఏడో స్థానంలో నయనతార ఉంది. ఆమె ఆగస్ట్ లో ఐదో స్థానంలో ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు రెండు స్థానాలు పడిపోయింది. ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇక ఎనిమిదో స్థానంలో కృతి సనన్, తొమ్మిదో స్థానంలో త్రిష, పదో స్థానంలో కత్రినా కైఫ్ ఉన్నారు. శ్రీలీల మరోసారి తన స్థానాన్ని కోల్పోయింది. మొత్తంగా టాప్ లో హీరోయిన్లే ఒకటి రెండు స్థానాలు అటుఇటుగా మారుతున్నారు. ఇందులో సౌత్ భామలతోపాటు నార్త్ బ్యూటీస్ హవా కూడా గట్టిగానే ఉందని చెప్పొచ్చు.