ఇండియా పాకిస్తాన్‌ తొలి యుద్ధం.. ఎన్టీరామారావు లెటర్‌ వైరల్‌.. ఏం చేశాడంటే?

Published : May 10, 2025, 10:11 AM IST

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం వేళ నందమూరి తారక రామారావు రాసిన ఒక లెటర్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇండో పాక్‌ తొలి యుద్ధం సమయంలో ఆయన రియాక్షన్‌ ఇందులో ఉండటం విశేషం.   

PREV
15
ఇండియా పాకిస్తాన్‌ తొలి యుద్ధం.. ఎన్టీరామారావు లెటర్‌ వైరల్‌.. ఏం చేశాడంటే?
india pakistan war

ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్‌ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. పాక్‌ ఇప్పటికే పూర్తి స్థాయి మిలటరీ వార్‌ని ప్రకటించింది. పాక్‌ అత్యుత్సాహానికి భారత్‌ ధీటుగా బదులు చెబుతుంది. ఈ ఉగ్రవాద దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఈ క్రమంలో భారత ప్రభుత్వం యుద్ధానికి సంబంధించి నేడు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. భారత్‌ కూడా పూర్తి స్థాయి మిలటరీ వార్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

25
vijay deverakonda

ఇదిలా ఉంటే మన దేశం కోసం పోరాడుతూ కొందరు సైనికులు వీరమరణం పొందారు. మన తెలుగు బిడ్డ మురళీ నాయక్‌ `ఆపరేషన్‌ సిందూర్‌`లో పోరాడి వీరమరణం పొందిన విషయం తెలిసిందే. మరో సైనిక అధికారి కూడా దేశం కోసం ప్రాణాలను అర్పించారు.

ఈ క్రమంలో సైన్యం కోసం కొందరు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. సినిమా రంగం నుంచి విజయ్‌ దేవరకొండ, అల్లు అరవింద్‌ తమ విరాళాన్ని ప్రకటించారు. మరికొందరు ముందుకు వస్తున్నారు. 
 

35
sr ntr

ఈ క్రమంలో ఎన్టీరామారావుకి సంబంధించిన లెటర్‌ ఒకటి వైరల్‌ అవుతుంది. ఇండియా పాకిస్తాన్‌ తొలి యుద్ధం(1965) సమయంలో మన దేశం కోసం పోరాడుతున్న వీర సైనికుల నిధికి విరాళం సేకరించడానికి స్వయంగా రంగంలోకి దిగారు.

ఈ మేరకు ఆయన ప్రజలను ఉద్దేశించి ఒక లెటర్‌ ని విడుదల చేశారు. 60ఏళ్లనాటి ఆ లెటర్‌ ని సీనియర్ జర్నలిస్ట్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. మరి ఇందులో ఎన్టీ రామారావు ఏం చెప్పాడనేది చూస్తే. 
 

45
sr ntr letter

`ఈనాడు మన భద్రత కోసం, దేశ గౌరవం కోసం దుష్ట శత్రువు నెదుర్కొని భీకర సంగ్రామంలో ప్రాణ త్యాగం చేస్తున్న సోదర భారత వీర సైనికుల సహాయార్థం దేశ రక్షణ నిధి సేకరణకై నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య కేంద్రాలలో ప్రదర్శనలీయ సంకల్పించాను. నా అభిమానుల ఆదరణ, యావదాంధ్ర ప్రజానీకం ఆశీస్సులు, మా పరిశ్రమ అండదండలు ఈ ప్రజాహిత కార్యాన్ని జయప్రదం చేయగలవనే విశ్వాసము ఉన్నాను.

నన్నీ కార్యానికి పురికొల్పినవి నా అభిమానుల, కళాపోషకుల, చలనచిత్ర పరిశ్రమల అనుబంధ వ్యాపార సంస్థల, సహకార సంపత్తులు. వారి ఆశీస్సులు అర్థిస్తూ మాతృదేశ సంరక్షణకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయ విజ్ణప్తి చేస్తున్నాను` అని ప్రజలను ఉద్దేశించి ఎన్టీఆర్‌ ఈ లెటర్‌ని విడుదల చేశారు. 
 

55
sr ntr

ఇండియా పాకిస్తాన్‌ తొలి యుద్ధం 1965లో జరుగుతున్నప్పుడు ఎన్టీరామారావు భారత సైన్యం కోసం ఈ విధంగా స్పందించారు. తనవంతుగా విరాళం సేకరించి సైనికులకు అందించారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories