ఇండియా టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రకటించింది. మొదటి స్థానంలో సమంత ఉండగా, దీపికా, నయనతార తమ స్థానాలు మెరుగుపర్చుకున్నారు.
ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల హీరోలు, హీరోయిన్లకి సంబంధించిన టాప్ 10 లిస్ట్ ని విడుదల చేస్తుంటుంది. ఎప్పటిలాగే డిసెంబర్ నెలకు సంబంధించిన ఇండియాలోనే టాప్ 10 హీరోయిన్లు ఎవరనేది విడుదల చేసింది. అయితే ఇందులో దీపికా పదుకొనె, నయనతార టాప్ లోకి దూసుకు రాగా, కాజల్, త్రిష వంటి కథానాయికలు తమ స్థానాల నుంచి పడిపోయారు. మరి ఇప్పుడు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు. టాప్ 10 లిస్ట్ చూద్దాం.
210
సమంతదే మొదటి స్థానం
ఎప్పటిలాగే నెంబర్ 1గా సమంత నిలిచారు. హీరోల్లో ప్రభాస్, హీరోయిన్లలో సమంత టాప్ 1లో ఉంటున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నెలలో కూడా సమంతనే మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ఇటీవల నటిగా కమ్ బ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు `మా ఇంటి బంగారం` చిత్రంలో నటిస్తుంది. దీని టీజర్ విడుదలయ్యింది. ఇందులో సమంత చేసిన యాక్షన్ చూస్తే మతిపోవాల్సిందే.
310
రెండో స్థానంలో అలియాభట్, మూడో స్థానంలో రష్మిక మందన్నా
రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నిలిచింది. ఆమె కూడా చాలా నెలలుగా టాప్ 2లో ఉంటుంది. ఈ సారి కూడా రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఉంది. ఆమె గతేడాది బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలతో అలరించింది. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తన స్థానాన్ని పదిలపర్చుకుంటోంది. అయితే వాస్తవానికి ఆమె రేంజ్ నెంబర్ 1. కానీ మూడో స్థానానికే పరిమితమవుతుంది.
నాల్గో స్థానంలో దీపికా పదుకొనె నిలిచింది. ఆమె రెండు ప్రభాస్ సినిమాలు వదులుకుంది. అయినా తన క్రేజ్ తగ్గలేదు, సరికదా మరింత పెరిగింది. నవంబర్‌లో టాప్ 6లో ఉండగా, డిసెంబర్‌లో టాప్ 4కి ఎదగడం విశేషం. ఇది ఆమె క్రేజ్‌కి నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవల దీపికా తరచూ వార్తల్లో నిలుస్తుంది. అది ఆమె పాపులారిటీని పెంచిందని చెప్పొచ్చు.
510
ఐదో స్థానంలో నయనతార
ఐదో స్థానంలో నయనతార నిలిచింది. ఆమె కూడా తన స్థానాన్ని పెంచుకుంది. నవంబర్‌లో ఏడో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఐదో స్థానానికి రావడం విశేషం. నయనతార ఇటీవల చిరంజీవితో `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నటించింది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ డిసెంబర్ నుంచి జరిగాయి. అది ఆమె రేంజ్‌ని పెంచేశాయని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
610
ఆరో స్థానానికి పడిపోయిన కాజల్
ఆరో స్థానంలో కాజల్ నిలిచింది. కాజల్‌కి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. గతేడాది `కన్నప్ప`లో మెరిసింది. దీంతో ఆమె క్రేజ్ తగ్గింది. నవంబర్‌లో నాల్గో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంది కాజల్.
710
ఏడో స్థానంలో త్రిష
త్రిష రెండు స్థానాలు పడిపోయింది. గత నెలలో ఆమె ఐదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఏడో స్థానానికి పడిపోయింది. అంతకు ముందు ఆమె సినిమాలు విడుదలయ్యాయి. ఈక్రమంలో త్రిషపై చర్చ నడిచింది. కానీ ఇప్పుడు హడావుడి లేదు. దీంతో ఆమె స్థానాలు పడిపోయాయి.
810
ఎనిమిదో స్థానంలో సాయిపల్లవి ఫిక్స్
సాయిపల్లవి ఎనిమిదో స్థానంలో నిలిచింది. నవంబర్‌లో ఆమె ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా అదే స్థానానికే పరిమితమయ్యింది. సాయిపల్లవికి సంబంధించిన మూవీస్ అప్ డేట్స్ కూడా పెద్దగా లేవు. అయినా తగ్గకపోవడం విశేషంగా చెప్పొచ్చు.
910
తొమ్మిదో స్థానంలో అనుష్క
అనుష్క శెట్టి తన స్థానం మెరుగుపర్చుకుంది. ఆమె గత నెలలో పదో స్థానంలో ఉండగా, ఇప్పుడు మాత్రం 9వ స్థానానికి ఎదిగింది. ఆమె చివరగా `ఘాటి` అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఓ మలయాళ చిత్రంలో నటిస్తుంది.
1010
పదో స్థానంలో శ్రీలీల
ఇక శ్రీలీల టాప్ 10లో ఉంది. ఆమె గత నెలలో 9వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక స్థానం పడిపోయింది. పదికి పరిమితమయ్యింది. శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో నటిస్తుంది. ఇటీవల `పరాశక్తి`తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది పెద్దగా ఆడలేదు. ఇలా మొత్తంగా టాప్ 10 ఇండియా పాపులర్ హీరోయిన్లలో టాలీవుడ్ భామలే ఎక్కువగా ఉండటం విశేషం.