
ఇండియన్ సినిమా ఇప్పుడు కేవలం స్టార్ కాస్ట్‌తో సరిపెట్టడం లేదు. ప్రేక్షకులకు ప్రపంచస్థాయి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాతలు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. 'రామాయణం' నుంచి `వారణాసి`, `రాకా`, 'కల్కి 2898 AD', ఆస్కార్ విన్నింగ్ 'RRR' వరకు, మన సినిమాల బడ్జెట్లు ఇప్పుడు హాలీవుడ్‌కు పోటీ ఇస్తున్నాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, టెక్నికల్ క్వాలిటీతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇండియాలో అత్యంత ఖరీదైన 10 సినిమాల లిస్ట్.
నితేశ్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న 'రామాయణం' భారత సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు ₹4,000 కోట్లు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ దీపావళికి విడుదల కానుంది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా `వారణాసి`. మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దాదాపు రూ.1300కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. టైమ్ ట్రోటర్‌గా, గ్లోబల్ ట్రోటర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇదొక భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమాగా చెప్పొచ్చు. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.
ఇండియాలో మరో భారీ బడ్జెట్ మూవీ `రాకా`. అల్లు అర్జున్ హీరోగా, అట్లీ రూపొందిస్తున్న చిత్రమిది. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ కాస్టింగ్, భారీ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌గా, సూపర్ హీరో కాన్సెప్ట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.1000కోట్లు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' సినిమాను దాదాపు ₹600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. భారతీయ పురాణాలను, ఫ్యూచరిస్టిక్ ప్రపంచాన్ని కలిపి తీసిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ నటించారు. అద్భుతమైన విజువల్స్, కథనంతో ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రూ.1250కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు దీనికి పార్ట్ 2 రాబోతుంది. `కల్కి 2` పేరుతో దీన్ని తెరకెక్కించనున్నారు నాగ్ అశ్విన్. ఈ మూవీ బడ్జెట్ కూడా ఆరువందల కోట్లకుపైగానే ఉంటుందని సమాచారం.
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన 'RRR' సినిమాను సుమారు ₹550 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ పీరియడ్ యాక్షన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఇది సుమారు రూ.1300కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమాను ₹500 నుంచి ₹700 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించినప్పటికీ, నాసిరకం వీఎఫ్ఎక్స్, డైలాగ్స్ కారణంగా ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీనికి ఓం రౌత్ దర్శకుడు.
రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన '2.0' సినిమాను సుమారు ₹450-600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. డైరెక్టర్ ఎస్. శంకర్ ఈ చిత్రంలో అత్యాధునిక రోబోటిక్స్, టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్ ఉపయోగించారు. ఇది భారతీయ సినిమా సాంకేతిక ప్రమాణాలను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. బాక్సాఫీసు వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.
ప్రభాస్ నటిస్తున్న హారర్-కామెడీ సినిమా 'ది రాజా సాబ్'ను సుమారు ₹405 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారీ సెట్లు, అత్యాధునిక వీఎఫ్ఎక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిలవనుంది. వీటితోపాటు ప్రస్తుతం `స్పిరిల్` సుమారు రూ.400కోట్లతో, `ఫౌజీ` దాదాపు రూ.350కోట్లతో తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ నటిస్తోన్న `డ్రాగన్` కూడా దాదాపు రూ.350-400కోట్లతో తెరకెక్కుతుంది. మొత్తంగా భారీ బడ్జెట్ చిత్రాల్లో టాలీవుడ్ దే హవా అని చెప్పొచ్చు.