Illu Illalu Pillalu Today Episode Jan 20: బల్లి అక్కకి మూడింది.. ప్రేమ, నర్మద ఫోకస్ మొత్తం వల్లిపైనే

Published : Jan 20, 2026, 09:40 AM IST

Illu Illalu Pillalu Today Episode Jan 17: నిశ్చితార్థంలో అమూల్య విశ్వల ఫోటోలు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు నర్మద, ప్రేమ ప్రయత్నిస్తారు. చివరికి వల్లిపైన అనుమానం పడతారు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
విశ్వక్ కంగారు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వనజ కుటుంబం పెళ్లిచూపులు తర్వాత రామరాజు ఇంటి నుంచి బయలుదేరుతుంది. అమూల్యను కోడలుగా చేసుకుంటున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని చెబుతుంది వనజ. అప్పుడు వేదవతి కూడా మాలాగే అమూల్య కూడా మీ ఇంటి కోడలు అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అంటుంది వేదవతి. వీళ్లంతా సంతోషంగా మాట్లాడుకోవడం పైనుంచి భద్రావతి చూస్తూ ఉంటుంది. అలాగే విశ్వక్ కూడా కంగారుగా చూస్తూ ఉంటాడు. విశ్వక్, భద్రావతితో ‘అత్త నిశ్చితార్థం ఆపాలని ఎంత ట్రై చేసినా కూడా ఆపలేకపోయాను. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది నెక్స్ట్ పెళ్లి చేసేస్తారు. అమూల్య మన చేయి జారిపోయేలా ఉంది. ఇప్పుడు ఎలా’ అని అంటాడు.

 ‘నిశ్చితార్థం జరగని.. పెళ్లి పీటల దాకా వెళ్ళనీ.. పెళ్లి పీటల నుంచి అమ్మాయి లేచిపోతే కదా వారి పరువు గంగలో కలిసిపోయేది. వాళ్ళ గుండె ఆగిపోయేది’ అని భద్రావతి అసలు ప్లాను చెబుతుంది. ఈ నిశ్చితార్థం జరగడం కూడా మన మంచికే అని అంటుంది భద్రావతి. అలాగే విశ్వకు తర్వాత ఏం చేయాలో కూడా వివరిస్తుంది. అప్పుడు విశ్వ ఆరు నూరైనా అమూల్యను పెళ్లి పీటలు ఎక్కకుండా చేస్తానని చెబుతాడు.

24
సాగర్ చేతికి 20 లక్షలు

మరోపక్క కామాక్షి పుట్టింట్లోనే వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు దాచేస్తూ ఉంటుంది. ఇంట్లో ఆమెకు వెండి వస్తువులు దాచిపెట్టిన సూట్ కేస్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో వెండి వస్తువులు ఉండవు. దీంతో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఈలోపు సాగర్ కి ఫోన్ రావడంతో కంగారుగా బయటికి వస్తాడు. ఫోన్లో అవతల వ్యక్తి 25 లక్షల క్యాష్ ఇవ్వాల్సి వస్తుందని అంటాడు. వన్ వీక్ లో ఆలోచించి చెప్పమని చెబుతాడు. దీంతో సాగర్ బాధగా ఫోన్ పెట్టేస్తాడు.

ఈలోపు రామరాజు సాగర్ ని పిలుస్తాడు. వనజ ఇచ్చిన 20 లక్షల రూపాయలను సాగర్ కు ఇచ్చి వియ్యంకులు చెల్లికి నగలు చేయించమని ఇచ్చారు. మనం వద్దన్నా కూడా ఈ డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వెయ్యి అని అంటాడు సాగర్ తో. ఇది మీ చెల్లెలి జీవితం, ఈ డబ్బును బ్యాంకులో వేసి రశీదు తీసుకురా, ఈ డబ్బు మీ నాన్న పరువుకి, మీ చెల్లి జీవితానికి సంబంధించిన విషయం అనే పదే పదే చెబుతాడు. మిల్లు డబ్బుల్లోనూ, ఇతర డబ్బుల్లోనో దీన్ని కలపకుండా విడిగా పెట్టమని చెబుతాడు రామరాజు. సాగర్ సరే అని అంటాడు.

34
ఫోటోల గురించి తోటికోడళ్ల కంగారు

‘నువ్వు, ధీరజ్ ఇద్దరూ రత్నాలు లాంటి అమ్మాయిలను ఇంటి కోడళ్లుగా తీసుకొచ్చారు. కానీ తీసుకొచ్చే విధానం బాగోకపోవడంతో ఊరందరు ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అమూల్య పెళ్లితో ఊరంతా మంచి పేరు తిరిగి తెచ్చుకోవాలి’ అంటాడు రామరాజు. దానికి సాగర్ ఇప్పుడెందుకు అవన్నీ నాన్న నువ్వు సంతోషంగా ఉంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అని చెబుతాడు. చాలా సంతోషంగా డబ్బులు పట్టుకొని బ్యాంకుకు బయలుదేరుతాడు సాగర్.

