ఇండియన్ ఐడల్ 15 విజేత: ఇండియాలో ఇండియన్ ఐడల్ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. పాడటం అంటే ఇష్టపడే గాయకులు జీవితంలో ఒక్కసారైనా ఈ షోలో పాల్గొనాలనుకుంటారు. అంతటి పాపులారిటీ ఉన్న ఈ సింగింగ్ కాంపిటీషన్ 'ఇండియన్ ఐడల్ 15'లో కోల్‌కతాకు చెందిన మానసి ఘోష్ ఈసారి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచినందుకు మానసికి ఏమేం దక్కాయంటే..
ఫైనలిస్టులు స్నేహ శంకర్, శుభోజిత్ చక్రవర్తి, చైతన్య దేవాడే, ప్రియాన్షు దత్తాలను ఓడించి ఈ సీజన్‌ను తన పేరు మీద లిఖించుకుంది మానసి. 'ఇండియన్ ఐడల్ 15' గ్రాండ్ ఫినాలే రెండు రోజులపాటు జరిగింది. టాప్ 6 పోటీదారులు తమ ప్రతిభనంతా ప్రదర్శించారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే రెండో రోజు. టాప్ 5 ఫైనలిస్టులతో సందడిగా మొదలైంది. చివరికి అందరినీ ఓడించి మానసి టైటిల్ గెల్చుకుంది.
23
చైతన్య, ప్రియాన్షులను దాటుకుని మానసి, స్నేహ, శుభోజిత్ టాప్ 3లో నిలిచారు. చివరికి మానసి ఘోష్ విజేతగా నిలిచింది. స్నేహ సెకండ్, శుభోజిత్ ఫస్ట్ రన్నరప్ అయ్యారు. మానసికి 25 లక్షల ప్రైజ్ మనీతో పాటు కొత్త కారు కూడా గెలుచుకుంది.
33
మానసి ఇదివరకు సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3లో కూడా పాల్గొంది. అందులో ఫస్ట్ రన్నరప్ అయింది. ఈ ప్రైజ్ మనీ కారే కాకుండా.. కొన్ని వాణిజ్య సంస్థలతో ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ షోకు వచ్చిన అతిథుల్లోని కొందరు సంగీత దర్శకులు, ఫిల్మ్ పర్సనాలిటీలు తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని ప్రకటించారు. అన్నింటికీ మించి మానసి తన పాట, ఆటతో లక్షల మంది అభిమానుల మనసు గెల్చుకుంది.