ప్రెగ్నెన్సీ కన్ఫమ్‌ అయిన మొదటి మధుర క్షణాలను పంచుకున్న ఇలియానా.. శారీలో ఫోటో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్..

Published : Nov 27, 2023, 07:04 AM ISTUpdated : Nov 27, 2023, 07:06 AM IST

గోవా బ్యూటీ ఇలియానా.. తన సన్నని నడుముతో తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేసింది. ఆమె హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ని అనుభవించింది. తిరుగులేని కథానాయికగా రాణించింది. ఓరకంగా ఇలియానా తన నడుముతో ఇండస్ట్రీని శాషించిందని చెప్పొచ్చు. అప్పట్లో ఇలియానా నడుముకి అంతటి క్రేజ్‌ ఉంది.   

PREV
15
ప్రెగ్నెన్సీ కన్ఫమ్‌ అయిన మొదటి మధుర క్షణాలను పంచుకున్న ఇలియానా.. శారీలో ఫోటో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్..

ఏ హీరోయిన్‌కి అయినా కొంత సమయం తర్వాత డౌన్‌ ఫాల్‌స్టార్ట్ అవుతుంది. వన్నే తగ్గడం సహజమే.కొత్త హీరోయిన్లు వచ్చే కొద్ది పాత వారికి డిమాండ్‌ తగ్గుతుంది. అలానే ఇలియానా క్రేజ్ కూడా తగ్గిపోయింది. పైగా ఆమె ప్రేమలో పడి సినిమాలను లైట్‌ తీసుకోవడం, కొన్ని పరాజయాలు రావడం, చిన్న సినిమాలు చేయడంతో ఈ బ్యూటీ క్రేజ్‌ కూడా పడిపోయింది. 
 

25

దీనికితోడు లవ్‌ లో ఫెయిల్యూర్‌ కావడం, కొంత బ్రేక్‌ తీసుకోవడంతో ఆమెని పట్టించుకోవడం తగ్గించారు. చివర్లో ఆఫర్ల విషయంలో, సక్సెస్‌ విసయంలో ఆమె కొంత ఇబ్బంది పడింది. ఇంతలో ఇలియానా శుభ వార్త చెప్పింది. తాను ప్రెగ్నెంట్‌ అని ప్రకటించింది. అందరు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఒక్కటి మాత్రం వారిని సందేహిస్తుంది. 
 

35

ఇలియానా పెళ్లి చేసుకోకుండా, భర్త లేకుండానే ప్రెగ్నెంట్ ఎలా అయ్యిందని అంతా అనుమానించారు. ఇలియానా ప్రెగ్నెంట్‌ పై ఇది పెద్ద చర్చ నడిచింది. కానీ ఆమె వీటిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ మధ్య పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత తన కొడుక్కి తండ్రిని పరిచయం చేసింది. 
 

45
ileana

ఇటీవల సోషల్‌ మీడియాలో చాట్‌ చేస్తూ తన బిడ్డకి తండ్రి ఫోటోని పంచుకుంది. తాను సింగిల్‌ మదర్‌ కాదని ఆమె వెల్లడించింది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టింది. తన ప్రెగ్నెంట్‌ సమయంలోని మొదటి అనుభవాన్ని షేర్‌ చేసుకుంది. ఈ మేరకు ఆమె చీరలో మిర్రర్‌ ముందు చూసుకుంటున్న ఓ ఫోటోని పంచుకుంది. 

55

తాను ప్రెగ్నెంట్‌ అని కన్ఫమ్‌ అయినప్పుడు తన ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ని, ఆ అనుభూతిని ఆమె వివరించే ప్రయత్నం చేసింది. ఇందులో ఇలియానా చెబుతూ, కరెక్ట్ గా ఏడాది క్రితం ఇదే రోజు. నా చిన్నారి నా లోపల చిన్న పరిమాణంలో పెరగడం ప్రారంభించాడు. దీంతో నాలో ఉన్న భావాలు, ఉత్సాహం, నరాలు అతన్ని రక్షించడానికి, అతన్ని బాగా చూసుకోవాలనే విషయాన్ని గుర్తించడం నాకు ఇంకా గుర్తుంది. ఏడాది తర్వాత అను నా చేతుల్లో నిద్ర పోవడం చూడటం చాలా అద్భుతంగా ఉంది`అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది ఇలియానా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
Read more: అల్లు అర్జున్‌పై ప్రయోగానికి సిద్ధపడుతున్న త్రివిక్రమ్‌.. ఇద్దరికీ రిస్కే?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories