Jana Nayagan: `జన నాయగన్` విజయ్ చివరి సినిమా కాదు, మొదటి సినిమా.. స్టోరీ లీక్‌ చేసిన డైరెక్టర్‌

Published : Jul 21, 2026, 04:11 PM IST

Jana Nayagan: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్ధమవుతున్న 'జన నాయగన్' సినిమాపై డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇది విజయ్ చివరి సినిమా కాదంటూ ఆయన ఇచ్చిన హింట్ సినిమా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

PREV
13
చివరి సినిమా కాదు, విజయ్‌ మొదటి సినిమా

‘జన నాయగన్’ విజయ్ చివరి సినిమా అని అందరూ అనుకుంటున్నారు. దీనిపై డైరెక్టర్ హెచ్‌ వినోద్‌  స్పందించారు. 'ఇది విజయ్ చివరి సినిమానో కాదో ఎవరూ చెప్పలేరు. కానీ,  సీఎం విజయ్ గారి మొదటి సినిమా అని మాత్రం చెప్పొచ్చు` అని ఆయన అన్నారు. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అయింది.

23
ముందు విజయ్‌ కాదు

ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని, లోతైన రాజకీయాలను చర్చిస్తుందని డైరెక్టర్ చెప్పారు. ఈ కథను విజయ్‌ కంటే ముందు కొందరు స్టార్ హీరోలకు వినిపించారట. కానీ, అంత బలమైన పొలిటికల్ స్టోరీలో నటించే ధైర్యం వాళ్లకు లేకపోవడంతో, చివరికి ఈ ప్రాజెక్ట్ విజయ్ దగ్గరికి వచ్చిందని వినోద్‌ తెలిపారు.

33
చాలా కాలం నిలిచిపోయే మూవీ జన నాయగన్‌

ఈ సినిమాలో రాజకీయాలను పైపైన చూపించలేదని, ఉక్రెయిన్-ఇరాన్ యుద్ధంలో చూసిన 'మోడరన్ వార్‌ఫేర్' తరహాలో ఉంటుందని వినోత్ అన్నారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లపై ప్రేక్షకులు చాలా కాలం చర్చిస్తారని, ఇది వాళ్లకు ఒక 'కేస్ స్టడీ' అవుతుందని ఆయన నమ్మకంగా చెప్పారు. పిల్లలు ఇష్టపడే విజయ్ సినిమాకు 'A' సర్టిఫికెట్ రావడం కాస్త బాధగా ఉన్నా, 'సూదు కవ్వుమ్' లాగా పదేళ్లయినా ఈ సినిమా ప్రభావం నిలిచిపోతుందని అన్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజూ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories