Top 10 Heroines: సమంత ఈజ్‌ బ్యాక్‌, సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే

Published : Jun 23, 2026, 09:24 PM IST

Top 10 Heroines: ఓర్మాక్స్ మీడియా మే నెలకు సంబంధించిన ఇండియా మోస్ట్ పాపులర్‌ టాప్ 10 హీరోయిన్ల జాబితాని ప్రకటించింది. ఇందులో సమంత మరోసారి తన స్థానంలోకి చేరుకుంది. 

PREV
16
ఇండియా టాప్‌ 10 హీరోయిన్లు

ఇండియాలోనే టాప్‌ హీరోయిన్ల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే మే నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సమంత తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అలియాభట్‌ బ్యాక్‌ అయ్యింది. వీరితోపాటు నయనతార సత్తా చాటింది. మరి కాజల్‌, శ్రీలీల, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా వంటి హీరోయిన్లు ఏ స్థానంలో నిలిచారనేది చూద్దాం.

26
తిరిగి మొదటి స్థానంలోకి సమంత

సమంత చాలా నెలలుగా మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. అయితే గత నెల(ఏప్రిల్‌) లో ఆమె ఒక్క స్థానం పడిపోయింది. మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోగా, ఇప్పుడు మే నెలలో మరోసారి సత్తా చాటింది. తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకుంది. సమంత తాజాగా `మా ఇంటి బంగారం` మూవీతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గత నెల మొదటి స్థానంలో ఉన్న అలియా భట్‌ ఇప్పుడు రెండో స్థానానికి పరిమితమయ్యింది.

36
దీపికా, రష్మిక సేమ్‌

ఇక మూడో స్థానంలో దీపికా పదుకొనె ఉంది. ఆమె గత నెలలోనూ ఇదే స్థానంలో ఉండగా, ఇప్పుడు మరోసారి తన స్థానాన్ని పదిలపర్చుకుంది. అలాగే నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కూడా తన స్థానంలో మార్పు లేదు. నాల్గో స్థానంలో ఉంది. ఆమె ప్రస్తుతం `మైసా`, `రణబాలి` వంటి చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో నటించిన `కాక్‌ టెయిల్‌ 2` థియేటర్లో సందడి చేస్తోంది.

46
ఐదో స్థానంలో కాజల్‌, పడిపోయిన సాయిపల్లవి

ఇక ఐదో స్థానంలో కాజల్‌ ఉంది. ఆమె సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమాలు లేకపోయినా కాజల్‌ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటోంది. చాలా నెలలుగా పెద్దగా మార్పు లేదు. ఇదే అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత నెలలో ఆరో స్థానంలో ఉన్న సాయిపల్లవి డౌన్‌ అయ్యింది. ఆమె ఒక్క స్థానం పడిపోయి ఏడో స్థానానికి పరిమితమయ్యింది.

56
నయనతార జోరు

ఏప్రిల్‌లో ఏడో స్థానంలో ఉన్న నయనతార మేలో ఆరో స్థానంలోకి దూసుకొచ్చింది. నిత్యం ఏదో రకంగా నయనతారకి సంబంధించిన చర్చ నడుస్తూనే ఉంటుంది. లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న ఆమె ఆరో స్థానంలో సెటిల్‌ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ఒక్క స్థానం మెరుగుపడింది. ఏప్రిల్‌లో ఆమె తొమ్మిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఎనిమిదో స్థానంలోకి వచ్చింది.

66
లిస్ట్ లోనే లేని శ్రీలీల

అందరికి షాకిస్తూ శ్రీలీల ఈ సారి లిస్ట్ లోనే లేదు. గత నెలలో ఆమె 8 స్థానంలో ఉండగా, ఇప్పుడు అసలు లిస్ట్ లోనే లేకుండా పోవడం ఆశ్చర్యపరుస్తోంది. తొమ్మిదో స్థానంలోకి త్రిష వచ్చింది. గతంలో ఆమె పదో స్థానంలో ఉండగా, ఇప్పుడు 9వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఫైనల్‌గా అసలు ఎప్పుడూ లిస్ట్ లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ పదో స్థానంలోకి వచ్చింది. అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా మే నెలలో హీరోయిన్లకి సంబంధించి చాలా మంది స్థానాలు తారుమారు అయ్యాయని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories