Illu Illalu Pillalu Today Episode Dec 22: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో నర్మద, ప్రేమ కలిసి వల్లిని ఎలాగైనా ఇంటర్వ్యూకి పంపించాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ వల్లి వాటిని అడ్డుకునేందుకు ట్రై చేస్తుంది. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద, ప్రేమ పాయసం చేసి అందరికీ పంచుతారు. వేదవతి ఎందుకు పాయసం ఇస్తున్నారు అని అడిగితే.. వల్లి అక్క ఉద్యోగానికి వెళుతుంది కదా, ఆ ఆనందంతోనే ఇస్తున్నామని చెబుతారు. ఇదంతా వల్లి దొంగ చాటుగా వింటుంది. ఆ రోజు వల్లి ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ ఇంటర్వ్యూ ని తప్పించుకునేందుకు ఉల్లిపాయల ప్లాన్ తో జ్వరం వచ్చేలా నటిస్తుంది. ప్రేమ, నర్మద వచ్చి వల్లిని ఇంటర్వ్యూకు రెడీ అవ్వమని చెబుతారు.
వల్లి తనకు జ్వరం వచ్చిందని కావాలంటే చూసుకోమని చేయిస్తుంది. చెయ్యి పట్టుకోగానే వేడిగా ఉండడంతో నిజంగానే జ్వరం వచ్చిందని అనుకుంటారు. ఈలోపు చంకల్లోంచి ఉల్లిపాయ ముక్కలు కింద పడతాయి. వాటిని చూసి వల్లి ప్లాను నర్మదకు, ప్రేమకు అర్థం అయిపోతుంది. వల్లి అమాయకంగా ఇంత జ్వరంతో ఎలా వెళ్తాను? ఇంటర్వ్యూ కి వెళ్లలేను కదా అని చెబుతుంది. దానికి నర్మద, ప్రేమ కాసేపట్లో నువ్వే ఇంటర్వ్యూకి రెడీ అవుతావు చూడు అని చెబుతారు.
24
భాగ్యం వెంట రౌడీలు
ఇక ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్, భాగ్యం దగ్గరికి మారుతుంది. వీరిద్దరిని అప్పుల వాళ్ళు తరమడంతో వీధి వీధి తిరుగుతూ పరిగెడుతూ ఉంటారు. ఒకచోట దాక్కొని ఇడ్లీ బాబాయ్, భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు. 10 లక్షలు అప్పు తీర్చకపోతే ఈ రౌడీలు చంపేసేలా ఉన్నారు, కానీ మనకి ఇప్పుడు పది రూపాయలు కూడా అప్పు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు ఇడ్లీ బాబాయ్. రామరాజును మోసం చేసినందుకు మనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటాడు. ఈలోపు రౌడీలు రావడంతో మళ్లీ పరుగులు పెట్టడం మొదలు పెడతారు. చివరికి ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని ఒకచోట ఆగుతారు. భాగ్యం మాట్లాడుతూ వల్లికి ఫోన్ చేస్తాను ఈ రౌడీలను వెనక్కి పంపించేలా విశ్వతో మాట్లాడుతుంది అని చెప్పి ఫోన్ చేస్తుంది.
34
తల్లిదండ్రులను చచ్చిపోమన్న వల్లి
ఇక వల్లి దుప్పటి కప్పుకొని తన దొంగ నాటకం ఎక్కడ బయటపడిపోతుందో అని భయపడుతూ ఉంటుంది. నర్మద, ప్రేమ.. డాక్టర్‌ని పిలిపించేందుకు సిద్ధమవుతారు. డాక్టర్ వస్తే తన విషయం బయట పడుతుందని వల్లి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది . ఈ లోపు భాగ్యం నుంచి వచ్చిన ఫోను తీసి మాట్లాడుతుంది. భాగ్యం కూతురుతో 10 లక్షల కోసం విశ్వక్ రౌడీలను పంపించాడని వారు మమ్మల్ని చంపేసేలా ఉన్నారని అంటుంది. దానికి వల్లి కోపంతో ‘అయితే చచ్చిపోండి, త్వరగా చచ్చిపోండి. మీరు మా అమ్మాయి ఎమ్మే చదివిందని చెప్పిన అబద్ధం పాములాగా నా మెడకి చుట్టుకుంది. నన్ను ఎలాగైనా ఇంటర్వ్యూకి పంపించాలని నర్మద, ప్రేమ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తప్పించుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నాలన్నీ చితైపోతున్నాయి. నేను ఇంటర్వ్యూ కి వెళ్తే నా చదువు మొత్తం బయటపడుతుందని, మనం చేసిన మోసం కూడా బయట పడుతుందని, మామయ్యకి మొత్తం తెలిసిపోతుందని భయమేస్తోందని అంటుంది వల్లి. మీకు చేతనైతే నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించండి... లేదా వాళ్ళ చేతుల్లో చావండి అని చెప్పి వల్లి ఫోన్ పెట్టేస్తుంది.
ఇక్కడ నుంచి సీన్ రామరాజు ఇంటికి మారుతుంది. నర్మద, ప్రేమ కలిసి వల్లికి కొంచెం జ్వరం వచ్చిందని డాక్టర్ గారిని పిలిచామని చెబుతారు. డాక్టర్ ఇంటికి వస్తాడు. ప్రేమ, నర్మద ఆ డాక్టర్ గురించి చాలా గొప్పగా చెబుతారు. డాక్టర్ ను వల్లి దగ్గరికి తీసుకెళ్తారు. నీ జ్వరం పోగొట్టడానికి డాక్టర్ గారిని పిలిపించామని నర్మద, ప్రేమ చెబుతారు. ఇక వల్లి తనలో తాను ఎలాగో నాకు ఒళ్ళు కాలిపోతుంది కాబట్టి టాబ్లెట్లు ఇచ్చి మూడు రోజులు వేసుకోమంటారు.. నేను తప్పించుకున్నట్టే అనుకుంటుంది. వచ్చిన డాక్టర్ పెద్ద సూది ఉన్న ఇంజక్షన్ తీస్తాడు. అది చూసి వల్లి భయపడిపోతుంది.
కానీ డాక్టర్ మాత్రం ఆ పెద్ద ఇంజక్షన్ చేస్తానని పట్టుబడతాడు. నర్మద, ప్రేమ కూడా చేయమనే చెబుతారు. వల్లికి ఆ సూది సైజు చూసి విపరీతంగా భయం వచ్చేస్తుంది. వల్లి సూదిని చూసి భయపడి పోయి లేచి పరుగులు పెడుతుంది. ఆమెను పట్టుకునేందుకు ప్రేమ నర్మదా ప్రయత్నిస్తారు. కానీ వల్లి గాభరాలో నాకు జ్వరం తగ్గిపోయింది, ఇప్పుడు ఎంతో బాగుందని, ఇంజక్షన్ అవసరం లేదని డాక్టర్ ను కసిరేస్తుంది. దీంతో డాక్టరు వెళ్ళిపోతాడు. ప్రేమ మాట్లాడుతూ అతడు నిజమైన డాక్టర్ కాదు నీ దొంగ నాటకాలు బయట పెట్టడానికి మేమే పిలిపించాం అని వల్లితో చెబుతారు. వల్లి ఈ విషయం విని ఏడుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ధీరజ్ అమూల్య, విశ్వలను కలిసి చూస్తాడు. అమూల్య కాలేజీ ఎగ్గొట్టి మరి విశ్వను కలవడం చూసి ధీరజ్ షాక్ అవుతాడు.