Varanasi OTT Rights : టాలీవుడ్ చరిత్రలోనే ఉహించలేనంత భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది మహేష్ బాబు వారణాసి మూవీ. ఈ సినిమా బిజినెస్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. వారణాసి ఓటీటీ రైట్స్ విషయంలో రాజమౌళి అంతకు మించి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈసినిమా బడ్జెట్ రేంజ్ కు కలెక్షన్స్ అంటే.. ఏ రేంజ్ లో ఉండాలి. ముందు ఈసినిమాకు అంత బిజినెస్ అవుతుందా. ఇప్పటి నుంచే ఈ లెక్కలపై గట్టిగా పనిచేస్తున్నాడట జక్కన్న. ప్రస్తుతం టాలీవుడ్ మార్కేట్ భారీగా పెరిగింది. తెలుగు సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అందులో రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈక్రమంలో వారణాసి బిజినెస్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి గట్టిగా వినిపిస్తోంది.
25
వారణాసి ఓటీటీ రైట్స్ కు డిమాండ్..
వారణాసి ప్రీరిలీజ్ బిజినెస్ పై రాజమౌళి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడట. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కు సంబంధించి ఇప్పటికే చాలా ప్రపోజల్స్ వచ్చినట్టు సమాచారం. ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..వారణాసి ఓటీటీ రైట్స్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 650 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి మాత్రం అంతకు మించి ఆలోచిస్తున్నట్టు సమాచారం. వెంటనే ఈ డీల్ కు ఓకే చేయకుండా.. మరింత భారీ డీల్ కోసం వెయిట్ చేయాలని చూస్తున్నారట. జక్కన్న లేక్కల ప్రకారం వారణాసి ఓటీటీ రైట్స్‌ను వెయ్యి కోట్లకు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్.
35
రాజమౌళి సినిమా అంటే గ్యారెంటీ
అయితే నిర్మాతల డిమాండ్లకు తగ్గట్టు మార్కెట్ ఉండటం లేదు. ఓటీటీ లు సినిమాను బట్టి.. ఒక గీత గీసుకుని కూర్చుటున్నారు.అంతకు మించి ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఒక వేళ.. ఆ సినిమా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. కాస్త ఆలోచిస్తారు కానీ.. ముందుగానే సినిమాను కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం తొందరపడి అడుగు వేయడంలేదు. కానీ రాజమౌళి సినిమా అంటే గ్యారెంటీ ఉంటుంది కాబట్టి.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో కాస్త ముందడుగు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఈమధ్య కాలంలో రిలీజ్ అవ్వకముందే కొన్ని సినిమాలు ఓటీటీ డీల్స్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకి నెట్‌ఫ్లిక్స్ మొత్తం 130 కోట్ల రూపాయలు చెల్లించి ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందే.. 160 కోట్ల రూపాయలకు ఈసినిమా అమ్ముడయినట్టు సమాచారం. పెద్ది చిత్రానికి విడుదలైన గ్లింప్స్, ‘చికిరి చికిరి’ పాట సెన్సేషనల్ హిట్స్ కావడం వల్ల అంచనాలు అమాంతం పెరగడంతో నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించింది. అలాగే స్పిరిట్ సినిమాకు దర్శకుడు సందీప్ వంగా రూపొందించిన ‘యానిమల్’ గతంలో సాధించిన సంచలన విజయం కూడా భారీ రేటుకు కారణమైంది.
55
భారీ రేటుకు అమ్ముడుపోయిన సినిమాలు?
ఇక ఇప్పటి వరకు ఓటీటీ రైట్స్ విషయంలో భారీ రేటుకు అమ్ముడుపోయిన సినిమాల విషయానికి వస్తే.. మొదటి ప్లేస్ లో ప్రభాస్ కల్కీ నిలిచింది. ఈసినిమాను అమెజాన్ ప్రైమ్ 375 కోట్లకు కొనుగోలు చేసింది. ఆతరువాతి స్థానంలో యష్ నటించిన KGF చాప్టర్ 2 ఉంది. ఈసినిమాను 320 కోట్లకు కొనగా.. రాజమౌళి బ్లాక్‌బస్టర్ RRR మాత్రం 300 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. RRR హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు ట్రెండింగ్‌లో నిలిచి ఆకట్టుకుంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ను చూసిన నెట్‌ఫ్లిక్స్ వారణాసి సినిమా విషయంలో ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈసినిమాపై అంచనాలు పెరిగే కొద్ది.. డిమాండ్ పెరుగుతుంది. జక్కన్న అనుకున్నట్టే.. 1000 కోట్లకు డీల్ కుదిరే అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో పాటు, మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.