
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో నువ్వు ఇక మారవా.. అని జ్యోత్స్నను అంటుంది పారు. నేనేం చేశాను అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏం చేశావో.. నాకు తెలుసు. అంత అమాయకంగా అడగకు అంటుంది పారు. ఏం చేశానో చెప్పు అంటుంది జ్యోత్స్న.
నువ్వు దీపకు కాలు అడ్డం పెట్టడం నేను చూశాను. కార్తీక్ గాడు కూడా చూశాడు. వాడు నీకు మాటలతోనే చెమటలు కూడా పట్టించాడు అంటుంది పారు. బావ నాకు వార్నింగ్ ఇవ్వడం నువ్వు చూశావా అంటుంది జ్యోత్స్న. చూశాను అన్ని దరిద్రాలు నా కంట్లోనే పడతాయి అంటుంది పారు.
నువ్వు దీప కడుపులో బిడ్డను ఏమైనా చేయాలని చూస్తే.. వాడు ఎంతకు తెగిస్తాడో ఊహించలేము. దీప దాని బ్రతుకు అది బ్రతుకుతోంది. వదిలేయ్ అంటుంది పారు. నువ్వు ఇక్కడ ఉండకు జ్యోత్స్న. కెనడాలో నీ ఫ్రెండ్ ఉంది అన్నావు కదా.. కొద్ది రోజులు అక్కడికి వెళ్లు. అంతా బాగుందని అనిపించినప్పుడు నేను ఫోన్ చేస్తా.. అప్పుడు రా అంటుంది పారు.
ఇక్కడ అందరు సంతోషంగా ఉంటే.. నేను మాత్రం అన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లి బ్రతకాలా? నేను వెళ్లను గ్రానీ.. అలాగే దీప కడుపులో బావ వారసత్వం లేకుండా చేస్తాను. దీపను నాశనం చేస్తాను అంటుంది జ్యోత్స్న. ఇది మారదు అని మనసులో అనుకుంటుంది పారు.
మరోవైపు అలిగిన దీపను.. బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. నువ్వు కూడా నాపై కోపంగా ఉంటే ఎలా? అర్థం చేసుకోవాలి కదా అంటాడు కార్తీక్. నేను ఎవ్వరిపై కోపంగా లేను అంటుంది దీప. అత్త, కోడళ్లు మాట అనుకునేటప్పుడు ఎవ్వరినో ఒకరిని కంట్రోల్ చేయకపోతే ఎలా? అంటాడు కార్తీక్. అత్త, కోడళ్లు ఇద్దరూ బాగానే ఉన్నారు కానీ.. మధ్యలో శౌర్య బాధపడింది అంటాడు కార్తీక్. దానికి అప్పుడప్పుడు పడాలి అంటుంది దీప.
రెండు రోజులు వీటన్నింటికి దూరంగా ఎక్కడికైనా వెళ్దామా అంటాడు కార్తీక్. వద్దు... ఇక్కడ ఇష్టం లేకుంటే కదా ఎక్కడికైనా వెళ్లాలి అంటుంది దీప. సరే శౌర్య ఇంకా రాలేదు. నేను వెళ్లి తీసుకువస్తాను అంటాడు కార్తీక్. అది వాళ్ల నాన్నమ్మతో అక్కడే పడుకుంటుంది అంటుంది దీప. లేదు ఇక్కడికే వస్తుంది చూడు అంటాడు కార్తీక్.
కాంచన గదిలో హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది శౌర్య. ఇందాక అరిచినందుకు సారీ అని చెప్తుంది కాంచన. నీ సారీ నాకు వద్దు అంటుంది శౌర్య. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది కాంచన. నేను అమ్మ దగ్గరికి వెళ్లి పడుకుంటాను అంటుంది శౌర్య. వద్దు ఇక్కడే పడుకో అంటుంది కాంచన.
అమ్మను నాన్న దగ్గర వదిలెయ్. నువ్వు నా దగ్గర పడుకో.. పిల్లలు నానమ్మతోనే పడుకోవాలి అంటుంది కాంచన. నాన్న దగ్గర అమ్మ ఉన్నప్పుడు, నువ్వు తాత దగ్గర ఉండాలి కదా నానమ్మ. ఎందుకు ఉండట్లేదు అంటుంది శౌర్య. అలాంటివన్నీ నువ్వు అడగకూడదు. చెప్పిన నీకు అర్థం కాదు అంటుంది కాంచన. కోపంగా వెళ్లిపోతుంది శౌర్య.
కాంచనకు ఫోన్ చేస్తుంది పారు. కుశల ప్రశ్నలు అడిగి.. శౌర్య గురించి నెగిటివ్ గా మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది పారు. శౌర్య నీ కొడుకు రక్తం కాదు కాబట్టి తనని ఏదో ఒక అనాథ హాస్టల్లో వేయండి అంటుంది పారు. పిన్ని అని గట్టిగా అరుస్తుంది కాంచన. నా కొడుకు తనని సొంత కూతురిలాగే చూసుకుంటున్నాడు. మాకు ఆ తేడా లేదు అంటుంది కాంచన.
ఇప్పుడు లేదు. కానీ కార్తీక్ కి బిడ్డ పుడితే ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడు నువ్వే శౌర్యను పక్కన పెడతావు. పెట్టాలని అనిపిస్తుంది కూడా అంటుంది పారు. ఈ విషయం చెప్పడానికే ఇంత రాత్రి ఫోన్ చేశావా అంటుంది కాంచన. నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నువ్వే బాగా ఆలోచించు అని ఫోన్ కట్ చేస్తుంది పారు.
నా మాటలు నిన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవు కాంచన. నా మనుమరాలు దీప కడుపులో బిడ్డను దూరం చేయాలి అనుకుంటోంది. నేను కంటి ముందు ఉన్న బిడ్డను దూరం చేయాలి అనుకుంటున్నాను. అంటే నా మనుమరాలికి నేను ఎంతో కొంత సాయం చేసినట్టే కదా అని అనుకుంటుంది పారు.
నిద్రలో అమ్మా అంటూ ఏడుస్తూ లేస్తుంది దీప. ఏమైంది దీప అంటూ లేస్తాడు కార్తీక్. శౌర్య కడుపులో తన్నింది బావ. నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను అని ఏడుస్తుంది దీప. ఏమైందమ్మా అని లేస్తుంది శౌర్య. ఏం కాలేదు నువ్వు పడుకో అంటాడు కార్తీక్. నొప్పితో విలవిల్లాడుతుంది దీప.
కాంచన వచ్చి దీపకు ఏమైంది? ఎందుకు అంత పెద్దగా అరిచింది? శౌర్య ఏమైనా కాలుతో తన్నిందా అంటుంది. నొప్పిని ఆపుకుంటూనే దీప. లేదు అత్తయ్య.. ఇప్పుడు తగ్గిపోయింది అంటుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లు కార్తీక్ అంటుంది కాంచన. వద్దులే అత్తయ్య తగ్గిపోయింది అంటుంది దీప. అక్కడినుంచి వెళ్లిపోతుంది కాంచన.
హాస్పిటల్ కి వెళ్దాం పద దీప అంటాడు కార్తీక్. వద్దు బావ తగ్గిపోతుందిలే అంటుంది దీప. దానికి నిద్రలో కాలు వేసే అలవాటు ఉంది. మధ్యలో కాకుండా అటువైపు పడుకోమంటే సరిపోయేది అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.