విజయ్‌ దేవరకొండని ఉద్దేశించి సమంత పోస్ట్ వైరల్‌.. అవన్నీ ప్రత్యక్షంగా చూశా అంటూ కామెంట్‌..

Published : Jun 01, 2023, 02:29 PM ISTUpdated : Jun 01, 2023, 05:32 PM IST

సమంత గత రెండేళ్లలో అనేక అనుభవాలను ఎదుర్కొంది. జీవితాన్ని మొత్తం చూసేసింది. వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్‌, ఆరోగ్య పరంగానూ ఆమె ఎన్నో సవాళ్లని ఫేస్‌ చేసింది. అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

PREV
15
విజయ్‌ దేవరకొండని ఉద్దేశించి సమంత పోస్ట్ వైరల్‌.. అవన్నీ ప్రత్యక్షంగా చూశా అంటూ కామెంట్‌..

సమంత ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి `ఖుషి` సినిమాలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా మూవీగా ప్లాన్‌ చేస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామా అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని యూనిట్‌ చెబుతుంది. సరికొత్తగా ఈ స్టోరీ సాగుతుందని సమాచారం. శివ నిర్వాణ ఫ్యామిలీ డ్రామాని తెరకెక్కించడంలో దిట్ట. ఇప్పుడు ఆయన ఈ సినిమాని మరింతగా రక్తికట్టించేలా తెరకెక్కించారని సమాచారం. 
 

25

సమంత, విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. గతంలో `మహానటి`లో ఈ ఇద్దరు జంటగా నటించారు. అందులో విజయ్‌, సమంతల మధ్య లవ్‌ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ జంట మెప్పించింది. ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయిలో ఆకట్టుకునేందుకు వస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభమై ఏడాది దాటింది. ఈ నేపథ్యంలో సమంత ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టింది. విజయ్‌ దేవరకొండతో స్నేహాంపై ఓ పోస్ట్ పెట్టింది.  

35
Image: Vijay Deverakonda, Samantha Ruth Prabhu/Instagram

`విజయ్‌.. మీ బెస్ట్ ని చూశా, మీ బ్యాడ్‌ని చూశా, నవ్వు చివరికి వచ్చేది చూశా, ముందు రావడాన్ని చూశా, మీ పతనాన్ని చూశా, మీ ఎదుగుదల చూశా, కొంత మంది స్నేహితులు మనతో నిలబడి ఉంటారు. ఇలా మీతో ఏడాది ఎంత బాగా గడిచిందో` అంటూ వైట్‌ లవ్‌ ఎమోజీలను పంచుకుంది సమంత. ఇలా తన ప్రేమకి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌ అవుతుంది. తమ మధ్య ఉన్న స్నేహాన్ని  చాటి చెప్పింది సమంత. కష్ట సమయంలో తనకు అండగా నిలిచాడని, సపోర్ట్ గా ఉన్నాడనే విషయాన్ని సమంత ఈ పోస్ట్ ద్వారా వెల్లడించింది.  ఆమె పోస్ట్ లో భాగంగా ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో వీరిద్దరు డిన్నర్‌ చేస్తూ కనిపించారు. ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇది టర్కీలో జరుగుతున్న `ఖుషి`షూటింగ్‌లోని పిక్‌ కావడం విశేషం.

45

సమంత ఈ రెండేళ్లలో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్‌ చేసిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో వచ్చిన బేధాభిప్రాయాలతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకుని సరిగ్గా నాలుగేండ్లకే విడిపోవడం సమంత జీవితంలో అతి పెద్ద విషాదం లాంటి విషయమనే చెపాలి. దీన్నుంచి ఆమె బయటపడేలోపే అనారోగ్యం(మయోసైటిస్‌) ఆమెని వెంటాడింది. కొన్ని నెలలు దానితో పోరాడింది. ఇది తన జీవితంలో అతిపెద్ద పెయిన్‌ ని ఆమె భరించింది. మరోవైపు `యశోద`, `శాకుంతలం` వంటి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రెండు చిత్రాలు పెద్దగా ఆడలేదు. మరీ ముఖ్యంగా `శాకుంతలం` చిత్రం ఆమెకి అతిపెద్ద డిజాస్టర్‌ ఇచ్చింది. 

55

ప్రస్తుతం సమంత.. హిందీలో `సిటాడెల్‌` ఇండియా వెర్షన్‌ రీమేక్‌లో నటిస్తుంది. షాహిద్‌ కపూర్‌తో ఆమె జోడీ కడుతుంది. దీంతోపాటు ఓ హాలీవుడ్‌ చిత్రంలో ఎంపికైంది సమంత. వరుసగా విలక్షణమైన సినిమాలు, పాత్రలు చేస్తుంది. విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న `ఖుషి` చిత్రం సెప్టెంటర్‌ 1న విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories