'భారతీయుడు-2 ' డిజాస్టర్... చరణ్ కు కలిసొచ్చింది,ఎలాగంటే...

First Published | Aug 10, 2024, 10:03 AM IST

కమల్‌హాసన్‌- ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు-2’. జులై 12న ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ..

Game Changer


శంకర్ ఇప్పుడు మారిన దర్శకుడుగా కనిపిస్తున్నాడంటున్నారు ఆయనతో జర్ని చేస్తున్నవాళ్లు. పైకి ఆయన చెప్పకపోయినా ఇండియన్ 2 సినిమా రిజల్ట్ ఆయనపై బాగా ఇంపాక్ట్ చూపిందంటున్నారు. దాంతో ఆలోచనలో  పడి ఎక్కడ సమస్య వచ్చిందా అని తన టీమ్ తో చర్చించి..రెండు సినిమాలు ఒకే సారి చేయటంతో కాన్సర్టేట్ చేయలేకపోయానని అర్దం చేసుకున్నారని..దాంతో తన వర్కింగ్ స్టైల్ ని పూర్తిగా మార్చుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


 కమల్‌హాసన్‌- ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు-2’. జులై 12న ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్  తెచ్చుకున్న సంగతి తెలిసిందే.   ఈక్రమంలో మౌత్ టాక్ వచ్చేక థియేటర్ కు వెళ్లి చూద్దామనుకున్న వాళ్లు సైతం ఆగిపోయారు. ఎలాగో కొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ నుంచి ఓటిటికు షిప్ట్ అయ్యిపోతుంది కదా అక్కడ చూద్దామని  స్ట్రీమింగ్ కోసం మాత్రం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.  అదీ మొదలైపోయింది. ఇప్పుడు ఓటిటిలో చూసి మరీ జనం విమర్శలు చేస్తున్నారు.
 



వాస్తవానికి శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ని పూర్తి చేసే హడావిడిలా ఉన్నారు. అయితే అదే సమయంలో భారతీయుడు 3 కూడా పూర్తి చేద్దామనుకున్నారు. అయితే భారతీయుడు 2 కొట్టన దెబ్బతో పూర్తిగా ప్లాన్స్ ఛేంజ్ చేసుకున్నారు. గేమ్ ఛేంజర్ పూర్తయ్యేదాకా చివరకు భారతీయుడు 3 వైపు చూడకూడదనుకుంటున్నారు. ఇండియన్ 2 రిలీజ్ కు ముందు ఓ ప్రక్కన గేమ్ ఛేంజరత్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, మరో ప్రక్కన భారతీయుడు 3 షూటింగ్ లాగేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ పైనే ఆయన పూర్తి దృష్టి పెట్టబోతున్నారు.
 


ఇప్పుడు ఇండియన్ 3 పూర్తి చేసినా బిజినెస్ కాదు. ఎవరూ ఆ సినిమా రైట్స్ కొనుక్కోరు. అదే గేమ్ ఛేంజర్ హిట్ చేస్తే అందరి దృష్టీ మళ్లీ శంకర్ పై పడుతుంది. అప్పుడు ఇండియన్ 3 బిజినెస్ ఈజీగా అయ్యిపోతుంది. అదే విషయం లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిల్మ్స్ వారికి చెప్పి ఒప్పించారట. వాళ్లు కూడా ఈ ప్లాన్ కు ఓకే చేసారు. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ పైనే దృష్టి పెట్టి హ్యూజ్ సక్సెస్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది చెర్రీ ఫ్యాన్స్ ఆనందం కలిగించే వార్తే,. 
 


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer) పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.  పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  
 

Game Changer


గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ముఖ్యంగా కథ బిల్డ్ అయ్యేది  తండ్రి పాత్ర నుంచే.  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ప్లాన్ చేసారట.  ఈ పాత్ర గెటప్, నటన  కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ పాత్రతో చరణ్ కు నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదని, ఆ స్దాయిలో పాత్రను డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. 
 

Latest Videos

click me!