Illu Illalu Pillalu Today Episode Dec 29: అమూల్యకు పెళ్లి చేసేందుకు సిద్ధమైన రామరాజు, షాకైన కుటుంబం

Published : Dec 29, 2025, 09:13 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 29: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ప్రేమను మాటలతోనే బాధపెడతాడు ధీరజ్. మరోపక్క ఇంట్లో గొడవలు అవుతుంటే వల్లి ఆనందంతో డాన్సులు వేస్తుంది. రామరాజు పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఎపిసోడ్లో ఏం జరిగింది? 

PREV
14
పెళ్లికి ముందు లేచిపోయింది నువ్వు

ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్ లో ధీరజ్, ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్, ప్రేమను చాలా మాటలు అంటాడు. ‘ఈ రోజు నువ్వు మా అమ్మకి మంచి గుణపాఠం నేర్పించావు. కుటుంబాన్ని పెంచడం చేతకాని తల్లి అని నిరూపించావు. మీ నాన్నని ఆడపిల్లని పెంచడం చేతకానిది మా నాన్నకు కాదయ్యా నీకు అని నేను అని ఉంటే... పెళ్లికి ముందురాత్రి నీ కూతురు ఎవడితోనో లేచిపోయిందని మీ నాన్నకి చెప్పి ఉంటే.. మీ నాన్న అక్కడే గుండె పగిలి చచ్చిపోయి ఉండేవాడు’ అని అంటాడు. దీంతో ప్రేమ ఏడ్చుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. మరోపక్క వల్లి ఆనందంతో డాన్సులు వేస్తూ విజయ సంబరాలు చేసుకుంటుంది. మరోపక్క వేదవతి, రామరాజు తమ గదిలో దిగాలుగా కూర్చుని ఉంటారు. ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. సాగర్ నిద్ర పోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇలా వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే వల్లి మాత్రం ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది.

24
ప్రేమ మనసు మార్చేందుకు నర్మద ప్రయత్నం

నర్మదా కిటికీలోంచి బయటకు చూసేసరికి ప్రేమ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలా చూసి బాధపడిన నర్మద ఆమె దగ్గరికి చాప, దిండు, దుప్పటి అన్నీ పట్టుకొని వచ్చి పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది. ప్రేమను తీసుకెళ్లి పడుకోబెడుతుంది. తానే కూడా పక్కన పడుకుంటుంది. ఆప్యాయంగా ప్రేమపై చేయి వేస్తుంది. దాంతో ప్రేమ కూడా హ్యాపీగా ఫీలై నిద్రపోతుంది. 

ఉదయం అయ్యాక వల్లి దేవుడికి పూజ చేస్తుంది. ‘నువ్వున్నావని నిరూపించావు. ఆ ప్రేమ, నర్మదా జడలు ముడేసావు. వారు గొడవ పడుతుంటే నా జోలికి రారు’ అంటూ దేవుని పొగిడేస్తూ ఉంటుంది. అలా ఆనందంగా డాన్సులు వేస్తూ బయటికి వస్తుంది. అక్కడ ప్రేమ, నర్మద కూర్చొని టీ తాగుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ కలిసి చూసి మళ్ళీ తెగ బాధ పడిపోతుంది. నిన్ననే కదా నిప్పు ఉప్పులా కొట్టుకున్నారు, ఈరోజు కలిసి కూర్చున్నారేంటి అని ఫీల్ అయిపోతుంది. తర్వాత దేవుణ్ణి కోపంగా చూస్తుంది. తిరిగి దేవుడు దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఇప్పుడే కదా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎగిరిన దూది ఎక్కువ సేపు గాలిలో నిలవదు అన్నట్టు నా సంతోషం కూడా ఎక్కువ సేపు లేకుండా చేసావు, నేనంటే నీకు ఎందుకంత కక్ష అనే కాసేపు కామెడీ చేస్తుంది. 

మరోపక్క నర్మద ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది. ‘చూడు ప్రేమ ఎమోషనల్ గా మాట్లాడకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తానంటే నీతో ఒక విషయం మాట్లాడతాను. నువ్వు కంప్లీట్ గా రాంగ్ ఎమోషన్ లో ఉన్నావ్. మీ అన్నయ్య కన్నీళ్లు పెట్టుకొని కాస్త సెంటిమెంటల్ గా మాట్లాడేసరికి నువ్వు నమ్ముతున్నావు’ అని అంటుంది. ఈ లోపు ప్రేమ ‘కాదక్కా మా అన్నయ్య మాటల్లో నిజాయితీ కనిపించింది. అందుకే నమ్మాను’ అని చెబుతుంది. 

అప్పుడు నర్మద ‘మీ అన్నయ్య నిజాయితీ నటన అని నేను అంటున్నాను. అమూల్య తనంతట తాను మీ అన్నయ్యను ప్రేమించలేదని, మీ అన్నయ్య ప్రేమ అనే మాయలోకి దించాడని నేను బలంగా నమ్ముతున్నాను’ అని అంటుంది. దానికి ప్రేమ ‘లేదక్కా నువ్వే రాంగ్ గా ఆలోచిస్తున్నావు. ఈ విషయంలో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావ్. మా అన్నయ్య అమూల్యను ప్రేమ పేరుతో ట్రాప్ చేయలేదు. అమూల్య మా వాడిని ప్రేమించింది. వాడు లేకపోతే చచ్చిపోతానని కూడా మా వాడితో చెప్పిందట’ అని అంటుంది.

34
ప్రేమ మొండి పట్టుదల

అప్పుడు నర్మద ప్రేమతో ‘సరే మీ అన్నయ్య చెప్పింది నిజమని నువ్వు నమ్ముతున్నావు. అందులో తప్పులేదు. నీవాళ్లు నీ మీద ఉన్న ప్రేమతో ఈ కుటుంబం పై ఉన్న పగతో నిన్ను శాశ్వతంగా నీ పుట్టింటికి తీసుకెళ్లి పోవడం కోసం అమూల్యని అడ్డుపెట్టుకొని చేస్తున్న కుట్ర అని నేను అంటాను’ అని చెబుతుంది. ప్రేమ మాత్రం ఎంతకీ ఒప్పుకోదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అడ్డుపెట్టుకొని నన్ను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించరు అని చెబుతుంది. అప్పుడు నర్మద సరే అయితే మీ అన్నయ్య ఆడిందంతా నాటకమని, అమూల్యను తానే ట్రాప్ చేశాడని నేను నిరూపిస్తే అప్పుడు నమ్ముతావా? అని అడుగుతుంది. దానికి కూడా ప్రేమ ఒప్పుకోదు. ఇదంతా వల్లి కిటికీలోంచి చూస్తూ తెగ ఆనంద పడిపోతూ ఉంటుంది. దేవుడిొకి ప్రసాదం పెట్టి మళ్ళీ మొక్కుకుంటుంది. మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టినందుకు సంతోషిస్తుంది.

44
కొడుకులను తిట్టిన రామరాజు

రామరాజు హాల్లోకి వచ్చి వేదవతిని అందరిని పిలవమని చెబుతాడు. అందరూ హాల్లోకి వచ్చి నిల్చుంటారు. ‘ఇంట్లో ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. కానీ ముగ్గురు చెల్లెలి గురించి పట్టించుకోని చవట దద్దమ్మలు. చెల్లెలు కాలేజీకి వెళ్తోంది.. అది ఏం చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది? దాన్ని ఎవరైనా ఏడిపిస్తున్నారా? దాన్ని వెనక ఎవరైనా పడుతున్నారా? అన్న విషయం మీలో ఒక్కరైనా పట్టించుకున్నారా? అన్నగా ఒక్కడైనా చెల్లెలి బాధ్యత తీసుకున్నాడా? ఎంతసేపు మీ గొడవలు మీవి, మీ డాన్సులు మీవి, మీ ప్రపంచం మీది... అంతేకానీ చెల్లెలి గురించి ఎవరు ఆలోచించలేదు. నడిరోడ్డు మీద గొడవ జరిగి ఇంటి పరువు వీధిన పడేంతవరకు మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మీలో ఎవరైనా జాగ్రత్తగా ఉండుంటే చెల్లెలు విషయంలో ఇలా జరిగి ఉండేదా? అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. కాబట్టి అమూల్య జీవితం ఇబ్బందుల్లో పడకూడదని ఆలోచించి వేదవతి నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. అమూల్యకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెబుతాడు రామరాజు. దీంతో అందరూ షాక్ అవుతారు. నేటితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories