Top 10 Heroines: నయనతారకి షాక్‌, శ్రీలీల రచ్చ.. సమంత, రష్మిక, కాజల్‌ స్థానాలివే.. ఇండియా టాప్ 10 హీరోయిన్లు

Published : Jul 21, 2026, 05:10 PM IST

ఓర్మాక్స్ మీడియా జూన్‌ నెలకు సంబంధించిన ఇండియా టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ హీరోయిన్ల జాబితాని విడుదల చేసింది. ఇందులో నయనతార డౌన్‌ అయితే, శ్రీలీల మళ్లీ లిస్ట్ లోకి వచ్చింది.

PREV
16
ఇండియా టాప్‌ 10 హీరోయిన్ల జాబితా

ఇండియా వైడ్‌గా మోస్ట్ పాపులర్‌ హీరోయిన్ల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు జూన్‌ నెలకు సంబంధించిన జాబితాని తాజాగా విడుదల చేసింది. హీరోల లిస్ట్ మాదిరిగానే హీరోయిన్ల లిస్ట్ రిలీజ్‌ చేసింది. ఇందులో పెద్దగా మార్పులు లేవు, కానీ శ్రీలీల మళ్లీ జాబితాలోకి వచ్చింది. నయనతార రెండు స్థానాలు పడిపోయింది.  మరి సమంత, రష్మిక మందన్నా, కాజల్‌, సాయిపల్లవి ఏ స్థానాల్లో ఉన్నారనేది చూస్తే.

26
సమంతదే నెంబర్‌ 1 ప్లేస్‌

హీరోల్లో ప్రభాస్‌ స్థానంలో మార్పు లేదు, అలానే హీరోయిన్లలో సమంత స్థానంలోనూ మార్పు కనిపించడం లేదు. మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆమె తగ్గింది. మళ్లీ ఎప్పటిలాగే మొదటి స్థానంలోకి వస్తుంది. ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. తిరుగులేని నెంబర్‌ 1గా నిలిచింది సమంత. రెండో స్థానంలో అలియాభట్‌, మూడో స్థానంలో దీపికా పదుకొనె నిలిచారు.

36
రష్మిక మందన్నా స్థానం ఏంటంటే

ఇక నాల్గో స్థానంలో ఎప్పటిలాగానే నేషనల్‌ క్రష్‌ సొంతం చేసుకుంది. ఈ మధ్య రష్మిక హంగామా లేదు. అందుకే ఆమె స్థానంలో మార్పు లేదు. చాలా వరకు రష్మిక అదే స్థానంలో ఉంటుంది. అయితే దీపికా, రష్మిక స్థానాల్లో చిన్నపాటి మార్పులు చోటు చేసుకుంటాయి.

46
జోరు చూపిస్తున్న కాజల్‌

ఐదో స్థానంలో కాజల్‌ ఉంది. ఈ అమ్మడికి పెద్దగా సినిమాలు లేకపోయినా టాప్‌ 5లోనే ఉంటుంది. అంతేకాదు ఆ స్థానంలో పెద్దగా మార్పు కూడా లేదు. అయితే కాజల్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటోంది. కమర్షియల్స్ తో బిజీగా ఉంటుంది. వీటి వల్ల ఆమె నిత్యం డిస్కషన్‌లో ఉంటుంది. అందుకే ఓర్మాక్స్ మీడియా టాప్‌ 10 లిస్ట్ లో నిలుస్తోంది.

56
సాయి పల్లవి జోరు

ఆరో స్థానంలో సాయిపల్లవి ఉంది. నేచురల్‌ స్టార్‌గా నిలుస్తోన్న సాయి పల్లవి గత నెలలో ఏడో స్థానంలో ఉండగా ఇప్పుడు ఆరో స్థానానికి రావడం విశేషం. దీనికి `రామయణ్‌` కారణమని చెప్పొచ్చు. ఏడో స్థానంలో కృతి సనన్‌ ఉన్నది. ఎనిమిదో స్థానంలో నయనతార ఉంది. మేలో ఆరో స్థానంలో ఉన్న నయనతార ఇప్పుడు ఎనిమిదికి పడిపోవడం గమనార్హం.

66
లిస్ట్ లోకి వచ్చిన శ్రీలీల

త్రిష ఈ సారి తొమ్మిదో స్థానం దక్కించుకోగా, శ్రీలీల పదో స్థానం సొంతం చేసుకుంది. త్రిష గత నెలలో కూడా అదే స్థానంలో ఉంది. శ్రీలీల గత నెలలో అసలు టాప్‌ 10లోనే లేదు. కానీ ఇప్పుడు చివరి స్థానంలో నిలవడం విశేషమని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories