ఇక సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమైన `బిగ్ బాస్ తెలుగు 10`లో ప్రస్తుతం రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణ, టెంపర్ వంశీ, సింగర్ ఝాన్సీ, వర్షిణి, సుధీర్, శివ, దక్షి, నీతూ మాస్టర్, స్వేతా నాయుడు, రామ్ ప్రసాద్, నరేష్, ముఖేష్ గౌడ, దేబ్జానీ, షాలిని ఉన్నారు. దాదాపు 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ వారంతో కలిపి ఇంకా తొమ్మిది వారాలే ఉన్నాయి. టాప్ 5కి ఐదుగురు మాత్రమే వెళ్తారు. ఈ లెక్కన 9 వారాల్లో 12 మంది ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అందులో భాగంగా మూడు వారాలు డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.