రాజ్ తరుణ్ కి పర్సనల్ లైఫ్ లోనే కాదు.. ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఊహించని దెబ్బ, ఇలా జరిగిందేంటి..

First Published | Aug 3, 2024, 7:41 PM IST

కెరీర్ ఆరంభంలో రాజ్ తరుణ్ తనకంటూ ప్రత్యేక శైలి ఉన్న నటుడిగా గుర్తింపు తెచుకున్నాడు. వరుస హిట్లు కూడా పడ్డాయి. దీనితో కెరీర్ లో దూసుకుపోవడం ఖాయం అనే ప్రశంసలు దక్కాయి.

కెరీర్ ఆరంభంలో రాజ్ తరుణ్ తనకంటూ ప్రత్యేక శైలి ఉన్న నటుడిగా గుర్తింపు తెచుకున్నాడు. వరుస హిట్లు కూడా పడ్డాయి. దీనితో కెరీర్ లో దూసుకుపోవడం ఖాయం అనే ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీకి మరో రవితేజ దొరికాడు అనే ప్రశంసల్ని కూడా రాజ్ తరుణ్ అందుకున్నారు. 

కానీ ఆ తర్వాత రాజ్ తరుణ్ కెరీర్ ట్రాక్ తప్పింది. వరుస సినిమాలు చేస్తూ తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. అప్పుడప్పుడూ చిన్న చిన్న వివాదాల్లో రాజ్ తరుణ్ పేరు వినిపించేది. అయితే అవేమి అతడి కెరీర్ ని ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన లావణ్య వ్యవహారం మాత్రం రాజ్ తరుణ్ ని కుదుపు కుదిపేసింది అనే చెప్పాలి. 


రాజ్ తరుణ్..లావణ్యతో కొన్నేళ్లు సహజీవనం చేశాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ తనకి దూరం అయిపోతున్నాడని కొందరు హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకుంటున్నాడని లావణ్య పోలీసులని ఆశ్రయించింది. తమది భార్య భర్తల సంబంధం అని.. రెండుసార్లు రాజ్ తరుణ్ తనకి అబార్షన్ కూడా చేయించాడని లావణ్య చెబుతోంది. 

రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేసింది. అంతటితో ఆగకుండా మీడియా చుట్టూ తిరుగుతూ రాజ్ తరుణ్ పర్సనల్ విషయాలన్నీ బయట పెడుతోంది. దీనితో రాజ్ తరుణ్ సతమతమవుతున్నాడు. ఈ గ్యాప్ లో రాజ్ తరుణ్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 

Raj Tarun

పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు ఎలాగూ వచ్చాయి.. ఈ వివాదం వల్ల రాజ్ తరుణ్ చిత్రాలకు పబ్లిసిటీ వస్తుంది అని అనుకున్నారు. కొన్ని రోజుల క్రితం పురుషోత్తముడు చిత్రం విడుదలయింది. ఆ చిత్రాన్ని ఆడియన్స్ పట్టించుకోలేదు. అసలు ఈ వివాదానికి కారణం అయిన తిరగబడరా సామీ చిత్రం విడుదలయింది. 

Raj Tarun

ఈ చిత్రంతోనే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మధ్య ప్రేమ చిగురించింది అని.. రాజ్ తరుణ్ తనని పక్కన పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. తమ చిత్రం కోసం ఒకవైపు ఆరోపణలు వస్తున్నా రాజ్ తరుణ్, మాల్వి ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి తిరగబడరా సామీ చిత్రాన్ని ప్రమోట్ చేశారు.

 రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బ కొట్టిన వివాదం.. ప్రొఫెషనల్ లైఫ్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. దీనితో రెండు వరుస ఫ్లాపులతో రాజ్ తరుణ్ కెరీర్ కి కూడా దెబ్బ పడింది. 

Latest Videos

click me!