చిరంజీవి సినిమా చూడని జాన్వీ కపూర్.. శ్రీదేవి ఏంచేసిందంటే, తెలిస్తే నిజంగా షాక్

Published : Jun 21, 2024, 03:32 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ టాప్ గ్లామర్ బ్యూటీగా యువతలో క్రేజ్ తెచ్చుకుంది. 

PREV
16
చిరంజీవి సినిమా చూడని జాన్వీ కపూర్.. శ్రీదేవి ఏంచేసిందంటే, తెలిస్తే నిజంగా షాక్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ టాప్ గ్లామర్ బ్యూటీగా యువతలో క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో కూడా పాగా వేయడం మొదలు పెట్టింది. ఆల్రెడీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. 

 

26

ఈ చిత్రం తర్వాత జాన్వీ.. రాంచరణ్ కి జోడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతోంది. రామ్ చరణ్ తో సినిమా అంటే మెగా అభిమానులు తప్పకుండా జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కోరుకుంటారు. కానీ అది జరగలేదు. ఓ ఇంటర్వ్యూలో దీని దీని గురించి ప్రశ్నిస్తే జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

36

చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఆ మూవీలో మా అమ్మ ఏంజెల్ లాగా నటించింది కదా.. నేను ఇంతవరకు ఆ చిత్రం చూడలేదు అని జాన్వీ కపూర్ షాకిచ్చింది. జగదేక వీరుడు చూడకుండానే రాంచరణ్ తో రొమాన్స్ కి రెడీ అయిపోయింది. 

 

46
RC 16 Launching

చిన్నప్పుడే ఆ సినిమా చూడాలనుకున్నా.. ఆ టైంలో ముంబైలో డివిడిలు దొరకలేదు. దీనితో మా అమ్మ ప్రతి రోజు ఆ మూవీ కథ కొంచెం కొంచెం చెప్పేది. ప్రతి రోజు ఆ కథ వింటూ నిద్రపోయేదాన్ని అని జాన్వీ కపూర్ తెలిపింది. ఆ కథ నాకు బాగా తెలుసు కానీ సినిమా ఇంతవరకు చూడలేదు అని పేర్కొంది. 

 

56
Janhvi Kapoor

టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు రాంచరణ్ కి హీరోయిన్ మిమ్మల్ని పెట్టి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని యాంకర్ చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. 

 

66

జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కాకపోయినా.. రాంచరణ్, జాన్వీ కాంబినేషన్ కుదరడంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మరి బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories