Ilaiyaraaja: ఒకే వాయిద్యంతో తొమ్మిదివేల భావాలు.. ఇళయరాజా సృష్టించిన ఈ సంచలనాలు తెలుసా?

Published : Jan 23, 2026, 07:12 AM IST

Ilaiyaraaja: ఇసైజ్ఞాని ఇళయరాజా, చాలా తక్కువ వాయిద్యాలను ఉపయోగించి పూర్తి భావాలను వ్యక్తపరిచే 'మినిమలిజం' కళలో నిపుణుడు. ఆయన ఒకే వాయిద్యంతో తొమ్మిది వేల ఎమోషన్స్ ని పలికించారట. 

PREV
16
మ్యాజికల్‌ మ్యాస్ట్రో ఇళయరాజా

సంగీతం అంటే శబ్దం, నిశ్శబ్దం కలయిక. ఈ కళలో ఇళయరాజా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వందల వాయిద్యాలతో సింఫొనీ, ఒకే వాయిద్యంతో కోట్లాది హృదయాలను తాకగలరు.  ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆయన సంగీతంలో అనేక భావాలుంటాయి, అదే సమయంలో అనేక భావోద్వేగాలుంటాయి.  ఓరకంగా చెప్పాలంటే ఈ మ్యూజికల్‌ మ్యాస్ట్రో మ్యూజిక్‌ అనేక భావోద్వేగాల సమాహారం. 

26
తక్కువ వాయిద్యాలతో ఎక్కువ సంగీతం

సంగీతంలో 'మినిమలిజం'(మినిమలిస్ట్ మ్యూజిక్‌) కష్టమైన కళ. తక్కువ వాయిద్యాలతో పూర్తి పాటను ఇవ్వడం. ఇళయరాజా దీన్ని తన పాటల ద్వారా నిరూపించారు. 'ఏమి వాయించాలో కాదు, ఏమి వదిలేయాలో' అనేదే సంగీతం అని చాటారు. సంగీతవాయిద్యాలతో డిస్కోడాన్స్ ఆడారు. 

36
ఒక తబలాతోనే అద్భుతం చేసిన ఇళయరాజా

1985లో వచ్చిన 'ముదల్ మరియాదై'లోని "రాసావే ఉన్నై నంబి..." పాటలో ఇళయరాజా కేవలం 'తబలా' మాత్రమే వాడారు. జానకి గారి గాత్రానికి ఆ తబలా లయ ఒక అద్భుతమైన నేపథ్యాన్ని ఇచ్చింది.

ఎందుకు తబలా?: ఒక మహిళ ఒంటరితనాన్ని, ఆమె Sehnsucht (yearning) చెప్పడానికి హృదయ స్పందన లాంటి లయ చాలని రాజా భావించారు.

46
'పుంజై ఉండు నంజై ఉండు' పాటతో నేల సవ్వడి.!

'ఉన్నాల్ ముడియుం తంబి'లోని "పుంజై ఉండు నంజై ఉండు..." పాటలో, ఇళయరాజా 'ఘటం', 'తవిల్' వంటి దేశీయ వాయిద్యాలనే వాడారు. ఇది ఆ పాటకు సహజమైన గ్రామీణ అనుభూతినితీసుకొచ్చింది. 

56
ఒకే సంగీత వాయిద్యంతో బీజీఎం

పాటలే కాదు, BGMలోనూ రాజా ఈ టెక్నిక్ వాడారు. 'మౌన రాగం'లో వేణువు, 'నందలాలా'లో పియానో వంటి ఒకే వాయిద్యంతో సన్నివేశపు పూర్తి భావాన్ని పలికించారు. ఇది ఆయనకే సాధ్యం. ఇలా ఒకే వాయిద్యంతో 9వేల భావోద్వేగాలను పలికించి మెప్పించారు ఇళయరాజా.

66
ఒకే వాయిద్యంతో సృష్టించిన కావ్యం

ఇళయరాజా సంగీతం సాంకేతికం కాదు, ఆధ్యాత్మికం. శిల్పిలా అనవసర శబ్దాలు తీసి, ఒకే వాయిద్యంతో సంగీత కావ్యాలు సృష్టిస్తారు. ఈ 'మినిమలిస్టిక్‌ మ్యూజిక్‌' శైలే ఆయన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇప్పటికీ ఆయన స్పెషల్‌గా నిలవడం  విశేషం. అంతేకాదు ఇప్పటికీ ఆయన పలు మార్లు ఇలాంటి ప్రయోగాలు చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. తానేంటో చాటుతున్నారు ఇళయారాజా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories