Salaar 2 Update: ప్రశాంత్‌ నీల్‌కి ప్రభాస్‌ వార్నింగ్‌.. `సలార్‌ 2` షూటింగ్‌ స్టార్ట్ అయ్యేది అప్పుడే

Published : Oct 23, 2026, 06:06 PM IST

ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌ 2` కి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చాడు. వచ్చే ఏడాది సినిమా షూటింగ్‌ స్టార్ట్ అవుతుందన్నారు. అదే సమయంలో ప్రశాంత్‌ నీల్‌కి డార్లింగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

PREV
14
ప్రభాస్‌ బర్త్ డే అప్‌ డేట్స్

ప్రభాస్‌ నేడు శుక్రవారం(అక్టోబర్‌ 23)న తన 47వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల అప్ డేట్లు వస్తున్నాయి. `కల్కి 2` నుంచి సెట్‌ వీడియోని విడుదల చేశారు. ఇటీవలే ప్రభాస్‌ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలిపారు. మరోవైపు `స్పిరిట్‌` నుంచి లుక్‌ రాలేదు, కానీ సందీప్‌ రెడ్డి వంగా అదిరిపోయే ఫోటోని పోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్‌, సందీప్‌ ఉన్నారు. దర్శకుడు సందీప్‌ మందు బాటిల్‌ ఓపెన్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు `ఫౌజీ` నుంచి ప్రభాస్‌ పాత్రని పరిచయం చేయబోతున్నారట.

24
ప్రభాస్‌ రాధేశ్యామ్‌ మూవీపై ప్రశాంత్‌ నీల్‌ సెటైర్లు

ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా అప్‌ డేట్‌ వచ్చింది. `సలార్‌ 2` అప్‌ డేట్‌ ఇచ్చాడు ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా డార్లింగ్‌ అభిమానులకు గిఫ్ట్ గా `సలార్‌ 2` అప్‌ డేట్‌ చెప్పారు. ప్రశాంత్‌ నీల్‌.. `418` అనే సినిమాని సమర్పించారు. హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నేడు విడుదలైంది. ఈ మూవీ ఆడియెన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఈ క్రమంలో ప్రభాస్‌తో ప్రమోషనల్‌ వీడియో చేశారు ప్రశాంత్‌ నీల్‌, దర్శకుడు. ఇందులో ఒక డోర్‌ నుంచి ప్రభాస్‌ సినిమా ట్రైలర్‌ చూసి, వాహ్‌ బాగుందని, హర్రర్‌తో భయపెడుతున్నారని తెలిపారు. ఇది హర్రర్‌ సినిమాగా ఎందుకు చేశారని అడిగితే, ఇది కూడా రాధేశ్యామ్‌లా తీస్తే బాగుండదు కదన్నా అని ప్రశాంత్‌ నీల్‌ చెప్పడం నవ్వులు పూయించింది. మొదట్లో నవ్విన ప్రభాస్‌ పంచ్‌ వేశావా? సలార్‌ 2 షూటింగ్‌ లో చెబుతా అని ప్రశాంత్‌ నీల్‌కి వార్నింగ్‌ ఇచ్చాడు.

34
సలార్‌ 2 షూటింగ్‌ అప్‌ డేట్‌

అనంతరం దర్శకుడిని అభినందించారు ప్రభాస్‌. ఆ తర్వాత ప్రభాస్‌కి బర్త్ డే విషెస్‌ తెలిపారు ప్రశాంత్‌ నీల్‌. గిఫ్ట్ ఏం లేదా అని అడిగితే, నైట్‌ ఇస్తానని చెప్పాడు దర్శకుడు. `సలార్‌ 2` అప్‌ డేట్‌ చెప్పు, షూటింగ్‌ ఎప్పుడు? అదే పెద్ద గిఫ్ట్ అని డార్లింగ్‌ అడగ్గా.. వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు ప్రశాంత్‌ నీల్‌. ఈ వీడియో వైరల్‌ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది `సలార్‌ 2` స్టార్ట్ కాబోతుంది. ఇక వచ్చే ఏడాదంతా డార్లింగ్‌ సినిమాల పండగే అని చెప్పొచ్చు. అయిన్నుంచి చివరగా `ది రాజా సాబ్‌` మూవీ విడుదలైన విషయం ఎలిసిందే. ఇది నిరాశ పరిచింది.

44
డ్రాగన్‌తో బిజీగా ఉన్న ప్రశాంత్‌ నీల్‌

ఇక ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌ తో `డ్రాగన్‌` సినిమా తీస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఆ మధ్య ఎన్టీఆర్‌కి గాయం కావడంతో చిత్రీకరణ ఆపేశారు. మళ్లీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మాఫియా నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత `సలార్‌ 2` స్టార్ట్ కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories