Illu illalu pillalu Today Episode: తనపై జరిగిన కుట్రను బయటపెట్టిన నర్మద.. సేనాపతి, భద్రావతి అరెస్టు

Published : Nov 10, 2025, 09:10 AM IST

Illu illalu pillalu Today Episode: ప్రేమ పుట్టింటికి వెళ్లడంతో ఈరోజు ఎపిసోడ్ మొదలవుతుంది. ఆమె వెంటే వెళ్లి ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ధీరజ్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇంకేం జరిగిందో తెలుసుకోండి 

PREV
15
ఇంట్లో గొడవ పెట్టేందుకు ఎదురుచూస్తున్న జంట

ప్రేమ అత్తారింటి నుంచి వేగంగా నడుచుకుంటూ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ప్రేమకు ఫోన్ చేస్తాడు ధీరజ్. ప్రేమ పుట్టింటి హాల్లోనే ఉండి ఫోన్ మాట్లాడుతుంది. ధీరజ్ ఎంతో బతిమిలాడి ప్రేమను తిరిగి వచ్చేందుకు ఒప్పిస్తాడు. ప్రేమ పుట్టింటికి వచ్చిన సంగతి సేనాపతి, భద్రావతిలు గుర్తించరు. ఇదంతా ఇడ్లీ బాబాయి, భాగ్యం చూస్తూ ఉంటారు. ప్రేమ ఆ ఇంట్లోకి అంతా ధైర్యంగా ఎలా వెళ్ళిందో అర్థం కావట్లేదని ఇడ్లీ బాబాయ్, భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా ఇదే సమయంలో రామరాజు ఇంట్లో లేకుండా ఊరెళ్ళిపోయారని భాగ్యం అంటుంది. ఆయన ఇప్పుడు ఉంటే ఈపాటికి చిచ్చుపెట్టి ఇంట్లో చిచ్చుబుడ్డి వెలిగించేసే వాళ్ళమని ఇద్దరూ అనుకుంటారు.

ఈ లోపు ఇడ్లీ బాబాయ్.. వేదవతి చెల్లెమ్మకి ప్రేమ పుట్టింటికి వెళ్ళిన సంగతి చెబుదామా అని అడుగుతాడు. దానికి భాగ్యం చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అంటుంది. ప్రేమ, వేదవతి మేనకోడలని, ఆ ఇల్లు ఆ వేదవతి పుట్టిల్లని.. ఈ విషయాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలనుకుంటుందే కానీ ప్రేమను ఏమీ అనదని భాగ్యం అంటుంది.

25
సేనాపతి భద్రావతిల ఆనందం

ప్రేమ పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో మళ్లీ వెంటనే ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదని ఇడ్లీ బాబాయి, భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి భాగ్యం.. ధీరజ్, ప్రేమ కలిసి సరదాగా దాగుడుమూతలు ఆడుకుంటున్నారని అంటుంది. ఇక్కడి నుంచి సీన్ భద్రావతి ఇంటికి మారిపోతుంది. వారు టీవీలో నర్మదా లంచం గురించిన న్యూస్ వింటూ ఉంటారు. ఆనందంతో తేలియాడుతూ ఉంటారు. సేనాపతి మాట్లాడుతూ.. ‘అయిపోయింది అక్కా... అయిపోయింది.. మనం కొట్టిన దెబ్బకు నర్మదా పూర్తిగా అయిపోయింది’ అంటాడు. ఇంకాసేపట్లో నర్మదను రిమాండ్ కు తీసుకెళ్తారని ఆనంద పడుతూ ఉంటాడు. 

దానికి భద్రావతి ‘నర్మదా లంచం కేసులో డబ్బుతో సహా పట్టుబడింది. కాబట్టి ఇక ఆ దేవుడు కూడా కాపాడు లేడని’ అంటుంది. ఉద్యోగం పోవడం మాత్రమే కాదు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని ధీమాగా చెబుతుంది. కోడలు జైలుకు వెళ్లిందని తెలియగానే రామరాజు అవమానంతో గుండె పగిలి చస్తాడని సేనాపతి ఆనందంతో నవ్వుతూ చెబుతాడు.

