వీడియోలో మరో ఆసక్తికరమైన మలుపు కూడా ఉంది. కథ చెబుతున్న సమయంలో నాని మధ్యలో కలగజేసుకుని "రుక్మిణి ఎవరు?" అని ప్రశ్నిస్తారు. అందుకు కృష్ణ స్పందిస్తూ "రుక్మిణి నా భార్య" అని చెప్పడం విశేషం. ఆ సన్నివేశానికి జత చేసిన మధురమైన నేపథ్య సంగీతం సినిమా భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉంది. అలాగే వ్రతం వెంకన్న, గరం గోపాల్, ఆమెకు ఆమె అంటే ఇష్టం వంటి కల్పిత నవలల పేర్లను చూపిస్తూ రుక్మిణి పాత్ర స్వభావం, కథనం తీరు గురించి చిన్న చిన్న సంకేతాలను మేకర్స్ అందించారు.వరుస పరాజయాల తర్వాత నితిన్ రూటు మార్చారు. ఇక ఫార్ములా కథలు వర్కౌట్ కావని రియలైజ్ అయిన నితిన్..ఇలా వైవిధ్యమైన కథాంశం ఉన్న చిత్రంతో రాబోతున్నారు.