బాహుబలి సినిమాతో టాలీవుడ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు రాజమౌళి.. తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళిన రాజమౌళిని టాలీవుడ్ లో ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. తెలుగు సినిమా అంటే చీప్ గా చూసే బాలీవుడ్ కు, కోలీవుడ్ కు మన సినిమా గొప్పతనం ఏంటో చూపించాడు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే అనే విధంగా మార్చి చూపించాడు రాజమౌళి.