తిరుమలలో కీర్తి సురేష్.. తమిళ తంబీల ట్రోలింగ్,తిప్పి కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

Published : Jun 01, 2023, 03:37 PM IST

కీర్తి సురేష్ పై తమిళ నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్నా చితకా విషయాలకే అనవసర రాద్దాంతం చేసే.. అరవ ప్రేక్షకులు కొంత మంది.. కీర్తిసురేష్ ను ట్రోల్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఆమెను సపోర్ట్ చేస్తే.. ట్రోల్స్ ను తిప్పుకొడుతున్నారు. ఇంతకీ కీర్తి చేసిన తప్పేంటి. 

PREV
16
తిరుమలలో కీర్తి సురేష్.. తమిళ తంబీల ట్రోలింగ్,తిప్పి కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

ప్రస్తుతం జోరుమీద ఉంది హీరోయిన్‌ కీర్తి సురేష్‌.. వరుస సినిమాలు తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.  తాజాగా దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన కీర్తి.. ఈసినిమాతో పాన్ ఇండియా  బాక్సాఫీస్‌ వద్ద సూపర్ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. అంతే కాదు  కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది ఈసినిమాల్ నానితో పాటు డీ గ్లామర్ లుక్ లో కనిపించి మురిపించింది బ్యూటీ.  

26

ఇక ప్రస్తుతం తెలగుతో పాటు తమిళ సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉంది బ్యూటీ.  టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా భోళాశంకర్ సినిమాలో కనిపించబోతున్న కీర్తి సురేష్.. తమిళంలో మాత్రం  సైరన్‌, రఘుతాత, రివాల్వర్‌ రీతా సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు జోరుగా షూటింగులు జరుపుకుంటున్నాయి. ఈక్రమంలో కీర్తి సురేష్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

36

వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉంటూ.. అలసిపోయిన  కీర్తి సురేష్‌.. పనికి కొంత విరామం ఇచ్చి.. రిలీక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈక్రమంలో ఆమె  తాజాగా, కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు చక్కగా తెలుగులో  సమాధానం ఇచ్చారు.
 

46

ఇక  ఈ నేపథ్యంలోనే ఓ తమిళ రిపోర్టర్‌ ఆమెను తమిళంలో మాట్లాడమని అడిగాడు. అందుకు కీర్తి సురేష్‌  నేను తిరుపతిలో ఉన్నాను వారు తెలుగులో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి తెలుగులోనే సమాధానం ఇస్తాను అన్నట్టు క్యాజువల్ గా  అన్నారు. అంతే కాదు  తెలుగులోనే  మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె  సమాధానం ఇచ్చారు. దాంతో పనిలేని కొంత మంది నెటిజన్లు ఆమెపై మండిపడుతూ.. ట్రోల్ చేస్తున్నారు. 

56

కీర్తి సురేష్ అలా అనడాని తప్పు పడుతూ.. కొంతమంది తమిళ నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.కీర్తి సురేష్‌ తమిళ భాషను అవమానపరిచే విధంగా మాట్లాడారని కోప్పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తూ.. ఆమెపై దారుణంగా ట్రోల్స్ మొదలు పెట్టారు. దీంతో ఆమెను సపోర్ట్ చేస్తూ కూడా తమిళనాట ఓ వర్గం ట్రోల్స్ ను తిప్పికొడుతోంది. అంతే కాదు.. వారికి తెలుగు నెటిజన్లు కూడా తోడయ్యారు. ట్రోలర్స్ కురివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. 
 

66

అసలు అక్కడ విషయం సీరియస్ గా తీసుకునేది కాదు.. అసలు అందులో  అర్థంపర్థంలేదు. అయినా కూడా మితిమీరిన పిచ్చితో ఇలా  ట్రోలింగ్స్‌ చేయటం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతీ విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడ్డం మానాలని హితవుపలుకుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories