ఒంటరిగా ఐలాండ్‌లో ఉంటే.. సుడిగాలి సుధీర్‌ తోడు కోరుకుంటా.. రష్మి గౌతమ్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌ వైరల్‌

Published : May 09, 2023, 03:37 PM ISTUpdated : May 09, 2023, 04:44 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ చాలా రోజులుగా విడిపోయారు. సుధీర్‌ `జబర్దస్త్`ని వదిలేశాడు. కానీ రష్మి మనసులో ఇంకా ఆయనే ఉన్నాడని తాజాగా స్పష్టమైంది. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

PREV
16
ఒంటరిగా ఐలాండ్‌లో  ఉంటే.. సుడిగాలి సుధీర్‌ తోడు కోరుకుంటా.. రష్మి గౌతమ్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌ వైరల్‌

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ మధ్య కెమిస్ట్రీ గురించి అందరికి తెలిసిందే. నిజంగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనేంతగా షోస్‌లో హంగామా చేశారు. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేమనేంతగా తమ ప్రేమని వ్యక్తం చేస్తూ, డ్యూయెట్లు పాడుకుంటూ, ఏకంగా షోలోనే పెళ్లి పీఠలెక్క హడావుడి చేశారు. కట్‌ చేస్తే ఇప్పుడు ఇద్దరూ విడిపోయారు. సుధీర్‌ `జబర్దస్త్` షోని వదిలేయడంతో రష్మి ఒంటరైపోయింది. ఇద్దరి మధ్య చాలా గ్యాప్‌ వచ్చింది. వీరి ప్రేమ ఆటకెక్కినట్టే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

26

కానీ సుడిగాలి సుధీర్‌పై ప్రేమ మాత్రం తగ్గలేదు. తన మనసులో ఇంకా అతనే ఉన్నాడని అర్థమవుతుంది. తాజాగా ఓ షో వేదికపై ఈ విషయాన్ని రష్మి గౌతమ్‌ వెల్లడించింది. ఒంటరిగా ఉంటే తాను సుధీర్‌ తోడు కోరుకుంటానని, ఆయన కంపెనీని ఇష్టపడతానని తెలిపింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. అంతేకాదు వీరిద్దరి రహస్య బంధాన్ని, సీక్రెట్‌ ప్రేమని చాటి చెబుతుందని అంటున్నారు. మరి ఇంతకి ఏం జరిగిందంటే. 

36

`జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు యాంకర్‌గా చేస్తున్న రష్మి.. స్టార్‌ మాలో ఓంకార్‌ హోస్ట్ గా చేస్తున్న `సిక్త్స్ సెన్స్` షోకి గెస్ట్ గా వెళ్లింది. నటుడు బ్రహ్మాజీతో కలిసి ఆమె సందడి చేసింది. రష్మి, బ్రహ్మాజీల మధ్య కామెడీ నవ్వులు పూయించింది. రష్మిని బ్రహ్మాజీ గోకడం హైలైట్‌గా నిలచింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి `పుష్ప`లోని ఊ అంటావా మావ.. పాటకి స్టెప్పులేశారు. మాస్‌ బీట్‌కి, అంతే మాస్‌గా డాన్సులు చేసి అదరగొట్టారు. 
 

46

అనంతరం రష్మికి ఓ పరీక్ష పెట్టాడు ఓంకార్‌. తన షోలో గెస్ట్ లను `ఒక్క సెకన్‌` అంటూ సస్పెన్స్ తో చంపేయడం ఆయన స్టయిల్‌. ఆ సస్పెన్స్ తట్టుకోలేక హార్ట్ బీట్‌ పెరిగిపోతుంటుంది. అయితే ఆ గేమ్‌ అనంతరం రష్మిని చిక్కుల్లో పడేసే ప్రశ్న వేశాడు ఓంకార్‌. నువ్వు ఒంటరిగా ఓ ఐలాండ్‌లో ఇరుక్కుపోతే, మీతో ఉండటానికి టాలీవుడ్‌లో ఏ హీరోని ఎక్స్ పెక్ట్ చేస్తారు` అని ప్రశ్నించాడు. పరోక్షంగా చెప్పాలంటే ఏ హీరోతో డేట్‌ చేస్తారని అడిగాడు ఓంకార్‌. 
 

56

దీనికి మొదట కాసేపు ఆలోచించి, తడబడినట్టుగా చేసిన రష్మి.. ఆ తర్వాత స్పష్టంగా తన సమాధానం చెప్పింది. కచ్చితంగా సుధీర్‌ కంపెనీగా ఉంటే చాలా బాగుంటుంది` అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. దీంతో రష్మి ఆన్సర్‌తో ఆ షోలో ఆడియెన్స్ గోలతో హోరెత్తించారు. రష్మి మనసులో మాట, భావం బయటకు వచ్చిందని, ఆమె మనసులో సుధీర్‌ ఉన్నాడని అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు సుధీర్‌, రష్మి జోడీ ఫరెవర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

66

ఎంత దూరమైనా, ఎన్నేళ్లయినా వారి ప్రేమ అలానే ఉండిపోతుందని, వీరిద్దరిది నిజమైన ప్రేమ అని, తమ ప్రేమని మరోసారి చాటుకున్నారని అంటున్నారు. బుల్లితెరపై రష్మి, సుధీర్‌ల జోడీ ఫరెవర్‌ అని, సుధీర్‌, రష్మి జోడీని మిస్‌ అవుతున్నామని అంటున్నారు. మొత్తంగా ఈ `సిక్త్ సెన్స్` లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది. రష్మి బోల్డ్ స్టేట్‌మెంట్‌ మాత్రం ఇప్పుడు రచ్చ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories