సీజన్ 9లో భరణి అన్ అఫీషియల్ విన్నర్, నాగబాబు రెకమండేషన్ ఇలా వర్కౌట్ అయిందా.. మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్

Published : Dec 15, 2025, 08:36 AM IST

బిగ్ బాస్ తెలుగు 9లో భరణి అన్ అఫీషియల్ విజేత అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం భరణి అందుకున్న రెమ్యునరేషన్. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
టాప్ 5లో భరణికి నో ఛాన్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో చివరి దశకు చేరుకుంది. టాప్ 5 ఎవరో కూడా ప్రకటించేశారు. ముందు నుంచి వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లుగానే టాప్ 5 లిస్ట్ ఉంది. కాకపోతే భరణి టాప్ 5 లో ఉంటారు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇదొక్కటే చిన్న సర్ప్రైజ్. తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డిమాన్ పవన్, సంజన టాప్ 5 గా నిలిచారు. తనూజ, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్ళు టాప్ 5 లో ఉంటారని ముందు నుంచి ఊహించినదే.

25
భరణి ఎలిమినేషన్

కాగా సండే ఎపిసోడ్ లో అనూహ్యంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. భరణి ఈ సీజన్ లో ఎలిమినేట్ కావడం ఇది రెండవసారి. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రధాన కంటెస్టెంట్స్ లలో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన భరణి 6 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబుకు భరణి బాగా క్లోజ్. దీనితో నాగబాబు రెకమండేషన్ తో ఒక పథకం ప్రకారం భరణిని మళ్ళీ హౌస్ లోకి తీసుకువచ్చారు. ఈ ప్రాసెస్ లో దమ్ము శ్రీజని బలిపశువుని చేశారు.

35
భరణికి నాగబాబు సపోర్ట్

అలా రెండవసారి హౌస్ లోకి వచ్చిన భరణి గ్రాండ్ ఫినాలే వీక్ కి ముందు ఎలిమినేట్ కావడం విశేషం. భరణి తెలుగు బుల్లితెరపై డిమాండ్ ఉన్న సీనియర్ యాక్టర్. పైగా నాగబాబు సపోర్ట్ ఉంది. దీనితో భరణికి బిగ్ బాస్ నిర్వాహకులు మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ ఇచ్చారు. సీజన్ 9లోనే భరణికి హైయెస్ట్ రెమ్యునరేషన్ అందింది. భరణికి వారానికి 3.5 లక్షలు పారితోషికం ముట్టింది.

45
బిగ్ బాస్ సీజన్ 9 అన్ అఫీషియల్ విన్నర్

హౌస్ లో భరణి మొత్తం దాదాపు 13 వారాలు ఉన్నారు. ఈ లెక్కన భారానికి రూ. 45 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ విజేతకి 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ 50 లక్షలలో చాలా లెక్కలు ఉంటాయి. కానీ భరణి కేవలం రెమ్యునరేషన్ రూపంలోనే 45 లక్షలు అందుకోవడంతో.. బిగ్ బాస్ సీజన్ 9కి అతడు అన్ అఫీషియల్ విన్నర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు రెకమండేషన్ భరణికి బాగా ఉపయోగపడింది అని అంటున్నారు.

55
బంధాలకు కేరాఫ్ అడ్రెస్

భరణి బిగ్ బాస్ తెలుగు 9లో బంధాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. తనూజ భరణిని తండ్రిగా భావించింది. దీనితో ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. భరణి ఎలిమినేట్ అయ్యాక తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. భరణికి దివ్యతో కూడా బాండింగ్ ఏర్పడింది. మొత్తంగా భరణి బిగ్ బాస్ హౌస్ లో తన స్థాయిలో అలరించడానికి ప్రయత్నించారు.

Read more Photos on
click me!

Recommended Stories