
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో వల్లి గెంతుకుంటూ ఆనందంగా పాటలు పాడుతూ వంటింట్లోకి వస్తుంది. అంతవరకు కాలు నొప్పి అని డ్రామా ఆడిన వెళ్లి డ్యాన్స్ లేస్తుంది. వంటింట్లోకి వచ్చి ఎవరూ లేరు అనుకోని తనను తానే పొగిడేసుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా వెనక్కి తిరిగేసరికి అక్కడ ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ ‘ఇంతవరకు కాలు నొప్పి అని డ్రామాలాడావు కదా.. ఇప్పుడు ఏమైందని అడుగుతుంది’. దానికి వల్లి మందు రాశాను కదా తగ్గిపోయిందని ఏదో కథలు చెప్పేస్తుంది.
కానీ ప్రేమ ‘నిన్ను చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది. బావగారు వచ్చినప్పటి నుంచి నువ్వు ఏదో ఇంటికి వచ్చినప్పటి నుంచి డ్రామాలు ఆడుతున్నావు’ అని అంటుంది. దానికి వల్లి మరింత డ్రామా మొదలుపెడుతుంది. తాను ఎంతో మారిపోయానని శాంతి కపోతం అయిపోయానని, అలాంటి నన్ను నానా మాటలు అంటే దేవుడు క్షమించడని ఏదేదో మాట్లాడుతుంది వల్లీ. అవన్నీ విన్న ప్రేమకు అసహనం పెరిగిపోతుంది. నువ్వు శాంతికపోతానివి కాదు పెద్ద గుంటనక్కవి, తోడేలు అని తిడుతుంది ప్రేమ. నగల విషయాన్ని మళ్ళీ ఎత్తి ప్రేమ వల్లిని బాగా తిడుతుంది. ఇప్పటికీ నువ్వు ఇంకా కుట్రలు చేస్తున్నావని వల్లిని అంటుంది ప్రేమ. ప్రేమ నీకు ఈరోజు కాళరాత్రి చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ప్రేమ.
ఇక్కడి నుంచి సీన్ తిరుపతి దగ్గరికి మారుతుంది. తిరుపతి మందు బాటిల్ తెచ్చుకొని ఆనందంతో తన మేనళ్లుల్లను పిలుస్తాడు. తిరుపతి మందు సెటప్ పెట్టి అల్లుళ్ళను కూర్చోమని చెబుతాడు. కానీ రామరాజు ఎక్కడ చూస్తారో అని కొడుకులు చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ తిరుపతి మాట్లాడుతూ మీ అమ్మానాన్న సెకండ్ షో సినిమాకు వెళ్లారు ఈలోపు మందు పార్టీ చేసుకుని, తర్వాత అన్ని సర్దేయొచ్చని చెబుతాడు తిరుపతి. ఈరోజు తనకు మరపురాని రోజని అందుకే పార్టీ ఇస్తున్నారని చెబుతాడు. తిరుపతి తాను ప్రేమలో పడ్డానని కేవలం అమ్మాయిని నడుమును చూసి ప్రేమించానని తన స్వప్న సుందరి గురించి చెబుతాడు తిరుపతి. ఒక అమ్మాయి తనకు కనిపించకుండానే తనను ప్రేమిస్తోందని చెబుతాడు. కాసేపు సాగర్, ధీరజ్.. తిరుపతిని ఏడిపిస్తారు. కానీ పెద్దోడు మాత్రం చాలా డల్ గా ఉంటాడు. ధీరజ్, సాగర్ పదేపదే ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నా కూడా పెద్దోడు ఏమీ చెప్పడు. చివరికి అందరూ మందు పార్టీ చేసుకుంటారు.
ఇక వల్లి ప్రేమ ఏం చేస్తుందోనన్న భయంతో కంగారు పడిపోతూ పిల్లిలాగా ఇటువంటి తిరుగుతూ ఉంటుంది. ఇక మందు పార్టీ చేసుకున్నాక మిగిలిపోయిన మందు బాటిళ్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు తిరుపతి బ్యాచ్. ఆ మిగిలిపోయిన మందును వల్లి చూస్తుంది. అందులో ఒక బాటిల్ తీసుకొని గడాగడా తాగేస్తుంది. మందు కిక్కు వల్లికి బాగా ఎక్కేసి మత్తులో నచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడుతుంది. ప్రేమను వెతుక్కుంటూ వస్తుంది. ‘ఒసేయ్ ప్రేమా’ అనుకుంటూ ఒక చేతిలో మందు బాటిల్.. మరో చేతిలో కొడవలి పట్టుకుని వస్తుంది. ప్రేమ మీద తనకు నచ్చిన రీతిలో రెచ్చిపోతుంది. ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. ఇక వల్లి కత్తి పట్టుకొని నిన్ను వేసేస్తా వేసేస్తా అంటూ ప్రేమను భయపడుతుంది. ఈ లోపు అక్కడికి తిరుపతి వచ్చి నా కూల్ డ్రింక్ బాటిల్ కనిపించలేదు.. కనిపించిందా? అని అడుగుతాడు.
అప్పుడు వల్లి ‘మందు బాటిల్ పట్టుకొని కూల్ డ్రింక్ బాటిల్ అంటావ్ ఏంటి’ అని అడుగుతుంది. అప్పుడు తిరుపతి ఇది కూల్ డ్రింక్ బాటిలే మందు బాటిల్ కాదు అని చెబుతాడు. దీంతో వల్లి ఒక్కసారిగా అది మందు కాదని తెలిసి తన నిజరూపంలోకి వచ్చేస్తుంది. భయంతో వణికిపోవడం మొదలు పడుతుంది. అది మందనుకొని రెచ్చిపోయానే అని వల్లి భయపడడం మొదలుపెడుతుంది. తర్వాత ప్రేమ దగ్గర చేతులు కట్టి నమస్కారం చేసి కొత్త నటన మొదలు పెడుతుంది. ఇందాక నేను మాట్లాడిన మాటలన్నీ మందు వల్ల వచ్చినవే తప్ప మనసులోంచి వచ్చినవి కాదు అని ప్రేమకు చెబుతుంది వల్లి.
తాను తిట్టిన తిట్లను మనసులో పెట్టుకోవద్దని వల్లి చెబుతుంది. కానీ ప్రేమ మాత్రం ఊరుకోదు. పనిష్మెంట్ ఇవ్వకుండా వదలను అని ఒక మోపెడు బట్టలు తెచ్చి వల్లికిచ్చి ఇప్పుడే ఉతికి ఆరవేయమని చెబుతుంది ప్రేమ. ఆ రాత్రి వల్లి బట్టలు ఉతక్క తప్పలేదు. ఇంత చలిలో బట్టలు ఉతకడం కష్టమని ఏడుస్తూనే ఆ పని మొదలు పెడుతుంది వల్లి. సాగర్ తాగేసి గదిలోకి వస్తాడు. నర్మద అప్పుడే స్నానం చేసి తలచుకుంటూ ఉంటుంది. మల్లెపూలు పట్టుకొని నర్మద దగ్గరికి వెళ్తాడు సాగర్. అయితే సాగర్ తూగుతూ ఉండడం చూసి నర్మదకు సందేహం వస్తుంది. సరిగ్గా ఒకసారి నిలబడు అని చెబుతుంది. కానీ సాగర్ నిలబడలేక తూగుతూ ఉంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.