ఇలియానా డేరింగ్ స్టెప్‌.. బికినీలో మేకప్‌ లేకుండా నిజమైన అందాలు చూపిస్తూ మరోసారి షాక్‌..

Published : Aug 16, 2021, 08:32 AM IST

గోవా బ్యూటీ ఇలియానా షాక్‌ల మీద షాక్‌లిస్తుంది. బికినీ పోజులో వరుసగా ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని షాక్‌తోపాటు ఫిదా చేస్తుంది. తాజాగా ఈ నాజూకు అందాల భామ మరోసారి షాకిచ్చింది. అదే సమయంలో డేరింగ్‌ స్టెప్‌ తీసుకుందీ `పోకిరి` భామ. 

PREV
112
ఇలియానా డేరింగ్ స్టెప్‌.. బికినీలో మేకప్‌ లేకుండా నిజమైన అందాలు చూపిస్తూ మరోసారి షాక్‌..

తీగలాంటి నడుమందాలతో సౌత్‌ మొత్తాన్ని ఓ ఊపు ఊపింది ఇలియానా. ఆమె మొత్తంలో బెల్లీ అందాలే ఫేమస్‌. ప్రతి సినిమాలో మేకర్స్ నడుము అందాలపైనే ఫోకస్‌ పెట్టేవారు. ఆడియెన్స్ సైతం ఇలియానా నడుమందాలను చూసేందుకే ప్రయారిటీ ఇచ్చేవారు. అయితే నటిగానూ ఇలియానా సూపర్బ్. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేయడంలో ఆమెకి ఆమే సాటి.

212

అయితే ఇటీవల సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఇలియానా మరోసారి తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా బికినీ ఫోటోలను, మేకప్‌ లేకుండా తన రియల్‌ సెక్సీ అందాలను చూపిస్తూ రెచ్చిపోతుంది. 

312

తాజాగా ఇలియానా ఎల్లో బికినీలో దిగిన సెల్ఫీ ఫోటోని పంచుకుంది. గతంలో ఓ బీచ్‌లో దిగిన పిక్ ఇది. ఇటీవల వరుసగా ఒక్కొక్కటిగా పంచుకుంటూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. మేకప్‌ లేకుండా తన నిజమైన అందాలను చూపిస్తూ దిగిన ఫోటోని మరోసారి పంచుకోగా, అది వైరల్‌గా మారింది. 
 

412

ఈ సందర్భంగా ఇలియానా చేసిన పోస్ట్ ఆమె డేరింగ్‌ స్టెప్‌కి నిదర్శనంగా నిలుస్తుంది. `ఫిల్టర్‌ లేకుండా బీచ్‌లో ఓ రోజు` అంటూ పోస్ట్ చేసింది. అంటే తన అందాలకు మేకప్‌ అద్దకుండా డైరెక్ట్ గా అభిమానులతో పంచుకుందని చెప్పొచ్చు. 

512

అంతేకాదు ఇందులో `టేక్‌ మీ బ్యాక్‌` అనే యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలియానా బోల్డ్ కామెంట్‌కి నిదర్శనంగా నిలుస్తుంది. మరోసారి తనని సినిమాల్లోకి తీసుకోండి అనే సంకేతాలను ఈ రూపంలో ఇలియానా ఇస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 

612

ఇలియానాకి ఇటీవల సరైన ఆఫర్లు లేవు. ఒకప్పుడు ఏడాదికి నాలుగైదు సినిమాలతో ఫుల్‌ బిజీగా, ఇంకా చెప్పాలంటే టాప్‌ హీరోయిన్‌గా, అందరి హీరోలకు ఇలియానే ఫస్ట్ ఆప్షన్‌గా ఉండింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 
 

712

లవ్‌ ఫెయిల్యూర్‌, డిప్రెషన్‌ వంటివి కారణంగా ఇలియానా కెరీర్‌ దెబ్బతిన్నది. క్రమంగా దాన్నుంచి బయటపడే సరికి ఆడియెన్స్, మేకర్స్ ఆమెని మర్చిపోయారు. తిరిగి రావాలని ఎంతగా ప్రయత్నం చేసినా ఒక్కసారి ఫేడౌట్‌ అయితే మళ్లీ రాణించడం, తిరిగి పుంజుకోవడం ఈ ఇండస్ట్రీలో చాలా కష్టమనే సిగ్నల్‌ అందుతూనే ఉన్నాయి.

812

ఇదే విషయాన్ని ఇలియానా చాలా సందర్బాల్లో చెప్పింది. తన ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా వాళ్లంటే స్వార్థపరులని, ఆడియెన్స్ ఒక్కసారి చూపు తిప్పితే మళ్లీ ట్రాక్‌లోకి రావడం కష్టమని వెల్లడించింది. 

912

తన బాడీ షేమింగ్‌పై కూడా ఆమె ఆవేదన చెందింది. బాడీషేమింగ్‌పై కొందరు నెటిజన్లు, ట్రోలర్స్ చేసిన కామెంట్ల విషయంలో ఆమె మండిపడింది. బరువు పెరిగినప్పుడు తాను దారుణమైన కామెంట్లని ఎదుర్కొన్నట్టు ఇటీవల పేర్కొంది ఇలియానా. 

1012

అయినా వాటిని అదిగమించి మరోసారి ఇండస్ట్రీలో నటిగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. కానీ యంగ్‌ మేకర్స్ మాత్రం ఇలియానాపై ఫోకస్‌ పెట్టడం లేదు. సీనియర్లు మాత్రమే అడపాదడపా ఒకటి రెండు ఛాన్స్‌ లిస్తున్నా.. అవి ఇలియానా స్థాయి సినిమాలు కాకపోవడం, పైగా బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ కాలేకపోవడంతో ఇలియానా కెరీర్‌ ఇంకా స్ట్రగుల్‌లోనే సాగుతుంది. 

1112

ఇలియానా చివరగా బాలీవుడ్‌లో `ది బిగ్‌ బుల్‌` చిత్రంలో నటించింది. ఇది ఆశించిన రిజల్ట్ ని అందుకోలేదు. ప్రస్తుతం `ఫెయిల్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో రణ్‌దీప్‌ హుడాతో కలిసి నటిస్తుంది.

1212

దీంతో ఇలా బికినీ ఫోటోలతో, తన రియల్‌ అందాలను చూపిస్తూ డేరింగ్‌ స్టెప్‌ వేస్తున్న ఇలియానాని అభిమానులు అభినందిస్తున్నా.. మేకర్స్ మాత్రం లైట్‌ తీసుకుంటుండటం గమనార్హం. మరి `టేక్‌ మీబ్యాక్‌` అనే ఆమె కోరికని పరిగణలోకి తీసుకుని మున్ముందైనా అవకాశాలిస్తారేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories