Lavanya: పిల్లలు వద్దు అనుకున్నా, మరుసటి రోజే ప్రెగ్నెంట్ అయ్యా.. ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ

Published : Jul 11, 2026, 06:10 PM IST

Lavanya: ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ ఫేమ్ లావణ్య భరద్వాజ్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే..  ఏడాది వరకు పిల్లలు వద్దు అనుకున్నానని.. ఆ మరుసటి రోజే ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది అని లావణ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

PREV
13
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రేమ..

స్టార్ మాలో  ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లో ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ మొదటి వరసలో ఉంటుంది. ఈ సీరియల్ కి మంచి క్రేజ్ ఉంది.  ముఖ్యంగా… ఈ సీరియల్ లో మొన్నటి వరకు ప్రేమ పాత్రలో నటించిన లావణ్య కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ కి ప్రధాన ఆకర్షణ లావణ్య. అయితే.. సడెన్ గా లావణ్య ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం తో ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు. అయితే.. తాను ప్రెగ్నెంట్ అవుతున్నానని.. అందుకే సీరియల్ నుంచి తప్పుకున్నాను అని తర్వాత ప్రకటించింది. అయితే.. తాను కనీసం సంవత్సరం వరకు పిల్లలు వద్దు అనుకున్నాను అని.. కానీ ఇలా జరిగిపోయింది అంటూ తన ప్రెగ్నెన్సీ స్టోరీని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

23
అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నా...

ఇటీవల ఓ కన్నడ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నారు. ‘ ముందు రోజు రాత్రి శశి( భర్త) తో , అత్తమామలతో మాట్లాడాను. ఏడాది వరకు పిల్లల గురించి నన్ను అడగొద్దు. కెరీర్ పై దృష్టి పెట్టాలి.  కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు చేయాలి. దయచేసి బలవంత పెట్టొద్దు’ అని చెప్పాను అని లావణ్య అన్నారు. అయితే.. మరుసటి రోజు అనుమానం వచ్చి ప్రెగ్నెన్సీ కిట్‌తో టెస్ట్ చేసుకుంటే డబుల్ లైన్ వచ్చింది. ఏడవాలో, నవ్వాలో అర్థం కాలేదు. తల్లిని అవుతున్నానన్న సంతోషం ఒకవైపు, నిన్నే కదా పిల్లలు వద్దన్నది అని మరోవైపు ఆలోచన. ఏం చేయాలో తెలియక గట్టిగా ఏడ్చేశాను అని లావణ్య ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు.

33
శశికి ఫోన్ చేసి ఏడ్చేశా...

'ఆ టైమ్‌లో శశి జిమ్‌కి వెళ్లాడు. నేను గట్టిగా ఏడుస్తూనే అతనికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రా అన్నాను. విషయం చెప్పలేదు. అతను చాలా కంగారుపడి ఏమైందని అడిగాడు. డబుల్ టిక్ వచ్చింది అని మాత్రమే చెప్పాను. అతనికి ఏమైందో, ఏ టిక్ వచ్చిందో అర్థం కాలేదు. నేను ఏడుస్తుండటం చూసి కంగారుపడ్డాడు. త్వరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేశాను' అని లావణ్య అన్నారు.

ఈ విషయంపై శశి హెగ్డే మాట్లాడుతూ.. 'మొదట నాకు భయమేసింది. ఆ తర్వాత, ఓహ్.. బహుశా ఇదే విషయమేమో అనిపించింది. అయినా ఏం జరిగిందో స్పష్టంగా తెలియలేదు. చేతులు వణికాయి. బహుశా బేబీ విషయమే అయ్యుంటుందని చాలా సంతోషంగా ఇంటికి వచ్చాను. విషయం తెలిసి చాలా ఆనందపడ్డాను' అని చెప్పారు.

'నీకు బేబీ ఓకేనా, నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా అని శశి నన్ను అడిగాడు. నేను అన్నింటికీ ఓకే చెప్పాక తర్వాతి నిర్ణయం తీసుకున్నాం. అయినా, పిల్లలు వద్దన్న మరుసటి రోజే ఇలా జరగడం గుర్తుచేసుకుంటే నవ్వొస్తుంది' అని ఈ జంట చెప్పింది.

Read more Photos on
click me!

Recommended Stories