35
అతిగా మాట్లాడిన భాగ్యం

ఇక వేదవతి బాధతో ఇంట్లో కూర్చుని ఉంటుంది. చుట్టూ కుటుంబ సభ్యులంతా ఉంటారు. ఈలోపు అక్కడికి ధీరజ్, ప్రేమ కూడా వస్తారు. ఇడ్లీ బాబాయ్, భాగ్యం వచ్చి వేదవతిని మరింత బాధ పెట్టేందుకు చూస్తారు. ‘దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుందని నర్మదా నిజాయితీకి మారుపేరని మనం అనుకున్నామని కానీ ఇలా లంచం తీసుకొని అరెస్ట్ అవుతుందని మనం అనుకున్నామా చెప్పండి’ అని అంటుంది. దానికి వేదవతికి చాలా కోపం వస్తుంది. ఇంకొకసారి తన కోడలు లంచం తీసుకుందని అనవద్దని ఆమె ఎంత నిజాయితీపరాలో తనకు తెలుసని అంటుంది. వేదవతి తన వెనుక ఏదో కుట్ర జరిగిందని అంతే తప్పా.. ప్రాణం పోయినా నర్మద లంచం తీసుకోదని అంటుంది వేదవతి. 

దానికి భాగ్యం ‘మన అమ్మాయి మంచితనం కోసం మంచితనం గురించి మనకు తెలుసు పోలీసులకు తెలియదు కదా’ అని వెటకారంగా అంటుంది. వాళ్లు చూసేది సాక్ష్యాలు ఆధారాలు తప్ప మంచితనం, మంచి మనసు కాదని అంటుంది భాగ్యం. ఈలోపు సేనాపతి, భద్రావతి మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మద జైలుకు పోవడం తప్ప మరో దిక్కు లేదని అంటుంది భద్రావతి. మనం చేసిన కుట్రను పైనున్న దేవుడు కూడా కనిపెట్టలేదని ధీమాగా ఉంటుంది. నర్మద కూడా కనిపెట్టలేదని చెబుతుంది. తాను లంచం తీసుకోలేదని ఎలా నిరూపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది.

45
నర్మదపై కుట్ర బయటపడింది

నర్మదా లంచం కేసు పై విచారణ సాగుతూ ఉంటుంది. లంచం ఇచ్చిన వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. ఆఫీసర్ నర్మదను ఇంటరాగేట్ చేస్తాడు. లంచం ఇచ్చిన వ్యక్తి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులు పై ఉన్న నంబరు, మీరు లంచంగా తీసుకున్న నెంబరు ఒకటేనని నర్మదకు చెబుతాడు. మీరు లంచం తీసుకున్నట్టు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని.. మీకు మీరే తప్పు ఒప్పుకోమని అడుగుతాడు. ఆఫీసర్.. నర్మద మాత్రం తాను తప్పు చేశానని ఒప్పుకోదు. నోట్ల నెంబర్లు ఒకటవ్వగానే తాను లంచం తీసుకున్నట్టు నిర్ధారణకు వస్తున్నారని, కానీ అతనికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకుంటే అసలు నేరస్థులు ఎవరో అర్థమవుతుందని నర్మదా అంటుంది. 

గత ఆరు నెలలుగా ఈ లంచం ఇచ్చిన వ్యక్తి అకౌంట్లో కనీసం ఇరవైవేల రూపాయలు కూడా లేవని, అలాంటిది ఒక్కసారిగా రెండు లక్షల రూపాయలు వచ్చి ఎలా పడ్డాయని ప్రశ్నిస్తుంది. అలాగే ఆ రెండు లక్షల డబ్బు ఎవరిచ్చారో చూడమని చెబుతుంది. అప్పుడు ఆఫీసర్ చెక్ చేస్తే సేనాపతి అతను అకౌంట్లోకి రెండు లక్షల డబ్బు వేసినట్టు చెబుతాడు. నర్మద మాట్లాడుతూ సేనాపతి, భద్రావతి కలిసి గవర్నమెంట్ ల్యాండ్ ను కబ్జా చేశారని, అది నేను అడ్డుకోవడం వల్లే ఇలా కుట్ర చేసి ఇరికించారని నర్మదా వివరిస్తుంది. దీంతో నర్మదను వెళ్లిపోమని ఆఫీసర్ చెబుతాడు. సారీ కూడా చెబుతాడు. నర్మదా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

55
ఆనందంతో వేదవతి కుటుంబం

ఈలోపు సేనాపతి, భద్రావతి బ్రేకింగ్ న్యూస్ వింటూ ఉంటారు. అందులో న్యూస్ రీడర్ లంచం కేసులో పట్టుబడిన నర్మద.. నిర్దోషిగా విడుదలైందని చెబుతుంది. అది విని వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. వేదవతి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వేదవతి ఆనందంలో తన కోడలు ఎలాంటి తప్పు చేయదని కడిగిన ముత్యంలా నిందను తుడుచుకొని ఇంటికి వస్తోందని ఆనందపడుతుంది. శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తప్ప అందరూ ఆనందపడతారు. ఇక చివరలో సేనాపతి, భద్రావతిని అరెస్టు చేసేందుకు వస్తారు పోలీసులు.

Read more Photos on
click me!

Recommended Stories