Illu Illalu Pillalu Today Episode Dec 2: ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్ లో వల్లి రెడ్ హ్యాండెడ్ గా చేతిలో నగలతో నర్మద, ప్రేమకు దొరికిపోతుంది. దీంతో వల్లిని ఒక ఆటాడుకుంటారు నర్మద, ప్రేమ. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి.
ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్ లో వల్లి మొక్కల దగ్గర పాతిపెట్టిన నగలను తీసి చూసుకుంటుంది. అవి ఆకులుగా మారలేదని ఆనందంగా వాటికి ముద్దులు పెడుతూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి నర్మద, ప్రేమ వచ్చి నిల్చుంటారు. వారిని చూసి ఒక్కసారిగా షాక్ తింటుంది వల్లి. అప్పుడు నర్మద మాట్లాడుతూ ‘నువ్వే నగలను తీసావ్ అని మాకు తెలుసు. స్వామీజీ తో ఆడించింది ఒక నాటకం’ అని చెప్పేస్తుంది. దానికి వల్లి చాలా ఫీల్ అయిపోయి ఏదేదో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ చాలా కోపంగా మాట్లాడుతూ ‘నువ్వు కొంపలు కూల్చే కిలాడీవే అనుకున్నా.. కానీ నువ్వు దొంగవి కూడా’ అని ఇప్పుడే తెలిసింది. నీ స్వార్థం కోసం నన్ను బలి చేయాలని చూస్తావా అంటూ వల్లి పై అరుస్తుంది ప్రేమ. నా నగలు కొట్టేసిందే కాకుండా నా మీదకి ధీరజ్ మీదికి ఎంత తెలివిగా తోసేసావా అంటూ వల్లిపై అరుస్తుంది. మామయ్య గారికి చెప్పేస్తానని అంటుంది ప్రేమ. అయితే వల్లి వద్దని నర్మదను, ప్రేమను వేడుకుంటుంది.
25
ప్రేమ కాళ్లపై పడిన వల్లి
వల్లి ఏడుస్తూ ‘మీరు ఈ విషయం వెళ్లి మావయ్య గారికి చెప్తే నాకు కాపురం కూలిపోతుంది. నా జీవితం నాశనమైపోతుంది. మామయ్య గారు నన్ను పుట్టింటికి తన్ని తరిమేస్తారు. దయచేసి మావయ్య గారికి చెప్పకండి ప్లీజ్’ అంటూ బతిమిలాడుతుంది. నర్మద మాట్లాడుతూ ‘ధీరజ్, ప్రేమలది కాపురం కాదా? నీ కాపురమే ముఖ్యమా?’ అని నిలదీస్తుంది. దానికి వల్లీ ఏడుస్తూ నా మీదకి ఎక్కడ వచ్చేస్తుందని భయంతో అలా చేశానని చెబుతుంది. కానీ ప్రేమ మాత్రం మావయ్య గారికి చెప్పి తీరాల్సిందేనని పట్టుబడుతుంది. ప్రేమ ,నర్మదతో చాలాసేపు సెంటిమెంట్ డ్రామాలన్నీ ఆడుతుంది వల్లీ. ప్రేమ ఎంతకీ ఒప్పుకోకపోవడం ఆమె కాలిపై పడి వల్లి బతిమిలాడుతుంది. దయచేసి మామయ్య గారికి చెప్పొద్దని అడుగుతుంది.
35
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
ప్రేమ, నర్మద వినకపోవడంతో వల్లి నగలను ప్రేమకి ఇచ్చేసి కోపంగా ఇంట్లోకి వెళుతుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది వల్లి. ‘మా అమ్మ నాన్నలు అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా కూడా నాకు మా ఆయనంటే చాలా ప్రాణం. ఆయనకి దూరంగా వెళ్లాల్సిన అవసరం వస్తే నేను చచ్చిపోతాను’ అంటూ వల్లి ఏడుస్తుంది. నర్మద ‘ఈ సమస్య రావడానికి నువ్వే కారణం.. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాల్సింది కూడా నువ్వే’ అని వల్లికి పెద్ద బాధ్యతను అప్పచెప్పుతుంది.
ఇక్కడ నుంచి సీన్ తిరుపతి దగ్గరికి మారుతుంది. అతని దగ్గరికి వల్లి వచ్చి పోయిన నగలను తెచ్చి ఇస్తుంది. వాటిని మావయ్య గారికి ఇవ్వమని కోరుతుంది. ఈ నగలు నీ దగ్గరే ఉన్నాయని చెప్పి నీ చేతుల మీదే ఇవ్వమని అడుగుతుంది. దానికి తిరుపతి ఎంతకీ ఒప్పుకోడు. తన మీదకు రాకుండా తెలివిగా తిరుపతి మీదకి నగల విషయాన్ని తోయాలని వల్లి చూస్తుంది. ఈ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయని వల్లిని ప్రశ్నిస్తాడు తిరుపతి. కానీ మళ్ళీ ఏమీ చెప్పకుండా ఈ నగల భారాన్ని నువ్వే తీసుకొని మావయ్య గారికి అప్ప చెప్పమని కోరుతుంది. వల్లి ఏడుపులకు తిరుపతి కరిగిపోతాడు.చివరికి నగలను తిరుపతి చేతికి చేస్తుంది
55
రామరాజు దగ్గరికి నగలు
మరోపక్క రామరాజు ఇంటికి వస్తాడు. రామరాజుని చూడగానే వల్లి, తిరుపతి భయంతో వణికిపోతూ ఉంటారు. రామరాజు వచ్చి కుర్చీలో కూర్చోగానే గనలను తిరుపతి చేతికిచ్చి తీసుకెళ్ళమని చెబుతుంది వల్లి. కాని తిరుపతి భయంతో అక్కడే ఆగిపోతాడు. ఒక ప్లేట్ లో నగలను పట్టుకొని తిరుపతి రామరాజు దగ్గరికి వస్తాడు. నగలను చూపిస్తాడు. రెండు కుటుంబాల మధ్య ఏ నగల కోసం గొడవ జరిగిందో ఆ ప్రేమ నగలు ఇవే అని చూపిస్తాడు. దీంతో రామరాజు షాక్ అవుతాడు. కుటుంబ సభ్యులంతా వచ్చి అక్కడ నిలుచుంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.