ఇలియానా పెద్ద మోసం, అందుకే సౌత్‌ ఇండస్ట్రీలో బ్యాన్‌.. సంచలన విషయాలు బయటపెట్టిన నిర్మాత

First Published | Oct 22, 2024, 7:11 PM IST

ఇలియానా ఓ నిర్మాతని మోసం చేసింది. సినిమా చేస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిందా? తాజాగా సీనియర్‌ నిర్మాత సంచలన విషయాలు బయటపెట్టాడు. 
 

ఇలియానా.. గోవా హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్ ని ఊపేసింది. ఆమె తెలుగు సినిమాల్లో చేసిన రచ్చ మామూలుగా కాదు. ఒక తరం కుర్రాళ్లని మైమరపింప చేసింది. ఇంకా చెప్పాలంటో ఓ రకంగా అడిక్ట్ చేసింది. `దేవదాసు`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇలియానా తొలి సినిమాతోనే ఆద్యంతం అలరించింది. తెలుగులో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక `పోకిరి` సినిమాతో ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతో బిగ్‌ బ్రేక్‌ అందుకుని సంచలనంగా మారిపోయింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

స్టార్‌ హీరోలంతా ఈ అమ్మడి కోసం క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు. దాదాపు దశాబ్దానికిపైగానే టాలీవుడ్‌ని శాషించింది ఇలియానా. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయిపోయింది. కానీ అనూహ్యంగా ఈ అమ్మడి సినిమాలు ఫెయిల్యూర్‌ అయ్యాయి. దీంతో చిన్న చిన్న సినిమాలు కూడా చేయాల్సి వచ్చింది. ఓ దశలో ఆమె సినిమాలు మానేసింది. బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. కానీ అక్కడ సక్సెస్‌ కాలేకపోయింది. 


అయితే తెలుగులోనే కాదు, సౌత్ లోనూ ఇలియానా సినిమాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమెకి అవకాశాలు తగ్గాయని అనుకున్నారు. కొత్త హీరోయిన్ల దాటికి ఆమె ఫేడౌట్‌ అయ్యిందనే ప్రచారం జరిగింది. పైగా బాలీవుడ్‌కి వెళ్లడంతో ఇక్కడి సినిమాలు చేయడం లేదనే టాక్‌ కూడా వచ్చింది. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంది. ఓ షాకింగ్‌ విషయం చోటు చేసుకుంది. ఇలియానా చేసిన పెద్ద మోసం ఉందట. లేటెస్ట్ గా సీనియర్‌ నిర్మాత కాంట్రగడ్డ ప్రసాద్‌ ఇలియానాకి సంబంధించిన షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. 
 

తమిళంలో ఓ నిర్మాత వద్ద సినిమా చేస్తానని చెప్పింది ఇలియానా 40 లక్షలు అడ్వాన్స్ తీసుకుందట. కానీ ఆ సినిమా చేయలేదు. షూటింగ్‌ కి రాకుండా ఇబ్బంది పెట్టిందట. నిర్మాత వచ్చి తమకు కంప్లెయింట్‌ (సౌత్‌ ఇండియా ఫిల్మ్ ఛాంబర్‌) ఇచ్చాడని, దీనిపై ఆమెని అడగ్గా, తాను డేట్స్ ఇచ్చానని, కానీ నిర్మాత వాడుకోలేదని చెప్పిందట. ఇలా కాదని ఆరా తీస్తే ఆ టైమ్‌లో ఆమె వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చిందని తెలిసింది. దీనిపై ఆమెని నిలదీస్తే నోరెళ్లబెట్టిందని, డబ్బులు కట్టాలని, లేదంటే సినిమా చేయాలని చెప్పామని, ఆమె కట్టలేదని తెలిపారు. దీంతో కొన్నాళ్లపాటు ఇలియానాని బ్యాన్‌ చేశామని వెల్లడించారు. ఆ సమయంలో ఒకటి రెండు సినిమాలకు కమిట్‌ అయితే కూడా ఆ నిర్మాతలతో మాట్లాడి కాన్సిల్‌ చేయించామని తెలిపారు. 
 

దీంతో `స్నేహితులు`(`3 ఇడియట్స్` రీమేక్‌) తర్వాత ఇలియానా సౌత్‌లో సినిమాలు చేయలేదని తెలిపారు. మరో నిర్మాత ఇలియానాతో సినిమా చేస్తామని వస్తే, ఈ నిర్మాతకు 40లక్షలు కట్టి ఆమెని తీసుకోండి అని చెప్పినట్టు తెలిపారు. ఇలియానా ఇలా ఇబ్బంది పెట్టిందని, ఆ నిర్మాతని మోసం చేసిందని చెప్పారు కాంట్రగడ్డ ప్రసాద్‌. ఆయన గతంలో సౌత్ ఇండియన్‌ ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ కి అధ్యక్షుడిగానూ చేశారు. 

తెలుగులో ఇలియానా 2012లో `దేవుడు చేసిన మనుషులు` సినిమా చేసింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఈ బ్యాన్‌ కారణంగానే ఆమె సినిమాలు చేయలేదని తెలుస్తుంది. 2018లో రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ`తో చేసింది. ఇది ఆడలేదు. దీంతో తెలుగులో ఆఫర్లు రాలేదు. దీంతో హిందీకే పరిమితమయ్యింది. ఇలియానా గతేడాది మైఖేల్ డోలన్‌ని వివాహం చేసుకుంది. వీరికి కొడుకు జన్మించాడు. ప్రస్తుతానికి ఇలియానా సినిమాలకు దూరంగానే ఉంటుంది. 
 

Latest Videos

click me!