Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?

Published : Dec 20, 2025, 08:02 PM IST

Top 10 Heroes: ఓర్మాక్స్ మీడియా నవంబర్‌ నెలకి సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్‌ జాబితాను విడుదల చేసింది. ఇందులో మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ తన హవా చూపించారు. 

PREV
18
ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే

ఇండియాలోనే టాప్‌ హీరోలు ఎవరనేది ఓర్మాక్స్ మీడియా  ప్రతి నెల జాబితా విడుదల చేస్తుంటుంది. సర్వే నిర్వహించి ఇండియాలోనే టాప్‌ హీరో ఎవరు? ఎవరికి పాపులారిటీ ఉంది? అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న హీరో ఎవరు? ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరో ఎవరు? వారి మార్కెట్‌, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాని విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగానే నవంబర్ నెలకు సంబంధించిన ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్ ని విడుదల చేసింది.

28
ప్రభాస్‌ నెంబర్‌ వన్‌ స్థానం

ఎప్పటిలాగానే ఇండియాలోనే మోస్ట్ పాపులర్‌ మేల్ ఫిల్మ్ స్టార్‌ జాబితాలో నెంబర్‌ 1గా ప్రభాస్‌ నిలిచారు. చాలా నెలలుగా ఆయనే టాప్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయనదే మొదటి స్థానం. ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజా సాబ్‌` చిత్రంతో ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీ ఫాంటసీ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ చేస్తున్న ఫుల్‌ మాసాలా కమర్షియల్‌ మూవీ కావడం విశేషం. దీంతోపాటు `ఫౌజీ` మూవీలో నటిస్తున్నారు. అలాగే ఇటీవలే `స్పిరిట్‌` చిత్రాన్ని ప్రారంభించారు. ఇలా నిత్యం వార్తల్లో ఉంటున్నారు ప్రభాస్‌.

38
విజయ్‌ టాప్‌ 2, షారూఖ్‌ టాప్‌ 3

ఇక రెండో స్థానంలో తమిళ స్టార్‌ విజయ్‌ ఉంటున్నారు. ఆయన ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు `జన నాయకుడు` సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషనల్‌ కార్యక్రమాలు ఎప్పుడో స్టార్ట్ చేశారు. దీంతో తరచూ వార్తల్లో ఉంటున్నారు విజయ్‌. ఈ రకంగా విజయ్‌ కూడా చాలా నెలలుగా టాప్‌ 2లోనే ఉంటున్నారు. అదే విధంగా టాప్‌ 3లో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ నిలిచారు. గత నెలలోనూ వీరి స్థానాలు సేమ్‌ ఉన్నాయి.

48
టాప్‌ 4లో అల్లు అర్జున్‌

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో నాల్గో స్థానంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఉన్నారు. `పుష్ప 2`తో ఇండియన్‌ బాక్సాఫీసుని షేక్‌ చేసిన ఆయన ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో `ఏఏ22` చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. దీనికి సంబంధించిన చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ సైతం నాల్గో స్థానంలో ఉంటున్నారు. అయితే కొన్ని సార్లు ఆయన టాప్‌ 3, టాప్‌ 2కి కూడా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం టాప్‌ 4కి ఫిక్స్ అయ్యారు.

58
టాప్‌ 5కి దూసుకొచ్చిన మహేష్‌ బాబు

ఇక టాప్‌ 6, 7, 8లో ఉండే మహేష్‌ బాబు ఇప్పుడు తన స్థానాన్నిపెంచుకున్నారు. ఐదో స్థానానికి ఎగబాకారు. మహేష్‌ బాబుకి పాన్‌ ఇండియా మార్కెట్‌ ఇంకా ఏర్పడలేదు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ గ్లింప్స్ ని నవంబర్‌లో విడుదల చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. `వారణాసి` సినిమా ట్రెండ్‌ అయ్యింది. దీంతో మహేష్‌ ఇమేజ్‌ పెరిగింది. దీని కారణంగానే ఆయన తన స్థానాన్ని పెంచుకున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ స్థానం సొంతం చేసుకున్నారు. మహేష్‌ ఒక్క స్థానం పెరగడంతో అజిత్‌ ఒక స్థానం పడిపోయి ఆరో స్థానానికి పరిమితమయ్యారు.

68
ఏడో స్థానంలో రామ్‌ చరణ్‌

రామ్‌ చరణ్‌ ఏడో స్థానంలో ఉన్నారు. గత నెలలో కూడా ఆయన స్థానం ఇదే. ఇప్పుడు కూడా తన స్థానం పదిలపర్చుకున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమా ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. `పెద్ది` మూవీ నుంచి `చికిరి` సాంగ్‌ విడుదల కాగా, అది బాగా ట్రెండ్‌ అయ్యింది.ఇప్పటికీ ట్రెండింగ్‌ అవుతోంది. ఈ సినిమాతో రామ్‌ చరణ్‌ వార్తల్లో నిలుస్తూ తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు.

78
టాప్‌ 8లో ఎన్టీఆర్‌

మరోవైపు రామ్‌ చరణ్‌ తర్వాత ఎనిమిదో స్థానంలో ఎన్టీఆర్‌ నిలిచారు. తారక్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సినిమాకి సంబంధించిన డిస్కషన్‌ గత నెలలో బాగానే జరిగింది. `డ్రాగన్‌` ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు తారక్‌. ఇక తొమ్మిదో స్థానంలో బాలీవుఢ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఉన్నారు.

88
టాప్‌ 10 జాబితాలో పవన్‌

పదో స్థానంలో పవర్‌ స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు. ఆయన నటించిన `ఓజీ` మూవీతో పవన్‌ రేంజ్‌ పెరిగిపోయింది. పాన్‌ ఇండియా లెవల్‌లో పాపులర్‌ అయ్యారు. దీంతో ఆయనకు సంబంధించిన చర్చ కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో గత నెలలో `ఓజీ` ఓటీటీలో విడుదలై దుమ్ములేపింది. దీంతో ఆ చర్చ  సాగింది. ఎప్పుడూ లేని విధంగా పవన్‌ టాప్‌ 10 జాబితాలోకి వచ్చారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు మూడు నెలలు ఆయన టాప్‌ 10లో ఉండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories