బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో లక్స్ పాప ఫ్లోరా షైనీకి ఊహించని షాక్ తగిలింది. ఆమె ఇప్పటి వరకు జరిగిన నాలుగు వారాల బిగ్ బాస్ సీజన్ లో వరస్ట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. దీనితో నాగార్జున ఆమెకి ఓ శిక్ష విధించారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో డే 27 శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో నాలుగు వారాల్లో ఎవరెవరు ఎలా గేమ్ ఆడారు అనే విషయంలో రివ్యూ చేశారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి గోల్డ్ స్టార్, పర్వాలేదనిపించింది వారికి సిల్వర్ స్టార్, వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి బ్లాక్ స్టార్ ఇచ్చారు.
25
గోల్డ్ స్టార్ దక్కించుకున్న ఇమ్మాన్యుయేల్
హౌస్ లో గోల్డ్ స్టార్ దక్కించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే. దీనితో నాగార్జున ఇమ్మాన్యుయేల్ పై ప్రశంసలు కురిపించారు. ఇమ్మాన్యుయేల్ గేమ్ బాగా ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అదే విధంగా అందరితో బాగా మాట్లాడుతున్నాడు అని నాగార్జున అన్నారు. ఇమ్మాన్యూల్ లో నాగార్జునకి నచ్చిన మరో అంశం.. అతడి ప్రేమ కథ. ఇమ్మాన్యుయేల్ లవ్ స్టోరీ నాగ్ ని బాగా కదిలించింది.
35
వాళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్స్
ఆ తర్వాత నాగార్జున శ్రీజకి సిల్వర్ స్టార్ ఇచ్చారు. సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్ ఇలా అందరు సభ్యులు సిల్వర్ స్టార్ దక్కించుకున్నారు. కేవలం ఇద్దరికీ మాత్రమే బ్లాక్ స్టార్లు దక్కాయి. వాళ్లిద్దరూ ఎవరో కాదు హరిత హరీష్, ఫ్లోరా షైనీ. హరిత హరీష్ కి నాగార్జున బాగా క్లాస్ పీకారు. హరీష్ అగ్ని పరీక్ష నుంచి వచ్చినప్పుడు అతడిపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయని.. ఆ అంచనాలని హరీష్ ప్రస్తుతం ఏమాత్రం రీచ్ కావడం లేదని అన్నారు. హౌస్ లో ఒక మూలాన కూర్చుని అలా ఉండిపోయాడు అని నాగ్ అన్నారు.
ఇక ఫ్లోరా విషయానికి వస్తే గేమ్ లో అసలు కనిపించడం లేదు. ఎవరో ఒకరికి సర్వెంట్ గా మాత్రమే కనిపిస్తున్నావు. నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోవడం లేదు అంటూ ఆమెలో లోపాలు ఎత్తి చూపారు. ఇంతలో ఫుడ్ పంచాయతీ కూడా జరిగింది. సంజన దొంగతనంగా గుడ్లు తినడంతో ఆమె మేడలో నాగార్జున దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు తగిలించారు.
55
తదుపరి 2 వారాలు నామినేషన్స్ లో ఫ్లోరా షైనీ
ఇక చివర్లో మెజారిటీ ఇంటి సభ్యులు ఫ్లోరా షైనీకి షాకిచ్చారు. బ్లాక్ స్టార్స్ పొందిన హరిత హరీష్, ఫ్లోరా షైనీ లని నాగార్జున నిలుచోబెట్టారు. వీరిద్దరిలో ఎవరు హౌస్ కి అవసరం లేదు అని భావిస్తారో వాళ్ళ ఫోటో ని ఒక్కో ఇంటి సభ్యుడు క్రష్ చేయాలి అని నాగార్జున తెలిపారు. ఈ టాస్క్ ని భరణి ప్రారంభించారు. భరణి .. హరీష్ ఫోటో తీసుకుని క్రష్ చేశారు. హరీష్ ఎప్పుడూ నెగిటివ్ మెంటాలిటీతో ఉంటారని, అలాంటి వ్యక్తి హౌస్ కి అవసరం లేదని భరణి అన్నారు. కొందరు మాత్రమే భరణి ఫోటో క్రష్ చేయగా.. మెజారిటీ సభ్యులు ఫ్లోరా షైనీ ఫోటో చించి వేశారు. వారంతా చెప్పిన రీజన్ ఒక్కటే.. ఫ్లోరాకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు. ఆమె హౌస్ లో ఉన్న లేకపోయినా పెద్ద తేడా లేదు. ఆమె గేమ్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించడం లేదు అని చెప్పారు. దీనితో హౌస్ లో ఇంపాక్ట్ లేని ప్లేయర్ గా ఫ్లోరా షైనీ నిలిచింది. దీనితో నాగార్జున ఆమెకి ఒక శిక్ష విధించారు. రానున్న 2 వారాలు ఫ్లోరా షైనీ డైరెక్ట్ గా నామినేట్ అవుతుందని తెలిపారు.