ఇక ఇక్కడినుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. రాత్రి పూట నర్మద ఇంటికి గుమ్మం పై కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వ అమూల్య ఫోటోలు పాప పట్టుకుని తిరగడం, అవి నిశ్చితార్థం జరిగే చోట పడిపోవడం వంటివన్నీ గుర్తు చేసుకుంటుంది. ఈలోపు ప్రేమ కూడా అక్కడికి వచ్చి ఎందుకంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు, ఏ విషయం గురించి అని అడుగుతుంది. ఈలోపు అట్నుంచి వెళ్తున్న వల్లి వీరి మాటలు దొంగ చాటుగా వింటూ ఉంటుంది. నిశ్చితార్థంలో ఫోటోలు కనిపించడం గురించి అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ మాట్లాడుతూ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అక్కా నిశ్చితార్థం జరిగే దగ్గరికి ఫోటోలు ఎలా వచ్చాయి అని అడుగుతుంది. 

అప్పుడు నర్మద ఎవరో పక్క ప్లానింగ్ తోనే ఆ ఫోటోలు అక్కడికి వచ్చేలా చేశారని, అవి అనుకోకుండా బయటపడ్డ ఫోటోలు కావని, ఉంటే అమూల్య రూమ్ లో ఉండాలి కానీ పిల్లల చేతికి ఎలా వచ్చాయి అని అంటుంది. కచ్చితంగా ప్లాన్ ప్రకారమే ఈ ఫోటోలను పిల్లలచేత తాంబూలాల ప్లేట్లో పెట్టాలనుకున్నారు అని అంటుంది.

44
వల్లిని అనుమానించిన నర్మద ప్రేమ

ప్రేమ మాట్లాడుతూ నిశ్చితార్థం ఆపే ప్లాన్ ఎవరు వేసుంటారు అని అంటుంది. దానికి నర్మద మాట్లాడుతూ ఇంకెవరు మీ అన్నయ్య విశ్వక్.. ప్లాన్ వేసి ఉంటాడు అని అంటుంది. దానికి ప్రేమ కూడా అది కరెక్టేనని అనుమానిస్తుంది. కానీ వాడు ఇక్కడికి వచ్చి ఫోటోలు ఎలా పెడతాడు? ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం లేదు కదా అని అంటుంది ప్రేమ. అప్పుడు నర్మద మన ఇంట్లో వాళ్లే విశ్వకు సాయం చేశారని అంటుంది. ప్రేమ వెంటనే ఎవరో కాదు ఆ వల్లి ఆ ఫోటోలను పిల్లల చేతికి ఇచ్చి ఉంటుందని అంటుంది. అది విని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది.

వల్లి మా అన్నయ్యతో మాట్లాడడం, మా అన్నయ్య మంచోడని అమూల్యకు చెప్పడం రెండు మూడుసార్లు చూశాను. కాబట్టి వళ్ళీ అక్కే ఆ ఫోటోలను తాంబూలాల ప్లేటులో పెట్టాలని ప్రయత్నించి ఉంటుంది అని అంటుంది ప్రేమ. దాంతో నర్మద, ప్రేమ ఇద్దరూ వల్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అవుతారు. నర్మద మాట్లాడుతూ ఇన్నాళ్లు సాటి ఆడపిల్ల జీవితం నాశనం చేయకూడదని, అన్నీ తప్పులు క్షమించి వదిలేసాం, కానీ అమూల్యను విశ్వ ట్రాప్ చేయడంలో తన హస్తం ఉందని తెలిస్తే ఊరుకునేది లేదు. మనమే మెడ పెట్టి బయట గెంటేస్తాం అని అక్కడినుంచి వెళ్ళిపోతారు. అదంతా విని వల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఇక ఇక్కడి నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ధీరజ్ గదిలోకి వచ్చి ప్రేమను ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ప్రేమ గ్లాసులతో ఆడుకుంటూ ఉంటుంది. అది చూసి త్వరలోనే నిన్ను ఎర్రగడ్డకు పంపించాల్సి వస్తుందని ధీరజ్ అంటాడు. ఆ గ్లాసుల గేమ్ గురించి చాలా గొప్పగా చెబుతుంది ప్రేమ. ఇద్దరూ కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకుని తిట్టుకుంటారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories