లేటెస్ట్ సర్వేలో మతిపోయే రిజల్ట్.. ఇండియా టాప్ 10 హీరోలు వీరే, నెంబర్‌ వన్‌ ఎవరంటే?

Published : Jun 21, 2025, 07:12 PM IST

ఓర్మాక్స్ మీడియా మే నెలకు సంబంధించిన ఇండియా మోస్ట్ పాపులర్‌ ఫిల్మ్ స్టార్‌ టాప్‌ 10 జాబితాని విడుదల చేసింది. మరి ఇందులో ఎవరు టాప్‌ అనేది చూస్తే 

PREV
17
ఓర్మాక్స్ మీడియా టాప్‌ 10 ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోస్‌

తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియన్‌ సినిమాని డామినేట్‌ చేస్తుంది. ఓ రకంగా శాసిస్తుంది. మన హీరోలే పాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు ఇండియా అంటే బాలీవుడ్‌ అనే పేరు వినిపించేది, ఇప్పుడు టాలీవుడ్‌ పేరు వినిపిస్తోంది.

 ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి హీరోలు పాన్‌ ఇండియా సినిమాలతో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్‌ బాబు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఈ క్రమంలో వీరు ఇండియన్‌ సినిమాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ గా రాణిస్తున్నారు. 

అయితే తాజాగా ఓర్మాక్స్ మీడియా మే నెలకు సంబంధించిన సర్వే రిజల్ట్ ని బయటపెట్టింది. మరి ఇందులో టాప్‌ 10లో స్థానం దక్కించుకున్న హీరోలు ఎవరు? మన తెలుగు నుంచి ఎంత మంది ఈ జాబితాలో ఉన్నారు. టాప్‌లో ఎవరున్నారనేది తెలుసుకుందాం.

27
వరుసగా ఫస్ట్ ప్లేస్‌లో ప్రభాస్‌

ఓర్మాక్స్ మీడియా ప్రతి వారం, ప్రతి నెల ఇండియన్‌ మూవీస్‌కి సంబంధించిన సర్వే చేపడుతుంది. ఇందులో టాప్‌ హీరోలు, హీరోయిన్లు, టాప్ మూవీస్‌, ఓటీటీ చిత్రాలు, బెస్ట్ సాంగ్స్ వంటి కేటగిరిలో ఈ సర్వే నిర్వహిస్తుంది. అందులో భాగంగా మే నెలకు సంబంధించిన రిజల్ట్ విడుదల చేసింది. 

అందులో భాగంగా ఇండియా మోస్ట్ పాపులర్‌ టాప్‌ 10 హీరోలకు సంబంధించిన జాబితా వచ్చింది. ఇందులో ఎప్పటిలాగే ప్రభాస్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన వరుసగా టాప్‌లో ఉన్నారు. ఆయన్ని కదిలించే హీరో లేరని చెప్పొచ్చు. అంతేకాదు అత్యధిక సినిమాలతోనూ ఆయనే బిజీగా ఉన్నారు. 

డార్లింగ్‌కి ఉన్న సినిమాల లైనప్‌ మరే హీరోకి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే దీని టీజర్‌ విడుదలైంది. సంచలనాలు క్రియేట్‌ చేసింది. సినిమాపై భారీ అంచనాలు పెంచింది. 

ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కానుంది. దీంతోపాటు హను రాఘవపూడితో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రాబోతుంది. అలాగే సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` మూవీ చేయబోతున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కానుందట. 

వీటితోపాటు ప్రశాంత్‌ వర్మతో ఓ మూవీ, `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు చేయనున్నారు ప్రభాస్‌. ఇలా ఆయన పేరుతో ఇప్పుడు మూడు, నాలుగు వేల కోట్ల వ్యాపారం జరుగుతుండటం విశేషం.

37
రెండో స్థానంలో విజయ్‌

రెండో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ఉన్నారు. ఆయన ఇప్పుడు `జన నాయగన్‌` చిత్రంతో రాబోతున్నారు. మరోవైపు ఆయన రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. కోలీవుడ్‌లో అత్యంత ఫ్యాన్‌ బేస్‌ ఉన్న హీరో విజయ్. 

ఆయనకు సంబంధించిన చర్చ ఎప్పుడూ నెట్టింట జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో విజయ్‌ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఆయన కొన్ని నెలలుగా రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ ఉన్నారు. 

షారూఖ్‌ నుంచి సినిమాలు లేవు, కానీ ఆయన మూడో స్థానంలో ఉండటం విశేషమనే చెప్పాలి. ఆ మధ్య వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన షారూఖ్‌ ఆ తర్వాత మరో మూడు వందల కోట్ల మూవీ చేశారు. ఇప్పుడు మళ్లీ గ్యాప్‌ వచ్చింది. 

నెక్ట్స్ బ్యాక్‌ టూ బ్యాక్‌ వచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అదే సమయంలో యాడ్స్, ఇతర యాక్టివిటీస్‌ పరంగా బాద్‌ షా వార్తల్లో నిలుస్తోన్న నేపథ్యంలో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడం విశేషం.

47
నాల్గో స్థానంలో అల్లు అర్జున్‌

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నాల్గో స్థానం దక్కించుకున్నారు. గత నెలలో ఆయన బాగా డౌన్‌ అయ్యారు. మహేష్‌ కంటే తక్కువ స్థానంలో ఉన్నారు, కానీ ఇప్పుడు మళ్లీ పుంజుకున్నారు. నాల్గో స్థానానికి ఎగబారు. 

ప్రస్తుతం ఆయన అట్లీతో సినిమా చేస్తున్నారు. తన `ఏఏ22`గా, సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సుమారు ఆరువందల కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇందులో దీపికా పదుకొనె కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెని వెల్‌ కమ్ చెబుతూ విడుదల చేసిన టీజర్‌ అదిరిపోయింది. యాక్షన్‌ చేస్తూ మైండ్‌ బ్లాక్‌ చేసింది దీపికా. ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. 

ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్లతో బన్నీ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన నాల్గో స్థానంలో నిలవడం విశేషమని చెప్పొచ్చు. ఐదో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ ఉన్నారు. అజిత్‌ తన స్థానాన్ని ఎప్పుడూ పదిలంగా ఉంచుకుంటున్నారు.

 ఆయన ఇటీవల `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది.

57
ఆరో స్థానంలో మహేష్‌ బాబు

ఇక ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో వరుసగా తెలుగు హీరోలు నిలవడం విశేషం. ఆరో స్థానంలో మహేష్‌ బాబు, ఏడో స్థానంలో ఎన్టీఆర్‌, ఎనిమిదో స్థానంలో రామ్‌ చరణ్‌ నిలిచారు. మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఎస్ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు.

 ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో, యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ మూవీని తెరక్కిస్తున్నారు రాజమౌళి. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇందులో గ్లోబల్ స్టార్‌ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 పృథ్వీరాజ్‌ ది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటించనుందట. ఆమె మహేష్‌కి సపోర్ట్ గా ఉంటుందని తెలుస్తోంది. ప్రియాంక కూడా ఇందులో భారీ యాక్షన్స్ చేయబోతుందని సమాచారం. 

మహేష్‌ బాబు మొదటిసారి పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. కానీ అప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి, మహేష్‌ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరగడం విశేషమనే చెప్పాలి.

67
ఏడో స్థానంలో ఎన్టీఆర్‌

`ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆస్కార్‌ వరకు వెళ్లి పాపులర్‌ అయ్యారు తారక్‌. ఇప్పుడు నెమ్మదిగా తమ పాన్‌ ఇండియా మార్కెట్‌ని పెంచుకునేందుకు, దాన్ని నిలబెట్టుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తారక్‌ చివరగా `దేవర` చిత్రంతో విజయం సాధించారు. ఈ మూవీ సౌత్‌లో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా ఆడింది. 

ఇప్పుడు `వార్‌ 2`తో రాబోతున్నారు. ఇందులో హృతిక్‌ రోషన్‌ మరో హీరో. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో చర్చ కూడా బాగానే జరుగుతుంది. అందుకే ఆయనకు సంబంధించిన చర్చ జరుగుతుంది. 

ఈ చిత్రాలతోపాటు ప్రశాంత్‌ నీల్‌తో `డ్రాగన్‌` మూవీ చేస్తున్నారు తారక్‌. అలాగే `దేవర 2` చేయాల్సి ఉంది. త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే నిర్మాత నాగవంశీనే వెల్లడించారు. 

మరోవైపు కోలీవుడ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తోనూ ఓ మూవీ నాగవంశీ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ ఏడో స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం.

77
8వ స్థానంలో రామ్‌ చరణ్‌

ఎనిమిదో స్థానంలో నిలిచిన రామ్‌ చరణ్‌ ఇటీవల `గేమ్‌ ఛేంజర్‌`తో డిజప్పాయింట్‌ చేశారు. కానీ ఆయన గురించిన చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటోంది. ప్రస్తుతం చరణ్‌.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` మూవీలో నటిస్తున్నారు. 

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో శివ రాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు, ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఆ తర్వాత చరణ్‌ లైనప్‌ కూడా భారీగానే ఉంది. 

కాకపోతే అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ఇక తొమ్మిదో స్థానంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, పదో స్థానంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నిలిచారు. 

ఇలా ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా మోస్ట్ పాపులర్‌ మేల్‌ ఫిల్మ్ స్టార్స్ టాప్‌ 10 జాబితాలో ఐదుగురు తెలుగు హీరోలు నిలవడం విశేషం. వీరితోపాటు కోలీవుడ్‌ నుంచి ఇద్దరు, బాలీవుడ్‌ నుంచి ముగ్గురు హీరోలు చోటు దక్కించుకున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories