నా బాడీలో మరే పార్ట్ లేదా?.. నడుమునే ఎందుకు చూపిస్తున్నారు.. డైరెక్టర్స్ కి ఇలియానా వార్నింగ్‌..

Published : Jun 21, 2024, 04:55 PM IST

ఇలియానా సన్నని నడుము ఎంత పాపులరో తెలిసిందే. తన నడుముతోనే కుర్రకారుని ఊపేసింది. అయితే ఆ నడుము విషయంలో ఆమెచాలా ఇబ్బంది పడిందట.   

PREV
15
నా బాడీలో మరే పార్ట్ లేదా?.. నడుమునే ఎందుకు చూపిస్తున్నారు.. డైరెక్టర్స్ కి ఇలియానా వార్నింగ్‌..

గోవా బ్యూటీ ఇలియానా తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. దాదాపు ఆమె పదిహేనేళ్లకుపైగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించింది. గత కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరమయ్యింది. రెండుసార్లు ప్రేమ విఫలం అనంతరం ఇటీవల తల్లి అయ్యింది ఇలియానా. ఆ తర్వాత తన బిడ్డకి తండ్రిని పరిచయం చేసింది. కానీ తాను మళ్లీ ఒంటరైనట్టు వెల్లడించింది. 

25

ఇదిలా ఉంటే హీరోయిన్‌గా రాణించినప్పుడు మేకర్స్ ఎక్కువగా ఇలియానా నడుముపైన ఫోకస్‌ పెట్టేవారు. `దేవదాసు`, `పోకిరి`నుంచి `దేవుడు చేసిన మనుషులు`, `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` వరకు దాదాపు అన్ని సినిమాల్లోనూ ఇలియానా నడుముని ప్రత్యేకంగా చూపించని సినిమా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతగా ఆమెని వెండితెరపై ఆవిష్కరించారు. అంతేకాదు అప్పట్లో ఇలియానా నడుముపై పెద్ద ఎత్తున చర్చనడిచింది. ఆమె సన్నని నడుముని వర్ణిస్తూ పాటలు వచ్చాయి. కవితలు వచ్చాయి. 
 

35

ఇలా ప్రతి సినిమాల్లో ఎక్కువా తన నడుము పార్ట్ నే ఫోకస్‌ చేయడం పట్ల ఇలియానా అభ్యంతరం తెలిపింది. తాను చాలా బాధపడిందట. ఏంటీ? ప్రతి ఒక్కరు నా నడుమునే చూపిస్తున్నారు, నాలో ఇంకేం లేవన్నట్టుగా దాన్నే ఫోకస్‌ చేస్తున్నారని బాధ పడేదట. చాలా సార్లు తెరపై అలా చూసినప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించేదని తెలిపింది ఇలియానా. 
 

45

దీంతో దర్శకులకు వార్నింగ్‌ కూడా ఇచ్చినట్టు తెలిపింది. ప్రతి సారి అలా చూపించవద్దు అని తాను గట్టిగానే చెప్పిందట. మరోవైపు కొన్నిసార్లు తనకు కూడా తన నడుముని చూసుకుంటే బాగుందనిపిస్తుంది. సన్నగా చాలా బాగుంది కదా అనే ఫీలింగ్‌ కలుగుతుందని, కానీ చాలా రాంగ్ వేలో చూపించినప్పుడే ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది ఇలియానా. 

55

ఇక తాను ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందట. వంటలు చేయడం, డిషెస్‌ క్లీన్‌ చేయడం, ఇళ్లు ఊడ్చటం చేస్తుందట. ఇదే బాడీకి చాలా ఎక్ససర్‌సైజ్‌లు అవుతుందని, చాలా మంది దీన్ని ఫాలో అయితే బాగుంటుందని, బాడీ సన్నగా ఉంటుందని చెప్పింది ఇలియానా. సాక్షితో గతంలో అనసూయతో చేసిన చిట్‌ చాట్‌లోఈ విషయాన్ని వెల్లడించింది ఇలియానా. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories