2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?

Published : Dec 20, 2025, 07:00 PM IST

2026 South Indian Movies : 2026 వ సంవత్సరంలో సౌత్ సూపర్‌స్టార్స్ సత్తా చాటబోతున్నారు. వచ్చే ఏడాది భారీ బడ్డెజ్ తో చాలా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ లిస్ట్ లో ఉన్న హీరోలెవరు,  ఆ సినిమాలేంటి?  

PREV
17
రాజాసాబ్

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా రాజాసాబ్. కామెడీ, హారర్ జానర్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాకు మారుతి దాసరి దర్శకత్వం వహించారు. 'రాజాసాబ్' సినిమాలో ప్రభాస్ రెండు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

27
పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించని  పెద్ది సినిమా కూడా 2026లో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతోంది.  రామ్ చరణ్‌ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో కన్నడ స్టార్ హీరో  శివ రాజ్‌కుమార్,  దివ్యేందు శర్మ, జగపతి బాబు, విజయ్ చంద్రశేఖర్ కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా 2026 మార్చ్ లో రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు డైరెెక్షన్ లో ఈసినిమా తెరకెక్కుతోంది. 

37
మన శంకర్ వరప్రసాద్ గారు

2026 సంక్రాంతి కానుకగా రాబోతున్న మరో సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమా గురించి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కమెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. 

47
జన నాయగన్

విజయ్ దళపతి కెరీర్ లో చిట్టచివరి సినిమా 'జన నాయగన్. ఈసినిమా  తరువాత  దళపతి విజయ్  ఇండస్ట్రీని వదిలేసి.. పూర్తిగా రాజకీయల్లోకి వెళ్లిపోబోతున్నాడు. అందుకే  పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.  ప్రభాస్ 'రాజాసాబ్'తో ఈమూవీ పోటీ పడనుంది, ఎందుకంటే ఇది కూడా జనవరి 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. వినోద్ కూమార్ ఈసినిమాకు దర్శకుడు. 

57
స్పిరిట్

రీసెంట్ గానే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. భారీ యాక్షన్ సీన్ తో డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగా ఈసినిమాను స్టార్ట్ చేశారు.  యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో స్పిరిట్ తెరకెక్కుతోంది. ప్రభాస్  ఈసినిమాలో డిపరెంట్  పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 దసరా టైమ్ లో  థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

67
జైలర్ 2

ఈ రిలీజ్ ల  జాబితాలో 'జైలర్ 2' సినిమా పేరు కూడా ఉంది. 2023లో విడుదలైన జైలర్  సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కింది. 2026లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమాపై సౌత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. 

77
టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్

'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'లో యశ్‌తో పాటు నయనతార, టోవినో థామస్, కియారా అద్వానీ, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేజీఎఫ్ తరువాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో… టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories