నవ్యస్వామి ఐ లవ్యూ చెబితే.. రవికృష్ణ సమాధానమేంటి? యాంకర్‌ ముందు అడ్డంగా దొరికిపోయిన `విరూపాక్ష` నటుడు

Published : Jun 01, 2023, 04:21 PM ISTUpdated : Jun 01, 2023, 04:22 PM IST

టీవీ నటులు రవికృష్ణ, నవ్యస్వామి బుల్లితెరపై బాగా ఫేమస్‌ అయ్యారు. హిట్‌ పెయిర్‌గానూ నిలిచారు. అదే సమయంలో ఈ ఇద్దరు లవ్‌ లోనూ ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై నటుడు రవికృష్ణ ఓపెన్‌ అయ్యాడు. తమ రిలేషన్‌షిప్‌ గురించి క్లారిటీ ఇచ్చారు. కానీ దొరికిపోయాడు.   

PREV
15
నవ్యస్వామి ఐ లవ్యూ చెబితే.. రవికృష్ణ సమాధానమేంటి? యాంకర్‌ ముందు అడ్డంగా దొరికిపోయిన `విరూపాక్ష` నటుడు

బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌గా రాణిస్తున్నారు నటుడు రవికృష్ణ, నవ్యస్వామి. ఈ ఇద్దరు కలిసి కొన్ని సీరియల్స్ చేయడం, ఈ జంట మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్‌ కావడంతో నిజంగానే ఈ ఇద్దరు లవర్స్‌ అని, ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. పైగా టీవీ షోస్‌లోనూ ఈ ఇద్దరు కలిసి పాల్గొనడంతో ఆ రూమర్స్ కి బలం చేకూరింది. బుల్లితెర నటుల్లో ఈ జోడీకి మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. 
 

25

ఇప్పటికే తమ రిలేషన్‌షిప్‌పై అటు నవ్యస్వామి, ఇటు రవికృష్ణ స్పందించారు. మంచి స్నేహితులమని తెలిపారు. లవ్‌, పెళ్లి విషయాలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా రవికృష్ణ.. `సుమన్‌ టీవీ` కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మరోసారి నవ్వస్వామితో రిలేషన్‌షిప్‌పై ప్రశ్న ఎదురయ్యింది. దీనిపై రవికృష్ణ స్పందిస్తూ, తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. అయితే టీవీ షోస్‌ కి పెయిర్‌ కావాలనుకున్నప్పుడు తమది హిట్‌ పెయిర్‌ అని తమని పిలుస్తున్నారని, అది తనకి, నాకూడా కంఫర్ట్ గానే ఉందన్నారు, కానీ పక్క పక్కన కనిపిస్తే చాలా సోషల్‌ మీడియా తమ మీద ఏవేవో ఏస్తున్నారని అన్నారు రవికృష్ణ. 
 

35

హిట్‌ పెయిర్‌, ఇద్దరి మధ్య కంఫర్ట్ ఉంది అని, కానీ పెళ్లి అనే ఆలోచన అస్సలు లేదని, ఇప్పటి వరకు అలా ఎప్పుడూ ఆలోచించలేదన్నారు రవికృష్ణ. ఇప్పటికీ ఇద్దరం టచ్‌లోనే ఉంటామని, మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నామని తెలిపారు. ఇద్దరు వేర్వేరు యాక్టర్స్ తో చేసినప్పుడు ఈ డిఫరెంట్స్ ఉంటుందని, ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేరని, హిట్‌ సీరియల్‌ పెయిర్ కాబట్టి జనాల్లో ఆ ప్రభావం ఉంటుందని, నెమ్మదిగా అదే సెట్‌ అవుతుందన్నారు. 

45

ఈ క్రమంలో.. ఓ రోజు నవ్యస్వామి వచ్చి ఐ లవ్యూ అని చెబితే మీ రియాక్షన్‌ ఏంటని యాంకర్‌ ప్రశ్నించగా.. తమ మధ్య లవ్‌(ఫ్రెండ్లీగా చెప్పుకునే లవ్‌) ఉందని, అది ఎప్పుడూ ఉంటుందన్నారు. కానీ రియల్‌ లవ్‌ గురించి ఏంటని ప్రశ్నించగా, ఒకవేళ అలా వచ్చి చెప్పినప్పుడు చూద్దాం అని, నిజంగానే అలా చెబితే అప్పుడు ఆలోచిద్దాం` అని తెలిపాడు రవికృష్ణ. కానీ ఏం లేదంటూనే సమ్‌ థింగ్‌ ఏదో ఉందనే హింట్‌ మాత్రం ఇచ్చాడు రవికృష్ణ. 

55

రవికృష్ణ, నవ్య స్వామి కలిసి చివరగా `ఆమె కథ` సీరియల్‌లో నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరు సినిమాలపై ఫోకస్‌ పెట్టారు. ఇటీవల `విరూపాక్ష`లో నెగటివ్‌ రోల్‌లో నటించాడు రవికృష్ణ, అంతకుముందు `అనుభవించు రాజా`లో నటించాడు. మరోవైపు నవ్యస్వామి సైతం సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. ఆమె `ఇంటింటి రామాయణం`, `బుట్టబొమ్మ`, `రావణాసుర` వంటి సినిమాల్లో మెరిసింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories