Custody : నాగచైతన్య ‘కస్టడీ’.. స్టోరీ ఆ సినిమా నుంచి కొట్టేశారా?

First Published | May 9, 2023, 1:34 PM IST

మూడు రోజుల్లో నాగచైతన్య ‘కస్టడీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్  సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా, కథకు సంబంధించి క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
 

సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలవాలంటే స్టోరీ ప్రధానమే విషయం తెలిసిందే. కథ బాగుంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రాలు ఆడియెన్స్ ను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. 
 

అయితే, రోటీన్ కు భిన్నంగా సినిమాలను రూపొందించేందుకు దర్శకనిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. ఇందుకోసం కొత్తకథలను ఎంపిక చేసుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ చిత్రాల నుంచి కూడా ప్రేరణ పొందిన ఘటనలు కూడా ఉన్నాయి.
 


కాగా, అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటించిన Custody కథ గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. 2012 ఫిబ్రవరి 17లో ప్రముఖ దర్శకుడు డేనియల్ ఎస్పినోసా డైరెక్షన్ లో వచ్చిన Safe House నుంచి కథను తీసుకున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

‘కస్టడీ’ నుంచి ఇప్పటికే వచ్చిన ట్రైలర్, ‘సేఫ్ హౌజ్’ ట్రైలర్ కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంటుంది. కథ పరంగా చూస్తే స్టోరీ లైన్ ఒకేలా కనిపిస్తోంది. ఎన్నో హత్యలకు కారణమైన వ్యక్తిని జైలు నుంచి తప్పించడమే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇదే స్టోరీ లైన్ తో ‘కస్టడీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. వెంకట్ ప్రభు మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను జోడీ చేయడంతో సినిమా ఆసక్తికరంగా మారింది.
 

ఇప్పటి వరకు విడుదలైన చిత్ర ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా కథపై ఆస్తని పెంచడం, నాగ్య చైతన్య కూడా తొలిసారిగా పోలీసు పాత్రలో నటిస్తుండటం.. పెర్ఫామెన్స్ కూడా మెప్పించేలా కనిపిస్తుండటంతో సినిమాపై హైప్ పెరిగింది. 
 

‘బంగార్రాజు’ తర్వాత  నాగచైతన్య - కృతి శెట్టి  జంటగా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ నిర్మించారు. మే12న చిత్రం ఐదు భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు కానుంది. మాస్ట్రో ఇళయరాజా, కొడుకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 
 

Latest Videos

click me!